పార్లమెంటులో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

మోదీ ఇంటిపేరు కేసు విషయం మీద స్టే విధించిన సుప్రీం కోర్ట్ కారణంగా, ప్రస్తుతం రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టడానికి అనుమతి లభించింది. తాజాగా తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, లోక్‌సభలో రాహుల్ ఎందుకు ప్రసంగించలేదోనన్న అయోమయం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. బహుశా గౌరవ్ గొగోయ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన డిబేట్ ప్రారంభించాలని రాహుల్ భావించి ఉండవచ్చు అని కొందరు […]

Share:

మోదీ ఇంటిపేరు కేసు విషయం మీద స్టే విధించిన సుప్రీం కోర్ట్ కారణంగా, ప్రస్తుతం రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టడానికి అనుమతి లభించింది. తాజాగా తిరిగి పార్లమెంటులో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, లోక్‌సభలో రాహుల్ ఎందుకు ప్రసంగించలేదోనన్న అయోమయం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. బహుశా గౌరవ్ గొగోయ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన డిబేట్ ప్రారంభించాలని రాహుల్ భావించి ఉండవచ్చు అని కొందరు అంటుంటే, మరికొందరు ప్రధాని మోదీ సభలో లేకపోవడమే కారణమని అంటున్నారు.

రాహుల్ ప్రణాళిక: 

నిజానికి పార్లమెంట్లో అడుగుపెట్టిన రాహుల్ డిబేట్ మొదలుపెట్టనున్నాడని, ఆయన ముఖ్యంగా 10 పాయింట్లు మీద డిస్కస్ చేస్తాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో, ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం మీద, మణిపూర్ వైలెన్స్ మీద మోది ఎందుకు నోరు విప్పట్లేదు అనేదాని గురించి, కొన్ని ఆమోదించిన బిల్లుల విషయం మీద, మోదీ ఎందుకు డిబేట్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అనే దానిమీద, ఇప్పటివరకు వైలెన్స్ లో చనిపోయిన వారి కుటుంబీకులోకి ఎటువంటి న్యాయం జరిగిందని అడిగేందుకు, అయితే ఈ డిబేట్ లోని ముఖ్యంగా అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతి ఆదిత్య సిందియా, కిరణ్ రెజీజు, ఐదుగురు పార్లమెంట్ మినిస్టర్స్ మాట్లాడనున్నారు అంతే కాకుండా పదిమంది బిజెపి ఎంపీలు అదనంగా పాల్గొననున్నారు.

ఆఖరి నిమిషంలో అవిశ్వాస తీర్మానంపై డిబేట్ ప్రారంభించేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ, మంగళవారం కాంగ్రెస్ మరియు ఆయన లోక్‌సభ మెంబర్లకు కాస్త షాక్ ఇచ్చారు. కేవలం ఒక రోజు ముందు, రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంటులో అడుగు పెట్టినందుకు సంబరాలు చేసుకున్న తరువాత, రాహుల్ గాంధీ మొదటి రోజు డిబేట్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. తొలి స్పీకర్‌గా ఆయన పేరును ప్రకటించి మీడియా ముందుకొచ్చారు. అయితే పార్లమెంట్ లో డిబేట్ ప్రారంభం కావడానికి నిమిషాల ముందు, గాంధీ పార్టీ ఫ్లోర్ మేనేజర్లకు డిబేట్ ప్రారంభించడం ఇష్టం లేదని చెప్పారు. అయితే దీనికి గల ముఖ్యమైన కారణం చాలా మందికి మిస్టరీగా మిగిలిపోయింది.

అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయ్ డిబేట్ ప్రారంభిస్తారని కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజర్లు మార్షల్ ద్వారా స్పీకర్ ఓం బిర్లాకు తెలియజేశారు. ఆఖరి నిమిషంలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ మంగళవారం కాంగ్రెస్ మరియు ఆయన లోక్‌సభ మెంబర్లకు కాస్త షాక్ ఇచ్చినట్లు అనిపించింది.

ప్రధాని, స్పీకర్‌ల మధ్య జరిగే సమావేశాల్లో ఏం జరుగుతుందో వెల్లడించాలని ప్రతిపక్షాలు ట్రెజరీ బెంచ్‌లను కోరుతున్నాయా అని గొగోయ్ ప్రతిస్పందించారు. ఇది ట్రెజరీ బెంచ్‌లను రెచ్చగొట్టినట్లు అయిందని, హోం మంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు నిరసనకు దారితీసింది. అంతేకాకుండా, ఇది తీవ్రమైన అభియోగం అని షా అన్నారు. అబద్ధపు వ్యాఖ్యలు చేయవద్దని బిర్లా గొగోయ్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత, స్పీకర్ ఛాంబర్‌లో ఏమి జరిగిందో బయట మాట్లాడకూడదని తాను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని గొగోయ్ వివరించారు.

చర్చను ఎవరు ప్రారంభిస్తారనే దానిపై కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళాన్ని ప్రస్తావిస్తూ, బిజెపి మొదటి స్పీకర్ నిషికాంత్ దూబే మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మాట్లాడతాడేమో అని, ఆయన బాగా ఆశపడినట్లు చెప్పాడు. కానీ రాహుల్ మాట్లాడకుండా అందరిని నిరాశపరిచాడని, బహుశా కాస్త ఆలస్యంగా మేల్కొన్నట్టు ఉన్నాడని, అందుకే సిద్ధం కాలేదని. హాస్యాస్పదంగా మాట్లాడారు. ప్రధాని మోదీ సభలో లేనందున ముందుగా మాట్లాడకూడదని గాంధీ నిర్ణయించుకున్నారని మరొకరు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు డిబేట్ ఏ విధంగా జరగనుందో చూడాల్సి ఉంది.