ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ సూచన

మరో 3, 4 రోజుల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర, బీహార్ ,జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌గడ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ విభాగం శనివారం మధ్య మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుండి 42 డిగ్రీల సెల్సియస్ సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు నమోదయ్యాయని తెలిపింది. […]

Share:

మరో 3, 4 రోజుల్లో పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర, బీహార్ ,జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌గడ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ విభాగం శనివారం మధ్య మరియు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 నుండి 42 డిగ్రీల సెల్సియస్ సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు నమోదయ్యాయని తెలిపింది.

గంగానది తీరంలోని పశ్చిమబెంగాల్‌లోని అనేక ప్రాంతాలు, ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్రలో సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కార్యాలయం తన బులెటిన్ లో పేర్కొంది. ఈ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇక ఇవి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సాధారణం కంటే 1-3 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అంతే కాదు రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా 1-2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని.. ఆ తర్వాత దాదాపు 2-4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని కూడా అంచనా వేస్తోంది. ఇక మరొకవైపు ఏప్రిల్ 15 రాత్రి నుండి ఏప్రిల్ 19 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరుగా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని స్పష్టం చేసింది. వర్షాలు కురిసే అవకాశం ఒక్క పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోనే కాదు పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ , హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ రాజస్థాన్‌లో కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు ఏప్రిల్ 17, 19 తేదీలలో పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో వడగండ్ల వానలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతో భారీగా వర్షపాతం కూడా నమోదు కావచ్చు. రాబోయే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు ఉండదని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే వచ్చే నాలుగు రోజుల్లో క్రమంగా 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాబోయే ఐదు రోజుల్లో మహారాష్ట్రలోని విదర్భలో.. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్య సూచన ఉంది.
అలాగే ఏప్రిల్ 15 , 18, 19 తేదీలలో ఈ వాతావరణం మధ్యప్రదేశ్ మరియు చత్తీస్గడ్లపై కూడా ప్రభావం చూపుతుందని సమాచారం. ఇక రాబోయే ఐదు రోజుల్లో వెస్ట్ ఇండియా అయిన కొంకణ్, గోవా ,మధ్య మహారాష్ట్ర, మరాట్వాడా ప్రాంతాలలో వర్షాలు మోస్తారుగా నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అందించిన బులెటిన్ ప్రకారం మంగళవారం, బుధవారం రోజుల్లో రాజస్థాన్‌లోని కొంత పశ్చిమ భాగంలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. కోస్తా కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లలో శనివారం వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 15 – 17 వరకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది అంతేకాదు ఏప్రిల్ 15, 19 తేదీలలో ఉత్తర కర్ణాటకలో కూడా వర్షాలు పడవచ్చు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో అత్యధికంగా 42.1 డిగ్రీల సెన్సెస్ ఉష్ణోగ్రత నమోదు కాగా పరిస్థితులను కొనసాగింపు సూచిస్తుంది. కానీ ఉరుములు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఆకస్మిక బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం  ఉంది.