Daggubati Purandeswari: విజయసాయి రెడ్డిపై ఫైర్ అయిన పురందేశ్వరి

Daggubati Purandeswari: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) వైయస్‌ఆర్‌సి ఎంపి వి.విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. విజయసాయి రెడ్డి (V. Vijay Sai Reddy) ప్రజలను బెదిరిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్నాడని పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు. ఆరోపించిన పురందేశ్వరి:  విజయసాయిరెడ్డి (V. Vijay Sai Reddy) వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో భూములను (Land) ఆక్రమించారని, ఆయనతో పాటు ఆయన […]

Share:

Daggubati Purandeswari: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) వైయస్‌ఆర్‌సి ఎంపి వి.విజయసాయి రెడ్డిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. విజయసాయి రెడ్డి (V. Vijay Sai Reddy) ప్రజలను బెదిరిస్తూ అనేక నేరాలకు పాల్పడుతున్నాడని పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు.

ఆరోపించిన పురందేశ్వరి: 

విజయసాయిరెడ్డి (V. Vijay Sai Reddy) వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో భూములను (Land) ఆక్రమించారని, ఆయనతో పాటు ఆయన అల్లుడు నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి (V. Vijay Sai Reddy) కడప నుంచి గూండాలను రప్పించారని, విశాఖ (Vizag)లో పలుచోట్ల భూములు లాక్కున్నారని పురంధేశ్వరి ఇటీవల ఆరోపించడం జరిగింది. అలాగే,మాజీ ఎంపీ వైఎస్. వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు కూడా విజయసాయిరెడ్డి (V. Vijay Sai Reddy) ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మరోసారి గుర్తు చేశారు పురందేశ్వరి (Daggubati Purandeswari). 

విశాఖ (Vizag)లోని చాలా చోట్ల భూ (Land) ఆక్రమణలకు గురవుతున్న క్రమం కనిపిస్తున్న వేళ, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ, విజయసాయి రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు పురందేశ్వరి (Daggubati Purandeswari). భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు పురందేశ్వరి (Daggubati Purandeswari).

ఎన్నికలు సమీపిస్తున్న వేళ: 

ఆంధ్రప్రదేశ్‌ (A.P)లో ఇతర పార్టీలతో పొత్తుపై ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఇటీవల అన్నారు. అలాంటి నిర్ణయానికి ఏపీ యూనిట్ అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీలో బీజేపీ (BJP) పొత్తు జనసేనతో మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మాట్లాడుతూ, అరెస్టు సమయంలో ఎలాంటి కేసు నమోదు కాలేదని, అరెస్టు సమయంలో అనుసరించిన విధానాన్ని తమ పార్టీ తొలిసారిగా ఖండించిందని, ఆమె చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మాట్లాడడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ధోరణి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పొత్తు గురించి క్లారిటీ ఎన్నికలకు (Elections) మూడు నెలలు ముందే అంటూ స్పష్టం చేశారు.

పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తాము ఎంతగానో విశ్వసించే బీజేపీ (BJP) ఎప్పటిలాగే కట్టుబడి ఉందని, ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) చెప్పుకొచ్చారు. చేపట్టిన పనులన్నింటికీ కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తోంది అని కూడా వెల్లడించారు. ఇటీవల ప్రధానమంత్రి (PM) నరేంద్ర మోదీ పుట్టినరోజున కొత్తగా ప్రారంభించిన ప్రధానమంత్రి (PM) విశ్వకర్మ యోజన, నిజంగా అద్భుతమైనదని, సంప్రదాయ కళాకారులకు మేలు చేస్తుందని ఆమె నొక్కి చెప్పారు. ఈ పథకం కోసం కేంద్రం ఇప్పటికే 13 వేల కోట్లు కేటాయించిందని, ప్రారంభించిన యోజన గురించి ఆనందాన్ని వ్యక్తం చేశారు పురందేశ్వరి (Daggubati Purandeswari).

పురందేశ్వరి గురించి మరింత: 

పురందేశ్వరి (Daggubati Purandeswari) కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009లో విశాఖ (Vizag) నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేసింది.

పురందేశ్వరి (Daggubati Purandeswari) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరింది పురందేశ్వరి (Daggubati Purandeswari). ఆమె అనంతరం  మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా, బీజేపీ (BJP) ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆమెను 2023 జులై 4న  ఆంధ్రప్రదేశ్ బీజేపీ (BJP) అధ్యక్షురాలిగా బీజేపీ (BJP) కేంద్ర నాయకత్వం నియమించింది.