రాహుల్ గాంధీ ప్ర‌ధాని అవుతాడు: అశోక్ గెహ్లోత్

ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా ఊరట లభించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పోటీ చేసే అర్హత రాహుల్ గాంధీకి ఉందని, వచ్చే 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో తప్పకుండా రాహుల్ గాంధీ హవా ఉంటుంది అని, తప్పకుండా రాహుల్ ప్రధానమంత్రి అయి చూపిస్తాడని, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ […]

Share:

ఇటీవల సుప్రీంకోర్టు ద్వారా ఊరట లభించిన రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టడం జరిగింది. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానం గురించి పార్లమెంట్లో చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పోటీ చేసే అర్హత రాహుల్ గాంధీకి ఉందని, వచ్చే 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో తప్పకుండా రాహుల్ గాంధీ హవా ఉంటుంది అని, తప్పకుండా రాహుల్ ప్రధానమంత్రి అయి చూపిస్తాడని, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాహుల్ కాబోయే పీఎం అంటున్నా అశోక్ గెహ్లాట్: 

తను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు అనే ఆశభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పైచేయిగా అవుతుందని ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రామినిస్టర్ అయ్యి చూపిస్తారని, తనదైన శైలిలో ఆశాభావం వ్యక్తం చేశారు అశోక్ గెహ్లాట్. అయితే 2014 కూడా నరేంద్ర మోదీ పీఎం అయిన తరువాత, పూర్తిగా తన సైలని మార్చేసాడని, కేవలం కాంగ్రెస్ కారణంగానే 2014లో నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అంతే కాకుండా నరేంద్ర మోదీ ఇప్పుడు మాట్లాడుతున్న మాటతీరు కోసం కూడా ప్రస్తావించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నట్లు మోదీ గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం వీలుపడకపోవచ్చు అంటూ మోదీ చేసిన వాక్యాలు తిప్పి కొట్టారు రాజస్థాన్ ముఖ్యమంత్రి గేహ్లాట్. ప్రజలకు తాము ఏం చేయాలన్న తనకి హక్కు ఉంటుందని వారి హక్కులను గౌరవించడం, ప్రతినిధులుగా మన హక్కు అంటూ గుర్తు చేశారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ పాలనలోకి రాకముందు చేస్తున్న హామీలను గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ప్రజలను మోసం చేస్తూ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ దుమ్మెత్తిపోశారు ముఖ్యమంత్రి. 

చంద్రయాన్ 3 ఎవరి సొత్తు కాదు: 

ఇటీవల సక్సెస్ఫుల్గా చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ దృవ్యం మీద అడుగుపెట్టిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ గురించి ప్రస్తావించారు అశోక్. అంతేకాకుండా, మిషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు పరిశోధకులను మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రయన్ 3 సక్సెస్ఫుల్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించినట్లు అందరు ముందు చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ, నిజానికి ఎటువంటి కృషి చేయలేదు అంటూ మాట్లాడారు అశోక్. కేవలం అప్పటిలో ప్రధాన మంత్రులుగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కృషి కారణంగానే ఇప్పుడు చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా చంద్రుడు మీద ల్యాండ్ అయిందని ఆయన మరొకసారి గుర్తు చేశారు. అప్పట్లో వారు రీసెర్చ్ సెంటర్ల కోసం, ఇస్రో స్థాపన కోసం పాటుపడిన నెహ్రూ కృషిని గుర్తు చేశారు. ఇంద్ర గాంధీ పాలనలోకి వచ్చిన తరువాత ఇస్రో పేరు వచ్చిందని, రీసెర్చ్ సెంటర్ స్థాపించడానికి కేవలం కాంగ్రెస్ నాయకుల కృషి మాత్రమే ప్రధాన కారణం అంటూ చెప్పుకొచ్చారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.

హింసని కూడా ఆపలేకపోతున్నారు: 

ఇప్పటివరకు మణిపూర్ వైలెన్స్ లో చనిపోయిన వారి కుటుంబీకులోకి ఎటువంటి న్యాయం జరిగిందని అడిగేందుకు పార్లమెంట్లో చాలాసేపు చర్చ జరగడం జరిగిందని గుర్తు చేశారు అశోక్. అంతేకాకుండా కేవలం నరేంద్ర మోదీ, బిజెపి నాయకులు, మణిపూర్ లో జరుగుతున్న హింస గురించి కేవలం కొన్ని సెకన్ల పాటే మాట్లాడడం ఇప్పటికీ ఆశ్చర్యస్పదంగా ఉందని, ఒకపక్క హింస జరుగుతుంటే పార్లమెంట్లో జోకులు వేసుకోవడం బిజెపి నాయకులకు మాత్రమే కుదిరిందని రాహుల్ బాధను సమర్థించారు రాజస్థాన్ ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఇప్పటివరకు మణిపూర్ విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోవడం, బిజెపి అసమర్ధతను ప్రతిబింబిస్తుందంటూ గుర్తు చేశారు అశోక్ గెహ్లాట్.