ఆరోగ్యహక్కు బిల్లుకు ఆమోదం.. ఇకపై వైద్య సేవలను ఉచితం..

ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ.. పోలీసు క్లియరెన్స్‌ల అవసరం కానీ లేదు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు ఉచితంగానే ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించాలి..  రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మార్చి 21 అసెంబ్లీలో ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ రూపొందించిన ఆరోగ్య హక్కు బిల్లు పై ప్రైవేటు వైద్యులుతమ ఆందోళనను మంగళవారంనాడు విరమించారు. రాజస్థాన్ సర్కార్‌కు, ప్రైవేటు డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని..  ఈ విషయం […]

Share:

ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ.. పోలీసు క్లియరెన్స్‌ల అవసరం కానీ లేదు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు ఉచితంగానే ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించాలి.. 

రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మార్చి 21 అసెంబ్లీలో ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ రూపొందించిన ఆరోగ్య హక్కు బిల్లు పై ప్రైవేటు వైద్యులుతమ ఆందోళనను మంగళవారంనాడు విరమించారు. రాజస్థాన్ సర్కార్‌కు, ప్రైవేటు డాక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని..  ఈ విషయం తనకు చాలా సంతోషం కలిగించిందని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. మన దేశంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా రాజస్థాన్‌కు కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది..

డిమాండ్స్ కి ఒప్పుకున్నారు..

ఆరోగ్య హక్కు బిల్లుపై ప్రైవేటు డాక్టర్లు కొద్దిరోజులుగా ఆందోళన‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న గెహ్లాట్ ప్రభుత్వం  ప్రైవేటు వైద్యుల ప్రతినిధుల బృందంతో చర్చలు చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్,  ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, యునైటెడ్ ప్రైవేట్ క్లినిక్ అండ్ హాస్పిటల్స్ అసోసియేషన్‌లోని పలువురు ప్రతినిధుల బృందం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఆ తరువాత 8 పాయింట్లతో కూడిన మెమొరాండంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. సబ్సిడీ రేటుకు భూములు, భవనాలు వంటి ప్రభుత్వ సాయం తీసుకోని ప్రైవేటు ఆసుపత్రులను ఆర్‌టీహెచ్ బిల్లు పరిధి నుంచి మినహాయించాలంటూ తాము చేసిన ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుందని ఆందోళనకు దిగిన డాక్టర్లు  వివరించారు..  

ఏకతాటిపైకి వచ్చాం..

ప్రభుత్వానికి, ప్రైవేటు వైద్యులకు మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో దేశంలోనే ఆరోగ్య హక్కు బిల్లును అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రం క్రెడిట్ రాజస్థాన్‌కు దక్కిందని అశోక్ గెహ్లాట్ తన ట్వీట్‌లో తెలిపారు. వైద్యులు, పేషెంట్ల మధ్య ఉండే సత్సంబంధాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. వైద్యులు ప్రభుత్వం చర్చించుకున్న సమావేశాల్లో ఏకతాటి పైకి వచ్చి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన ట్విట్టర్లో తెలిపారు.

రాజస్థాన్ ఆరోగ్య హక్కు బిల్లు..

రాజస్థాన్‌లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను ఈ బిల్లు అమలు అవుతుంది. ఉచిత వైద్య సేవలను పౌరుల హక్కుగా అందిస్తుంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఉచితం. మందులు, డయాగ్నోస్టిక్ సేవలు, వైద్య పరీక్షలు ఉచితం. ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితం. ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కానీ.. పోలీసు క్లియరెన్స్‌ల అవసరం కానీ లేదు. ఆసుపత్రికి వెళ్లి వచ్చేందుకు ఉచితంగానే ట్రాన్స్‌పోర్ట్ సేవలు అందించాలి.. ఇలాంటి బిల్లునే మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని చేయాలని మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

అత్యవసర చికిత్స అన్నది ప్రతి పౌరుడు హక్కుగా ఉండాలని రాజస్థాన్ ప్రభుత్వం చెబుతోంది .  కేంద్ర రహదారులు రవాణా శాఖ గణాంకర ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న నాలుగు లక్షల రోడ్డు ప్రమాదాలలో ఒకటిన్నర లక్షలకు పైగా మంది చనిపోయారు మరో నాలుగు లక్షల మంది క్షతగాత్రులయ్యారు. వీటిలో ఒక్క రాజస్థాన్లోనే 20వేల మందికి ప్రమాదాలు జరిగాయి. 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అత్యవసర సమయాల్లో చికిత్సను అందించేందుకుఏ హాస్పటల్ కూడా నిరాకరించకూడదని గహ్లోత్ ప్రభుత్వ వాదన . ఢిల్లీ ప్రభుత్వం ఎప్పటికే ఈ తరహా పథకాన్ని అమలు చేస్తోంది. రాజస్థాన్లో పాము కాటికి గురయ్యే వారు ఎక్కువ. పాము కాటు బాధితులు అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందే అవకాశం ఉంటుంది . అయితే ఈ బిల్లు వల్ల నాణ్యమైన వైద్యం అందకపోవచ్చు అని భారత వైద్య సంఘం అనుమానిస్తోంది. ప్రజలు నిజంగానే ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి వాటి ద్వారా మేలైన సేవలు అందించాలని కొందరు డాక్టర్ల వాదన.