నీ ఆటోగ్రాఫ్ ఇవ్వు చాంప్..చిన్నారిని అడిగిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన తన చరిష్మాతో చాలా పనులను చక్కబెడుతున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన కొత్త జోష్ నింపారు. అందుకే భారత్ జోడో యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించదని చాలా మంది అంటున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కూడా సాగింది. దీంతో అందరూ ఈ యాత్ర సక్సెస్ […]

Share:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన తన చరిష్మాతో చాలా పనులను చక్కబెడుతున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన కొత్త జోష్ నింపారు. అందుకే భారత్ జోడో యాత్ర తర్వాత జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించదని చాలా మంది అంటున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కూడా సాగింది. దీంతో అందరూ ఈ యాత్ర సక్సెస్ అయిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటించారు. ఈ సందర్భంగానే మాజీ ప్రధాని అతడి తండ్రి అయిన రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. 

బైక్ రైడ్ చేసిన రాహుల్

రాహుల్ గాంధీ ఈ పర్యటన సందర్భంగా బైక్ రైడ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. చిన్నప్పటి నుంచి రిచ్ గా పెరిగిన రాహుల్ కి కార్లు తప్పా బైక్స్ అలవాటు ఉంటుందని చాలా మంది అనుకోరు. కానీ రాహుల్ సడెన్ గా బైక్ నడిపి వారందరినీ సర్ ప్రైజ్ చేశాడు. అతడు బైక్ రైడ్ చేసినపుడు హెల్మెట్ కూడా ధరించాడు. అన్ని రూల్స్ పాటించే రాహుల్ బైక్ రైడ్ చేయడం గమనార్హం. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు. తనకు తన పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి రాహుల్ ఈ సారి ఓడిపోయాడు. అక్కడి ప్రజలు తమ ఎంపీగా బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీనీ సెలెక్ట్ చేసుకున్నారు. రాహుల్ లక్కీగా రెండు చోట్ల నుంచి పోటీ చేయడంతో అతడు ఈ సారి కూడా పార్లమెంట్ కు వెళ్లగలిగాడు. లేకపోతే అతడు పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ తన నియోజకవర్గంలో పర్యటన కోసం మార్గ మధ్యలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు. రాహుల్ వంటి బిగ్ లీడర్ తమ ఫ్యాక్టరీకి రావడంతో అక్కడ పని చేస్తున్న వారు ఆ ఫ్యాక్టరీ ఓనర్లు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. 

చిన్నారి ఆటో గ్రాఫ్ తీసుకున్న రాహుల్

తమిళనాడు రాష్ట్రం ఊటీలోని ఓ పురాతన చాక్లెట్ ఫ్యాక్టరీకి రాహుల్ గాంధీ వెళ్లారు. అది ఒక మహిళా చాక్లెట్ ఫ్యాక్టరీ. అక్కడ మహిళలే స్వయంగా చాక్లెట్లను తయారు చేస్తుంటారు. ఈ సందర్భంగా రాహుల్ అక్కడున్న మహిళలతో మాట్లాడుతూ… వారి అనుభవాలు మరియు చాక్లెట్లు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. తాను కూడా స్వయంగా చాక్లెట్లను తయారు చేశారు. వారు తయారు చేసిన చాక్లెట్లను టేస్ట్ చేశారు. ఇలా రాహుల్ వారితో ముచ్చటిస్తున్న సమయంలో అక్కడికి చిన్న అమ్మాయి వచ్చి అతడి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇందుకోసం ఓ నోట్ బుక్ ను రాహుల్ కు అందజేసింది. ఆటోగ్రాఫ్ ఇవ్వమని రాహుల్ ను అడిగింది. దీంతో రాహుల్ ఆ చిన్నారి కోరికను మన్నించారు.  ఆ చిన్నారి కోసం సంతకం చేసి ఇచ్చాడు. 

చిన్నారి ఆటోగ్రాఫ్ అడిగిన రాహుల్

అతడు ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత రాహుల్ ఆ చిన్నారిని నాకు ఒక సహాయం చేస్తావా అని అడిగాడు. ఆ చిన్నారి ఆటోగ్రాఫ్ ను అడగడంతో ఆమె నవ్వుతూ సైన్ చేసింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విటర్ (X)లో షేర్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. రాహుల్ సింప్లిసిటీని చూసి అంతా వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సమస్యలు చెప్పుకున్న వర్కర్లు

చాక్లెట్ ఫ్యాక్టరీ సమస్యలను ఈ సందర్భంగా అక్కడి వారు రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. 18 శాతం జీఎస్టీ వేస్తున్నారని వాపోయారు. వారి బాధలను గురించి తెలుసుకున్న రాహుల్ మీకు తప్పకుండా సాయం చేస్తానని హామీనిచ్చారు. దేశంలో చిన్న చిన్న వ్యాపారుల పొట్ట కొడుతూ బడా వ్యాపారులకు సాయం చేస్తున్నారని మండిపడ్డారు.