రాహుల్ లో పశ్చాత్తాపం కనిపించలేదు: బిజెపి ఎమ్మెల్యే

హైకోర్టు నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్, మోదీ ఇంటి పేరు కేసు విషయంలో ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ, తన జవాబు ఇస్తూ, మోదీ ఇంటి పేరు మీద వ్యాఖ్యలు చేసిన రాహుల్ లో మార్పు లేదని, అతనిలో పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదని, ఇంకా తాను పొగరుగా ప్రవర్తిస్తున్నాడని వాపోయాడు. గుజరాత్ ఎమ్మెల్యే వాదన: అయితే ప్రస్తుతం హైకోర్టు లో నమోదైన కేసు విషయంలో తనకి ఎలాంటి న్యాయం జరగలేదని, ముఖ్యంగా లోక్సభలో ఎంపీ హోదా కూడా […]

Share:

హైకోర్టు నుంచి ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్, మోదీ ఇంటి పేరు కేసు విషయంలో ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ, తన జవాబు ఇస్తూ, మోదీ ఇంటి పేరు మీద వ్యాఖ్యలు చేసిన రాహుల్ లో మార్పు లేదని, అతనిలో పశ్చాత్తాపం అనేది కనిపించట్లేదని, ఇంకా తాను పొగరుగా ప్రవర్తిస్తున్నాడని వాపోయాడు.

గుజరాత్ ఎమ్మెల్యే వాదన:

అయితే ప్రస్తుతం హైకోర్టు లో నమోదైన కేసు విషయంలో తనకి ఎలాంటి న్యాయం జరగలేదని, ముఖ్యంగా లోక్సభలో ఎంపీ హోదా కూడా పోగొట్టుకున్న రాహుల్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ, రాహుల్ సుప్రీంకోర్టులో వేసిన అభ్యర్థనకి జవాబు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ సబ్మిట్ చేసిన పిటీషన్ కు జవాబు ఇస్తూ, రాహుల్ గాంధీలో అసలు మార్పు రాలేదని, తాను చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవడానికి రాహుల్ అసలు సిద్ధంగా లేనట్లు కనిపిస్తుందని వెల్లడించాడు. అంతేకాకుండా అతనికి కోర్టుకు సమాధానం చెప్పే ఉద్దేశం కూడా రాహుల్ గాంధీకి లేదని, నిజానికి పొగరుగా ప్రవర్తిస్తున్నాడని ఉద్దేశపడ్డారు గుజరాత్ ఎమ్మెల్యే.

తాను చేసిన తప్పుకు అతనికి శిక్ష పడినప్పటికీ, అతనిలో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించలేదని రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు పూర్ణేష్ మోదీ. నిజానికి లోక్ సభలో ఎంపీ హోదా పోగొట్టుకున్న తర్వాత కూడా రాహుల్ లో మార్పు కనిపించలేదని, అతను చేసిన వ్యాఖ్యలకు, క్షమాపణ కోరడానికి బదులు, తాను ఒక గాంధీ అని, సావర్కర్ కాదని, రాహుల్ గాంధీ మాట్లాడినట్లు, గుజరాతి ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ గుర్తు చేశారు.

మోదీ ఇంటిపేరు కేసు వివరాలు: 

2019 ఏప్రిల్‌లో – లోక్‌సభ ఎన్నికలకు ముందు – మోదీ ఇంటిపేరుతో ఉన్న దొంగల గురించి అంటూ కోలార్‌లో గాంధీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపికి చెందిన సూరత్ వెస్ట్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ  దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం రాహుల్ గాంధీ చిక్కుల్లో పడడం జరిగింది. 

“ఆయన చేసిన వాక్యలకు సంబంధించి అప్పట్లో ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, ప్రస్తుత నిందితుడిపై ఇతర ఫిర్యాదులు దాఖలయ్యాయని, అందులో ఒక ఫిర్యాదును వీర్ సావర్కర్ మనవడు పునాలోని సంబంధిత కోర్టులో దాఖలు చేసినట్లు రికార్డులో కనిపిస్తుంది. లక్నో సంబంధిత కోర్టులో మరో ఫిర్యాదు కూడా దాఖలైంది. పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో, నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం వల్ల దరఖాస్తు చేసిన వారికి ప్రస్తుతానికి ఏ విధంగానూ అన్యాయం జరగదు.” అంటూ ఉద్దేశపూర్వకంగా చెప్పారు.

పరువు నష్టం హత్య వంటి తీవ్రమైన నేరం కాదన్న గాంధీ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ ప్రచ్చక్, “ప్రస్తుత నేరారోపణ చాలా తీవ్రమైన విషయం, ఇది సమాజంలోని పెద్ద వర్గాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ కోర్టు ఆదేశిస్తున్న నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని స్పష్టంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కేసులో, నేరం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అనే దాన్ని బట్టి అంచనా వేయడానికి, పిటిషనర్‌పై ఇప్పుడున్న కేసు ప్రకారం చూసుకుంటే, ఈ విషయం ఒక వర్గం అనేది వ్యక్తికి సంబంధించినది కాదు, అంటే ఎంతోమంది ఇందులో ఉన్నారు.” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతానికి హైకోర్టులో తనకి ఎటువంటి న్యాయం జరగలేనట్లు కనిపించిన రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఈ ఏడాది మార్చిలో తన యుకె పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సావర్కర్‌పై తప్పుడు మరియు దురుద్దేశపూర్వక ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ ఏప్రిల్ 12, 2023న పూణేలోని మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఇలా ప్రస్తుతానికి రాహుల్ గాంధీ మీద 12 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.