పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్..

ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా డ్రెస్ కోడ్ ను మరో పుణ్యక్షేత్రంలో అమలు చేయనున్నామని ప్రకటించారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒడిశాలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరికీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆలయానికి వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ ను అనుసరించి దుస్తులు ధరించాలని.. అటువంటి భక్తులు మాత్రమే […]

Share:

ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా డ్రెస్ కోడ్ ను మరో పుణ్యక్షేత్రంలో అమలు చేయనున్నామని ప్రకటించారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒడిశాలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులందరికీ డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఆలయానికి వచ్చే భక్తులు డ్రెస్ కోడ్ ను అనుసరించి దుస్తులు ధరించాలని.. అటువంటి భక్తులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించే వీలు ఉంది. ఇందుకోసం భక్తులకు అవగాహన కల్పించనున్నారు.

జగన్నాథ ఆలయ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంతో జనవరి 1 నుండి ఆలయంలో పొట్టి దుస్తులు, చిరిగిన జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ వంటి దుస్తులు ధరించిన భక్తులు ఆలయంలో ప్రవేశించడం నిషేధం.  భక్తులు ఇక నుంచి అటువంటి దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించలేరు. అయితే ఆలయంలో ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నామని జగన్నాథ ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. జగన్నాథ ఆలయ నిర్వహణ చీఫ్ రంజన్ కుమార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. భక్తులు తరచూ పొట్టి బట్టలు ధరించి దర్శనం కోసం ఆలయానికి వస్తున్నారని ఈ నేపథ్యంలో ఆలయ పాలసీ సబ్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి ఆలయ కమిటీ సూచించిన దుస్తులను ధరించిన వారికి మాత్రమే ఆలయంలో ప్రవేశం ఉండనున్నట్లు వెల్లడించారు.

ఆలయంలో దేవుడు నివసిస్తాడనీ.. పవిత్ర స్థలం.. అంతేకాని ఆలయం వినోదం ఇచ్చే స్థలం కాదని నిర్వాహణాధికారి చెప్పారు. దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు ఏదో పార్కులోనో, బీచ్‌లోనో వాకింగ్‌కు వెళ్తున్నట్లు పొట్టి దుస్తులు, చిరిగిన దుస్తులు ధరించి వస్తున్నారని.. అది పూర్తిగా తప్పు. అటువంటి పరిస్థితిలో ఇతరుల మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఆలయ గౌరవాన్ని పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని జగన్నాథ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. దీని కోసం జనవరి 1, 2024 నుండి డ్రెస్ కోడ్ ఖచ్చితంగా అమలు చేస్తామని.. దీనిని ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరు అనుసారించాలని చెప్పారు. ఈ బాధ్యతను ఆలయ ద్వారం వద్ద నియమించబడిన భద్రతా సిబ్బంది, ఆలయం లోపల ఉన్న సేవకులకు అప్పగించారు. వీరంతా ఆలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచనున్నారు. అయితే ఆలయంలో డ్రెస్‌ కోడ్‌ను అమలు చేస్తుంది పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి మాత్రమే కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోకి అనేక పుణ్య క్షేత్రాల్లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళీ ఆలయ గర్భగుడిలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయబడుతోంది. అంతేకాదు ఉత్తరాఖండ్‌లోని 3 దేవాలయాలలో డ్రెస్ కోడ్ వర్తిస్తుంది.

పూరీ జగన్నాథ ఆలయం మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది మరియు వివిధ ఆచారాలు మరియు పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులకు తెరిచి ఉంటుంది మరియు జగన్నాథుని ఆశీర్వాదం కోసం ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో జరిగే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి రథయాత్ర లేదా రథోత్సవం. ఇది జూన్ లేదా జూలై నెలల్లో జరిగే వార్షిక ఉత్సవం మరియు ఆలయం నుండి గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవి ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడానికి జరుపుకుంటారు. పండుగ సందర్భంగా, నందిఘోష, తలధ్వజ మరియు దేవదలన అని పిలువబడే మూడు భారీ చెక్క రథాలు నిర్మించబడ్డాయి మరియు పుష్పాలు మరియు ఇతర ఆభరణాలతో అలంకరించబడతాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి విగ్రహాలను ఈ రథాలపై ఉంచి భక్తులు పూరీ వీధుల్లో లాగుతారు.