పెళ్లి చేసుకోవచ్చు కదా రాహుల్: లాలూ యాదవ్ 

పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల అతిపెద్ద సమావేశం తర్వాత సీనియర్ నాయకుడు లాలూ యాదవ్, రాహుల్ గాంధీ ని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పడంతో అక్కడ అంతా సందడి నెలకొంది. ఆయన అడిగిన ప్రశ్నకు ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు కనిపించింది.  అతిపెద్ద ప్రతిపక్షాల సమావేశం తర్వాత ” రాహుల్ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లి చూడ్డానికి రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం” అంటూ, రాహుల్ చేతిలో చేయి వేసి లాలు యాదవ్ అడగడం అందర్నీ […]

Share:

పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల అతిపెద్ద సమావేశం తర్వాత సీనియర్ నాయకుడు లాలూ యాదవ్, రాహుల్ గాంధీ ని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పడంతో అక్కడ అంతా సందడి నెలకొంది. ఆయన అడిగిన ప్రశ్నకు ప్రతి ఒక్కరి ముఖం మీద చిరునవ్వు కనిపించింది. 

అతిపెద్ద ప్రతిపక్షాల సమావేశం తర్వాత ” రాహుల్ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లి చూడ్డానికి రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం” అంటూ, రాహుల్ చేతిలో చేయి వేసి లాలు యాదవ్ అడగడం అందర్నీ ఆనందానికి గురి చేసింది. 

అయితే లాలు అడిగి పెళ్లి విషయం రాహుల్ ముఖంపై చిరునవ్వు కనిపించేలా చేయడంతో పాటుగా ఆయన ఇచ్చిన సమాధానం, సీనియర్ నాయకుడైన లాలు కి కూడా చాలా బాగా నచ్చింది. ” మీరు ఇప్పుడు అన్నట్లే, అది తప్పకుండా జరుగుతుంది” అంటూ రాహుల్ గాంధీ తన పెళ్లి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కానీ రాహుల్ పెళ్లి విషయంలో సమాధానం చెప్పినప్పటికీ లాలు యాదవ్  మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడే పెళ్లి విషయం తేల్చేయాలంటూ, ఏదో ఒకటి కన్ఫామ్ చేయాలి అంటూ రాహుల్ ని చిలిపిగా ఇబ్బంది పెట్టారు. 

అంతేకాదు,” ఇప్పుడే పెళ్లి చేసుకో, ఇంకా నీకు టైం ఉంది” అంటూ రాహుల్ గాంధీని పదే పదే లాలు యాదవ్ పెళ్లి విషయాన్ని అడుగుతూనే ఉన్నారు. అంతే కాకుండా,” పెళ్లి విషయంలో నువ్వు మీ అమ్మగారు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పారు” అంటూ సోనియాగాంధీ మనసులో మాట కూడా లాలు యాదవ్ బయటపెట్టారు. 

అయితే నిన్న జరిగిన పాట్నా ప్రతిపక్ష సమావేశానికి, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, శరత్ పవర్, మెహబూబా ముఫ్తీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి అగ్ర నేతలు హాజరైనట్లు తెలుస్తుంది. 

గత ఏడాదిలో బిజెపితో తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి గత కొన్ని నెలలుగా అగ్ర నేతలతో చర్చలు కూడా జరిపారు. ఈ చారిత్రాత్మక సమావేశం ఉద్భవించడానికి మూల కారణంగా నిలిచారు. 

రాహుల్ మనసులో మాట: 

జనవరి సమయంలో భారత్ జూడో యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ, కర్లీటేల్స్ ఇంటర్వ్యూలో, తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ,” సరైన అమ్మాయి జీవితంలోకి వస్తే, మీరు అనేది తప్పకుండా జరుగుతుంది.” అంటూ తన మనసులో మాట బయట పెట్టారు. 

అయితే మీ దగ్గర ఏదైనా చెక్లిస్ట్ ఉందా అని పెళ్లికూతురు గురించి ప్రశ్న అడిగినప్పుడు,” లేదు అలాంటిదేమీ లేదు ప్రేమగా చూసుకోవాలి తెలివైన అమ్మాయి అయి ఉండాలి అనుకుంటున్నా”. అంటూ రాహుల్ గాంధీ ఇలా సమాధానం ఇచ్చారు. 

అంతేకాకుండా,” అయితే ఈ విషయం అందరి అమ్మాయిలకి మెసేజ్ వెళుతుంది” అంటూ ఒక ఇంటర్వ్యూలో  రాహుల్ గాంధీని ఆటపట్టించడానికి ఒక రిపోర్టర్అన్నప్పుడు, రాహుల్ వెంటనే ,” మీరు ఇప్పుడు నన్ను ఇబ్బందుల్లో పడేసేలా ఉన్నారు” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 

డిసెంబరులో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు మిస్టర్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన అమ్మగారు సోనియా గాంధీ మరియు ఆయన అమ్మమ్మ అయిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీలో ఉండే మంచి గుణాలు, లక్షణాలు తన కాబోయే భాగస్వామిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు.