ఉద్రిక్తంగా య‌మునా న‌ది

గతంలో ఎన్నడూ చూడని వరదలు. సుమారు 45 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యమునా నది ఉగ్రరూపంతో పొంగిపొర్లుతోంది. ఇప్పటికే 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. యమునా నది రికార్డ్ స్థాయిలో ప్రవహించడం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి.  రికార్డ్ స్థాయిలో యమునా నది ఉగ్రత:  రికార్డ్ స్థాయిలో పొంగిపొర్లుతున్న యమునా నది కారణంగా ఢిల్లీలోని […]

Share:

గతంలో ఎన్నడూ చూడని వరదలు. సుమారు 45 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో నమోదవుతున్న వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఢిల్లీలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యమునా నది ఉగ్రరూపంతో పొంగిపొర్లుతోంది. ఇప్పటికే 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. యమునా నది రికార్డ్ స్థాయిలో ప్రవహించడం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. 

రికార్డ్ స్థాయిలో యమునా నది ఉగ్రత: 

రికార్డ్ స్థాయిలో పొంగిపొర్లుతున్న యమునా నది కారణంగా ఢిల్లీలోని చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇంకా రెస్క్యూ టీం వారు బుధవారం నుంచి పలుచోట్ల చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో పడ్డారు. ఇప్పటివరకు ఢిల్లీలోని 23,692 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నది నీట మట్టం 208 నుంచి 205 మీటర్లకు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ప్రమాద స్థాయిలోనే ప్రవహిస్తున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఎక్కడ చూసినా రికార్డ్ స్థాయిలో నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది ఇళ్లల్లోకి, మెడికల్ షాపుల్లోకి, రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తలదాచుకోడానికి కూడా చోటు లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. 

ఆకలి కేకలు: 

రోడ్లు చిన్న చిన్న నదులుగా మారడంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగించారు. తరలించిన జనాలతో పాటుగా, కొన్ని జంతువులు, కుక్కలు, పశువులు కూడా ఉన్నాయి. ఉద్రిక్తంగా నీరు ప్రవహించే ప్రాంతాల నుండి ప్రజలను పడవలపై రక్షించినట్లు మనం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. 

కొంతమంది లోతట్టు ప్రాంతాల నివాసితులు, తమకు తినేందుకు ఆహారం లేదని సహాయం చేయాలి అంటూ మొరపెట్టుకుంటున్నారు. మీరట్ నుండి ఢిల్లీకి రెండు టాస్క్‌ఫోర్స్‌లను కూడా తరలిస్తున్నారు మరియు ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నారు. 

గేట్లను తెరవాలి: 

ప్రస్తుతం ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. నిజానికి సుప్రీం కోర్టు వరకు వరద నీరు చేరుకుంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 45 ఏళ్లుగా ఎన్నడు చెవుడని వరదలు ఢిల్లీని ముంచెత్తాయి. యమునా నది పొంగిపొర్లుతోంది. నది ఉద్రిక్తక ఇంకా పెరిగే కొద్దీ, పరిస్థితి మరి దిగజారే అవకాశం ఉంది కాబట్టి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్, వరద నీటిని బయటకు పంపేందుకు యమునా బ్యారేజీ ఐదు గేట్లను తెరిచే పనిలో ఉన్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఒక గేటు తెరిచినట్లు, త్వరలో మొత్తం ఐదు గేట్లను తెరుస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

వరదలో కొట్టుకుపోయిన పిల్లలు: 

ITO మరియు రాజ్‌ఘాట్‌తో సహా సెంట్రల్ ఢిల్లీలోని కీలక ప్రాంతాలు నీటిలో మునిగిపోవడంతో ఆర్మీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ని సహాయం కోసం పిలవడం జరిగింది. హనుమాన్ మందిర్, యమునా బజార్, గీతాకాలనీ, సివిల్ లైన్స్ వెలుపల ఉన్న రహదారి కూడా భారీగా నీటితో అల్లకల్లోలంగా మారింది. నిగమ్ బోద్ ఘాట్‌తో సహా ఢిల్లీలోని సుప్రీంకోర్టు మరియు కొన్ని శ్మశానవాటికలకు కూడా వరద నీరు చేరుకుంది.

ఢిల్లీలోని ముకుంద్‌పూర్ చౌక్ ప్రాంతంలో వరద నీటిలో ఈత కొట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు బాలురు మునిగిపోయారు. యమునా నది ప్రమాద స్థాయిని దాటిన తర్వాత నగరంలో నమోదైన తొలి మరణాలు ఇవే.