రాహుల్‌కి రెండేళ్ల శిక్షపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. వాజపేయి మాటలు గుర్తు చేసుకోండి..

బీహార్‌లో జన సురాజ్ యాత్రలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో అధికారిక బీజేపీ పెద్ద మనసు చూపాలని వ్యాఖ్యానించారు. Rahul Gandhi: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై లోక్‌‌సభ అనర్హత వేటుపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తమ నేతకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా సన్నద్ధమైనట్లు కనిపించడం […]

Share:

బీహార్‌లో జన సురాజ్ యాత్రలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో అధికారిక బీజేపీ పెద్ద మనసు చూపాలని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై లోక్‌‌సభ అనర్హత వేటుపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తమ నేతకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దగా సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో అధికారిక బీజేపీ పెద్దమనసు చూపాలని బీహార్‌లో జనసురాజ్ యాత్రలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ అన్నారు.. ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్ష చాలా ఎక్కువేనని అన్నారు. 

నరేంద్ర మోడీ ఓ నేరస్తుడనే వ్యాఖ్యలు..

కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తన వ్యతిరేక అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. రాహుల్ గాంధీ 2019 లో కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ నేరస్తుడనే అర్థం వచ్చేవిధంగా మాట్లాడారు. “దొంగలందరికీ ఇంటిపేరు మోదీ అని ఎలా ఉంటుందో!” అన్నారు. దీంతో ఆయనపై వివిధ రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు దాఖలాలయ్యాయి. గుజరాత్‌లోని పశ్చిమ సూరత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పు చెప్పింది. రెండేళ్లు జైలుశిక్ష విధించింది. జైలుశిక్ష అమలును 30 రోజులపాటు నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించింది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు..

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని లోక్‌‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ పార్లమెంటుకు ఫిర్యాదు చేశారు. దాంతో పార్లమెంటు సచివాలయం గాంధీపై అనర్హత వేటు వేసింది. ఫలితంగా ఆయన కేరళలోని వయానాథ్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడానికి కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ తీవ్రంగా ఖండిస్తున్నాయి. 

వాజపేయి మాటలు..

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఓ వార్తా సంస్థతో శనివారం మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలుశిక్ష అనేది చాలా ఎక్కువ అని తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి గతంలో చెప్పిన మాటలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలనుకుంటున్నానని చెప్పారు.. “సంకుచిత హృదయం గలవారు గొప్పవారు కాలేరు” అని వాజపేయి అన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ దోషి అని వెలువడిన తీర్పును సాంకేతిక అంశాలను చూపించి అధికార పార్టీ దాక్కున వచ్చునని .. ఆయనపై అనర్హత వేటు అనివార్యమైనదని చెప్పవచ్చునని.. అయితే దివంగత వాజ్‌పేయి పుస్తకంలోని ఓ మాటను అధికార పార్టీ పెద్దలు గుర్తు చేసుకోవాల్సిందని అన్నారు.

 రాహుల్ గాంధీని అనర్హుడిని చేయడానికి తొందరపడకుండా ఉండవలసింది అని అన్నారు. నేడు బీజేపీలో అధికారంలో ఉంది. విశాల హృదయాన్ని చూపించవలసిన భారం బీజేపీ పైనే ఉంది. కొద్ది రోజులపాటు వేచి చూసి బాధితపక్షం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉండవలసింది. ఎటువంటి ఉపశమనం కల్పించకపోయినప్పుడు మాత్రమే చర్య తీసుకుని ఉండాల్సింది అని తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఉన్నదేమిటో కాంగ్రెస్ తెలుసుకోలేకపోతున్నట్లు కనిపిస్తుందని వివరించారు. ఢిల్లీలో కూర్చుని ఆగ్రహంతో ట్వీట్లు చేసి పార్లమెంటుకు నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా రాజకీయ యుద్ధాలు చేయలేమని కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు.