మణిపూర్ అల్లర్ల కోసం ఇండియన్ ఆర్మీ

ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా ఊరట లభించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మణిపూర్ విషయాల గురించి నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ని మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి సిద్ధం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.  దీనికి స్పందించిన బీజేపీ నాయకుడు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా, […]

Share:

ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా ఊరట లభించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మణిపూర్ విషయాల గురించి నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ ని మణిపూర్ అల్లర్లను చల్లార్చడానికి సిద్ధం చేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 

దీనికి స్పందించిన బీజేపీ నాయకుడు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వా, ఇండియన్ ఆర్మీ వల్ల మణిపూర్ లోని అల్లర్లు చల్లారే అవకాశం లేదని, 100 రోజులుగా జరుగుతున్న హింస ను ఆపేందుకు ఇండియన్ ఆర్మీ సరిపోదు అంటూ వాక్యానించారు. మణిపూర్ హింస గురించి మాట్లాడిన అస్సాం చీఫ్ మినిస్టర్, ఒకవేళ ఇండియన్ ఆర్మీ మణిపూర్ లో అడుగుపెడితే అది విద్వాంసానికి దారితీస్తుందంటూ, ప్రజల మీద బుల్లెట్లు వర్షం కురిపించి హింస ఆపడం తప్పిస్తే మరొకటి ఉండదు అంటూ రాహుల్ నిర్ణయాన్ని తిప్పికొట్టారు. అంతేకాకుండా, 1966 లో జరిగిన విధ్వంసం గురించి గుర్తు చేశారు. 1966లో మిజోరంలో సొంత భారతీయుల మీద బాంబు వేయడాన్నీ గుర్తు చేశారు. 

మణిపూర్ హింస గురించి బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు: 

నిజానికి పార్లమెంట్లో అడుగుపెట్టిన రాహుల్ డిబేట్ మొదలుపెట్టనున్నాడని, ఆయన ముఖ్యంగా 10 పాయింట్లు మీద డిస్కస్ చేస్తాడని సంబంధిత వర్గాలు చర్చకు ముందే తెలిపాయి. ఇందులో, ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం మీద, మణిపూర్ వైలెన్స్ మీద మోది ఎందుకు నోరు విప్పట్లేదు అనేదాని గురించి, కొన్ని ఆమోదించిన బిల్లుల విషయం మీద, మోదీ ఎందుకు డిబేట్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనే దానిమీద, ఇప్పటివరకు వైలెన్స్ లో చనిపోయిన వారి కుటుంబీకులోకి ఎటువంటి న్యాయం జరిగిందని అడిగేందుకు పార్లమెంట్లో చాలాసేపు చర్చ జరగడం జరిగింది. అంతేకాకుండా కేవలం నరేంద్ర మోదీ, బిజెపి నాయకులు, మణిపూర్ లో జరుగుతున్న హింస గురించి కేవలం కొన్ని సెకన్ల పాటే మాట్లాడడం ఇప్పటికీ ఆశ్చర్యస్పదంగా ఉందని, ఒకపక్క హింస జరుగుతుంటే పార్లమెంట్లో జోకులు వేసుకోవడం బిజెపి నాయకులకు మాత్రమే కుదిరిందని రాహుల్ వాపోయారు.

ఆగని హింస: 

ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న హింస గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక హింస మణిపూర్లో కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మణిపూర్ లో 144 సెక్షన్ నడుస్తుంది. షెడ్యూల్డ్ తెగల (ST) హోదా కోసం మణిపూర్‌లో మెయిటీ, అదేవిధంగా కుకీ తెగల మధ్య హింస చెలరేగిన తర్వాత ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కూడా ఎన్నో జరిగాయి. 

కేంద్ర ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ మరియు ఆర్మీ దళాలను మణిపూర్ రాష్ట్రానికి మోహరించినప్పటికీ, హింస మరియు హత్యలు కొనసాగడం గమనార్హం. అక్కడ ఉన్న చాలామంది రాజకీయ నాయకులను సైతం హత్యలు చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కొంతమంది నాయకులు తాము ఈ పరిస్థితిని అదుపు చేయలేమని చెప్పి రాజీనామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మణిపూర్ హింసపై సిబిఐ విచారణకు పిలుపు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. మణిపూర్ లో మరింత హింస గనక ఇప్పటినుంచి చోటు చేసుకుంటే ఖచ్చితంగా కాల్పులు జరుగుతాయని హెచ్చరిక చేసిన గవర్నమెంట్. 

అయితే రాహుల్ గాంధీ, మణిపూర్ లో వంద రోజులుగా జరుగుతున్న హింసను గురించి పార్లమెంట్లో చర్చించి, కచ్చితంగా ఇండియన్ ఆర్మీ ని దింపాలి అని అనడంపై కాంగ్రెస్ నాయకులు సపోర్టు చేయగా, మరోపక్క ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా బీజేపీ నాయకులు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిస్వాతో సహా చాలా మంది, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం గురించి వ్యతిరేకించారు.