ర్యాగింగ్ పేరుతో ఎక్కువ అవుతున్న హింస

ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మధ్య ఇంట్రడక్షన్ పెరుగేందుకు సీనియర్ స్టూడెంట్స్ జూనియర్స్ని పరిచయం చేసుకోవడం ఉండేది. ఫ్రెషర్స్ పార్టీ అంటూ కొన్ని కాలేజీల్లో, వివిధ సంవత్సరాలు చదివే విద్యార్థుల మధ్య స్నేహబంధం పెరిగేందుకు ఇలాంటివి జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే, పరిచయం పేరుతో హద్దులు దాటుతున్న ప్రవర్తన కనిపిస్తుంది. ర్యాగింగ్ పేరుతో కాలేజీలో కొంతమంది విద్యార్థులు చెలరేగిపోతున్న వైనం కనిపిస్తుంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి దీనికి […]

Share:

ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మధ్య ఇంట్రడక్షన్ పెరుగేందుకు సీనియర్ స్టూడెంట్స్ జూనియర్స్ని పరిచయం చేసుకోవడం ఉండేది. ఫ్రెషర్స్ పార్టీ అంటూ కొన్ని కాలేజీల్లో, వివిధ సంవత్సరాలు చదివే విద్యార్థుల మధ్య స్నేహబంధం పెరిగేందుకు ఇలాంటివి జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే, పరిచయం పేరుతో హద్దులు దాటుతున్న ప్రవర్తన కనిపిస్తుంది. ర్యాగింగ్ పేరుతో కాలేజీలో కొంతమంది విద్యార్థులు చెలరేగిపోతున్న వైనం కనిపిస్తుంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. 

జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో విద్యార్థి మృతి: 

జాదవ్‌పూర్ యూనివర్సిటీ లో మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనంతరం తమ తల్లిదండ్రులు హుటాహుటిని హాస్టల్ కి చేరుకోగా విషయాలు తెలుసుకున్నారు. ర్యాగింగ్ కారణంగానే ఎంతో ప్రయోజకుడుగా మారుతాడు అనుకుని ఎన్నో కలలు కంటున్నా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకుని కోల్పోయినందుకు, కన్నీరు మున్నీరయ్యారు తల్లిదండ్రులు. 

యూనివర్సిటీలో ఉన్న ర్యాగింగ్ కారణంగానే తమ కొడుకు అర్ధాంతరంగా తన ప్రాణాన్ని విడిచి పెట్టాడు అని వాపోయారు తల్లిదండ్రులు. ముఖ్యంగా క్యాంపస్ లో ర్యాగింగ్ జరుగుతున్న సందర్భంలో యూనివర్సిటీ యాజమాన్యం ఏమైపోయిందని ప్రశ్నించారు. యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే తమ కొడుకు చావుకి కారణం అంటూ వాపోయారు మృతుడి తల్లితండ్రులు. 

ర్యాగింగే కారణం: 

ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన విద్యార్థి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాడు. హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం కేవలం ర్యాగింగ్ అని తేల్చి చెప్పారు పోలీసులు. ఆగస్టు 9న ర్యాగింగ్ బాధను తాళలేక విద్యార్థి మృతి చెందినట్లు స్పష్టం చేశారు పోలీసులు. ఫస్ట్ ఇయర్ బెంగాలీ హానర్స్ విద్యార్థి మృతికి ర్యాగింగ్ పేరుతో చేసిన లైంగిక వేధింపులు కూడా కారణం అంటున్నారు పోలీసులు. క్యాంపస్ లో ఒక భాగంగా ఉన్న హాస్టల్లో ఆ విద్యార్థికి బట్టలు లేకుండా ఊరేగించినట్లు తెలిపారు. 

అతను ర్యాగింగ్ నుండి తప్పించుకోవడానికి ఒక రూమ్ నుంచి మరొక రూమ్ కి పరిగెత్తాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు వర్సిటీలోని ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులతో పాటుగా, పూర్వ విద్యార్థులతో సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. 

బ్యాన్: 

రాకింగ్ పేరుతో రెచ్చిపోతున్న స్టూడెంట్స్ విషయంలో తగిన చర్య తీసుకోవాలి అని ప్రతి సంవత్సరం వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా కాలేజీలలో ర్యాగింగ్ మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్న వైనం కనిపిస్తుంది. కులాల పేరుతో మతాల పేరుతో తోటి విద్యార్థులను ర్యాగింగ్ కి గురి చేసిన సంఘటనలు బయటపడ్డాయి. తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మళ్లీ మామూలుగా మారిపోతుంది. కోర్టు వైపు నుంచి ర్యాగింగ్ బ్యాన్ చేయాలి అని పలుసార్లు తీర్పులువచ్చినప్పటికీ, ఇప్పటికీ కూడా ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పేరుతో హింస కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది ప్రతియేట ర్యాగింగ్ కారణంగా తమ బంగారు భవిష్యత్తును విడిచిపెట్టి ప్రాణాలను విడిచిపెడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము. దీనికి ముగింపు పలకాల్సిందే, లేదంటే ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా విద్యార్థులు కాలేజీల్లో చదివేటప్పుడు సాటి విద్యార్థులను గౌరవించడం నేర్చుకుంటే, ఇటువంటి ర్యాగింగ్ అనే మహమ్మారిని తుడిచిపెట్టొచ్చు. కుల, మత భేదాలు లేకుండా సాటి విద్యార్థులతో స్నేహబంధంతో ఉండగలిగిననాడే, ర్యాగింగ్ భారీ నుంచి భారతదేశం బయటపడవచ్చు.