పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంధన పొదుపు కోసం ‘టాప్ పర్ఫార్మర్’ అవార్డును అందుకుంది

మన జీవితంలోని ప్రతి అంశం విద్యుత్తుపై ఆధారపడి ఉంటుంది. సౌకర్యవంతమైన, సులభమైన జీవితానికి, విద్యుత్తు చాలా ముఖ్యమైనది. ప్రపంచం విద్యుత్ లేకుండా ఉండదు. మన ఆరోగ్యానికి మరియు విద్యకు విద్యుత్తు చాలా అవసరం. విద్యుత్తు లేకుండా, సర్జన్ తన శస్త్రచికిత్స కూడా చేయలేరు. విద్యార్థులకు ఆచరణాత్మక పరిజ్ఞానం అందుబాటులో ఉండదు. గ్యారేజీల్లో పనిచేసే మోటార్ మెకానిక్‌లకు, ఫ్యాక్టరీ ఇంజనీర్లకు కూడా విద్యుత్తు అవసరం. రైల్వే స్టేషన్ నుండి విమానాశ్రయం లేదా ఇతర ప్రదేశాలకు ప్రయాణీకులను రవాణా చేయడానికి […]

Share:

మన జీవితంలోని ప్రతి అంశం విద్యుత్తుపై ఆధారపడి ఉంటుంది. సౌకర్యవంతమైన, సులభమైన జీవితానికి, విద్యుత్తు చాలా ముఖ్యమైనది. ప్రపంచం విద్యుత్ లేకుండా ఉండదు. మన ఆరోగ్యానికి మరియు విద్యకు విద్యుత్తు చాలా అవసరం. విద్యుత్తు లేకుండా, సర్జన్ తన శస్త్రచికిత్స కూడా చేయలేరు. విద్యార్థులకు ఆచరణాత్మక పరిజ్ఞానం అందుబాటులో ఉండదు.

గ్యారేజీల్లో పనిచేసే మోటార్ మెకానిక్‌లకు, ఫ్యాక్టరీ ఇంజనీర్లకు కూడా విద్యుత్తు అవసరం. రైల్వే స్టేషన్ నుండి విమానాశ్రయం లేదా ఇతర ప్రదేశాలకు ప్రయాణీకులను రవాణా చేయడానికి కావలసిందల్లా విద్యుత్. ఈ రోజుల్లో మన ప్రభుత్వం విద్యుత్ తో నడిచే వాహనాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభత్వం ఎన్నో విధాలుగా విద్యుత్ ఆదా చేసిన ప్రభుత్వ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహిస్తోంది.

మార్చి 1, 2023న న్యూఢిల్లీలో జరిగిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ 21వ స్థాపన వేడుకల సందర్భంగా పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది. విద్యుత్ పొదుపు కోసం తీసుకున్న అన్ని చర్యలు, అన్ని డిస్కమ్‌లలో భారత ప్రభుత్వపు విద్యుత్ మంత్రిత్వ శాఖ, పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ ప్రోగ్రామ్ అందజేసిన అవార్డులలో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ టాప్ పెర్ఫార్మర్‌గా అవార్డు పొందింది. ఎనర్జీ ఆడిట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ హెచ్. ఎల్. గోయల్ ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. 

PAT [పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్] సైకిల్-II సమయంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి 80,686 ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లు (ESCerts) జారీ చేసినట్లు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. ప్రతి ESCert విలువ దాదాపు రూ.1,840 కాబట్టి మొత్తం విలువ రూ. 14.84 కోట్లు అని ప్రతినిథి తెలిపారు. వీటిని పవర్ ఎక్స్ఛేంజ్‌లలో వర్తకం చేయవచ్చని కూడా ప్రతినిధి తెలియజేశారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ టాప్ పెర్ఫార్మర్ అవార్డు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ జాతీయ కార్యక్రమంలో భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రి ఆర్ .కె. సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఈ జాతీయ సభలో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు టాప్ పెర్ఫార్మర్ అవార్డును, ప్రశంసా పత్రాన్ని క్యాబినెట్ ఆఫ్ పవర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, శ్రీ ఆర్ .కె. సింగ్ అందజేశారు. 

PAT [పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్] అనేది నేషనల్ మిషన్ ఆన్ ఎన్‌హాన్స్‌డ్ ఎఫిషియెన్సీ కింద ఒక ప్రధాన పథకం అని కూడా విద్యుత్ మంత్రి తెలిపారు. PAT [పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్] పథకం కింద ఎంటిటీలకు కార్బన్ ఉద్గార లక్ష్యాలు ఇవ్వబడతాయి. ఎవరైనా తమ లక్ష్యాలను సాధించి, ఎనర్జీ ఆడిట్‌ల సమయంలో సర్టిఫికేట్లు పొందితే, పవర్ ఎక్స్ఛేంజ్‌లలో ట్రేడ్ చేయగల ESCert [ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లు] పత్రాలు ఇవ్వబడతాయని ఆయన తెలిపారు.

పంజాబ్ విద్యుత్ శాఖా మంత్రి శ్రీ హర్భజన్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ETO PAT [పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్] సైకిల్-II సమయంలో పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ గౌరవ సత్కారం లభించింది.