యువసేన నుంచి శివ సేనలోకి రాహుల్ కునాల్      

మహారాష్ట్రలోని యువసేన పార్టీ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆ పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తూ ఆదిత్య తాకరే కి కుడి భుజం గా ఉంటూ వచ్చిన రాహుల్ కునాల్, యువసేన పార్టీ కి రాజీనామా చేస్తూ నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే  సమక్షం లో శివసేన పార్టీ లో చేరాడు. ఆధిత్య కి మొదటి నుండి కుడి భుజం గా ఉంటూ, అతనితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో […]

Share:

మహారాష్ట్రలోని యువసేన పార్టీ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆ పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తూ ఆదిత్య తాకరే కి కుడి భుజం గా ఉంటూ వచ్చిన రాహుల్ కునాల్, యువసేన పార్టీ కి రాజీనామా చేస్తూ నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే  సమక్షం లో శివసేన పార్టీ లో చేరాడు. ఆధిత్య కి మొదటి నుండి కుడి భుజం గా ఉంటూ, అతనితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని, ఆదిత్య తాకరే మనుగడకు వెన్నుముక లాగ నిలిచాడు రాహుల్ కునాల్. పార్టీ లో ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించేవాడు. అలాంటి వ్యక్తి నేడు రాజీనామా చెయ్యడం అనేది యువసేన పార్టీ కి కోలుకోలేని చావు దెబ్బ అనే చెప్పాలి. పార్టీ ప్రారంభం నుండి అందులోనే కొనసాగుతూ వచ్చిన రాహుల్ కునాల్ లాంటి వాడే బయటకి వచ్చేశాడంటే, ఆ పార్టీ ఎంత అద్వానంగా తయారు అయ్యిందో అని జనాలు కూడా అనుకోవడం ప్రారంభిస్తే వచ్చే ఎన్నికలలో ఘోరమైన ఫలితాలు తప్పవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పగలు రాత్రి అని తేడా లేకుండా పని చేసినందుకు మంచి బహుమతి ఇచ్చారు : రాహుల్ కునాల్ 

ఇది ఇలా ఉండగా ఆదిత్య ముంబై లో అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న బ్రిహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదే రోజు రాహుల్ పార్టీ కి రాజీనామా చేసాడు. ఆయన రాజీనామా చెయ్యడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయట.పార్టీ లో ఏది కూడా సక్రమంగా జరగడం లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్విట్టర్ లో తెలిపాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇన్నేళ్ల మన సుదీర్ఘ ప్రయాణం లో నన్ను ఇంతే అర్థం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నాను. ఇది నీ చేత ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు. కానీ చెప్పుడు మాటలు విని, నేను ఏమి మీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నానో కూడా వినకుండా నన్ను పదవి నుండి తొలగించడం అనేది మీ అహంకారానికి ప్రతీక. పగలు రాత్రి అని తేడా లేకుండా మీ కోసం పని చేసినందుకు మంచి బహుమతే ఇచ్చారు’ అంటూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

రాహుల్ కునాల్ కి ముందే MLC మనీష కాయందే కూడా గత నెల ప్రారంభం లోనే యువసేన పార్టీ కి రాజీనామా చేసి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సమక్షం లో శివ సేన పార్టీ లో చేరింది. ఈమె రాజీనామా చేసే ముందు రోజే పార్టీ లో సీనియర్ నేత గా కొనసాగుతున్న శీశీర్ షిండే కూడా రాజీనామా చేసాడు. పార్టీ అధినేత ఉద్ధవ్ తకారే పార్టీ లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి అందుబాటులో లేడని, ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోవడం , మాపై అధికారం చెలాయించడం , మమల్ని బానిసలుగా చూడడం వంటివి భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాహుల్ కునాల్ కూడా వీళ్ళు చెప్పిందే చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే ఆడుతున్న గేమ్ ప్లాన్ లాగ అనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుండి యువ సేన ముఖ్యనేతలతో రహస్య మంతనాలు జరుపుతూ ఏకనాథ్ షిండే, ఒక్కొక్కరిగా ఆ పార్టీ నుండి అందరినీ లాక్కొని, యువ సేన పార్టీ ని సున్నా చెయ్యాలనే ప్లాన్ లో భాగం గానే ముఖ్యమంత్రి ఈ ఆపరేషన్ ని మొదలు పెట్టారని శివ సేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.