లడఖ్‌లో రాజీవ్‌ గాంధీకి రాహుల్‌ ఘన నివాళి..

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. జమ్మూకాశ్మీర్‌‌లోని లడఖ్‌లో ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద తన తండ్రికి రాహుల్‌ ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ గత శనివారం లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్దకు బైక్‌ రైడ్‌ చేసుకుంటూ బయలుదేరారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, […]

Share:

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. జమ్మూకాశ్మీర్‌‌లోని లడఖ్‌లో ఉన్న పాంగాంగ్‌ సరస్సు వద్ద తన తండ్రికి రాహుల్‌ ఘన నివాళి అర్పించారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ గత శనివారం లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్దకు బైక్‌ రైడ్‌ చేసుకుంటూ బయలుదేరారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తదితర నాయకులతో పాటు కార్యకర్తలు నివాళులర్పించారు. 

రాహుల్‌ గాంధీ జమ్మూకాశ్మీర్‌‌లో తన రెండ్రోజుల పర్యటన సందర్భంగా గురువారం లేహ్‌ చేరుకున్నారు. ఆగస్టు 25తో ఆయన పర్యటన ముగియనుంది. ఆదివారం రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని పాంగాంగ్‌ సరస్సు ఒడ్డున ప్రార్థనా సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఆయన లేహ్‌లో యువతతో ముచ్చటించారు. ‘‘మా నాన్న చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు. పాంగాంగ్‌.. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రాంతమని చెప్పారు.ఈ సరస్సుఅంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన జయంతి రోజున ఇక్కడకు వచ్చా” అని రాహుల్‌ తెలిపాడు. 

2019  ఆగస్టు 5న ఆర్టికల్‌ 370, 35 (ఏ)ని తొలగిచిన తర్వాత జమ్మూకాశ్మీర్‌‌ను లడఖ్‌, జమ్మూకాశ్మీర్‌‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగావిభజించారు. ఆ తర్వాత లడఖ్‌లో రాహుల్‌ గాంధీ పర్యటించడం ఇదే తొలిసారి. 

 అలాగే, లేహ్‌లో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను కూడా రాహుల్‌ గాంధీ వీక్షిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ తన కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్‌ ఆటగాడు. మరోవైపు, ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌హెచ్‌డీసీ) కార్గిల్‌ ఎన్నికల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారని వారు తెలిపారు. 

ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్‌ శ్రీనగర్‌‌, జమ్మూలో రెండుసార్లు పర్యటించినప్పటికీ లడఖ్‌కు వెళ్లలేదు. జనవరిలో ఆయన తన భారత్‌ జోడో యాత్రలో జమ్మూ శ్రీనగర్‌‌లను రాహుల్‌ సందర్శించారు. మళ్లీ ఫిబ్రవరిలో వ్యక్తిగత పర్యటనలో ఆయన గుల్‌మార్క్‌స్కీ రిసార్ట్‌ ను సందర్శించారు. 

భారత్‌ భూ భాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంది..

మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనలో నిజం లేదని తెలిపారు. ఇక్కడ ప్రజలందరూ చైనా చొరబడిందనే చెబుతున్నారని తెలిపారు. పశువులను మేపే స్థలం ఆక్రమణకు గురైందని అంటున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లలేకపోతున్నామని వెల్లడించారు. కానీ,  మన ప్రధాని మాత్రం ఒక్క్ అంగుళం కూడా కబ్జాకు గురి కాలేదని ప్రధాని చెప్పారని, ఇందులో నిజం లేదని రాహుల్‌ తెలిపారు. 

ఇండియా పరువు తీస్తున్నారు..

రాహుల్‌ గాంధీ లడఖ్‌ పర్యటన సందర్భంగా బీజేపీ బీజేపీ పలు విమర్శలు చేసింది. రాహుల్‌ బీజింగ్‌ ప్రచార యంత్రంగా పనిచేస్తూ.. భారత్‌ పరువు తీస్తున్నారని విమర్శించింది. మరోవైపు, రాహుల్‌ గాంధీ లడఖ్‌ పర్యటనలో అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో  చూస్తున్నారని, ఈ విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నారని పలువురు కేంద్ర మంత్రులు వెల్లడించారు. కాంగ్రెస్‌ హయాంలో అక్కడి రోడ్లు అన్నీ గుంతలమయంగా, రాళ్లు రప్పలు తేలి ఉండేవని, ఇప్పుడు ఎక్కడ చూసిన రోడ్లు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు.