మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని రాహుల్‌ గాంధీ  సుప్రీంకోర్టుకు తెలిపారు

మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు.. ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిని నిలుపుదల చేయాలంటూ ఆయన కింది కోర్టులకు అప్పీలు చేయగా.. తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల గుజరాత్ హైకోర్టులో కూడా రాహుల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడిన […]

Share:

మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. ఈ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు.. ఆయనను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీనిని నిలుపుదల చేయాలంటూ ఆయన కింది కోర్టులకు అప్పీలు చేయగా.. తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల గుజరాత్ హైకోర్టులో కూడా రాహుల్‌కు ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు అనర్హులవుతారు.

ఏప్రిల్ 2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి, .దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ చేపట్టి సూరత్‌ కోర్టు రాహుల్‌ కి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద ఎంపీ పదవి రాహుల్ గాంధీ కోల్పోవాల్సి వచ్చింది. సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని సుప్రీంకోర్టులో దాఖలుచేసుకున్న అఫిడవిట్ లో రాహుల్ పేర్కొన్నారు

గాంధీ, అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేస్తూ,సంబంధించిన పరువునష్టం కేసులో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిడ్ దాఖలుచేశారు. తాను నిర్దోషినని, కోర్టు తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని కోరారు. తనపై చేసిన నేరారోపణలు సరైనవి కావని, ఈ విషయంపై  క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంటే ఇప్పటికే తాను ఆ పని చేసి ఉండేవాడినని అన్నారు.

ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీకి క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన కారణంగా ‘అహంకారి’ వంటి పదాలను ఆయన ఉపయోగించారని రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లో ఆరోపించారు. తాను తప్పు చేయకున్నా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పలేదని న్యాయ ప్రక్రియకు వెళ్లడం కచ్చితంగా ప్రజాప్రాతినిధ్య చట్టంను దుర్వినియోగం చేయడమే అని రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఓ మీడియా ప్రకటనలో తెలిపింది. 

 

పరువు నష్టం కేసు ఫిర్యాదుదారుడు, బీజేపీ నేత గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ.. ఈ కేసు విషయమై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత చేసిన విజ్ఞప్తిని అంగీకారం తెలపవద్దంటూ అందుకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. గుజరాత్ హైకోర్టు తనకు విధించిన శిక్షను వాయిదా వేయడానికి నిరాకరిస్తూ జులై 7న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ  చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఆగస్టు 4న విచారణ చేపట్టనుంది.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆర్ధిక నేరగాళ్లు లలిత్ మోదీ, నీరవ్ మోదీల గురించి ప్రస్తావిస్తూ… దొంగలందరి ఇంటిపేరు మోదీ ఎలా ఉంటుందో అని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రాహుల్ గాంధీని దోషిగా నిర్థరించింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ తీర్పుపై తొలుత సెషన్స్ కోర్టు, తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ రెండు చోట్లా ఆయనకు చుక్కెదురయ్యింది. దీంతో ఆయన జులై 15న సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. . తనపై విధించిన శిక్షపై ప్రస్తుతానికి స్టే విధించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.