రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంకా గాంధీ మద్దతు

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్ర శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. గత వారం రోజులుగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణల సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ శరణ్ […]

Share:

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్ర శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు.

గత వారం రోజులుగా రెజ్లర్ల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణల సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్  చేస్తున్నారు. కాగా సుప్రీంకోర్టు జోక్యంతో నిన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

ఈ రోజు కర్ణాటక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ప్రియాంకా గాంధీ ఉదయం జంతర్ మంతర్ చేరుకున్నారు. అనంతరం నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో మాట్లాడారు. గతంలోనే రెజ్లర్లకు మద్దతు తెలిపిన ప్రియాంకా తాజాగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంలో దోషులను రక్షించాలనుకుంటున్నారాని ప్రభుత్వాన్ని అని ప్రశ్నించింది.

నమోదైన ఎఫ్ఎస్ఐఆర్ కాపీలో ఏముందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎందుకు చూపించడం లేదు? రెజ్లర్లు పతకాలు గెలిస్తే మాత్రం మనమంతా ట్వీట్లు చేసి గర్వంగా ఫీలవుతాం. కానీ ఇప్పుడు వారు న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. మహిళా రెజ్లర్లందరూ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఆయన్ను (బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్) ప్రభుత్వం ఎందుకు కాపాడుతోందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రధాన మంత్రి నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు. ఒకవేళ ఆయన ఈ రెజ్లర్ల గురించి ఆలోచించి ఉంటే.. వారితో ఎందుకు మాట్లాడలేదు.. వారిని ఇంకా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. 

అటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్ష శనివారంతో ఏడో రోజుకు చేరుకుంది. అయితే దిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద విద్యుత్, నీటి కనెక్షన్లను నిలిపివేశారు. నీరు, ఆహారం తీసుకురావడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని మల్లయోధులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో కూర్చున్న రెజ్లర్లు మొబైల్ వెలుగులో భోజనం చేస్తున్నారు. అయితే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బజరంగ్ పునియా తెలిపారు. 

మరోవైపు పోలీసులు వారితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఇతర రెజ్లర్లు తెలిపారు. నిరసనలు తెలపాలంటే రోడ్డుపై పడుకోండి అంటున్నారని అన్నారు. దిల్లీలోని రెజ్లర్ వినేష్ ఫోగాట్ పాటు ఇతర రెజ్లర్లు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారితో సంభాషించిన పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ కాపీ ఒకటి రెజ్లర్లకు అందించారు. పోక్సో కింద నమోదైన ఎఫ్ఎస్ఐఆర్ కాపీని మాత్రం వారికి ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా తనపై నమోదైన ఎఫ్ఎఆర్ గురించి రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ స్పందించారు. తనకు ఎటువంటి ఎఫ్ఎస్ఐఆర్ కాపీ అందలేదని.. అది అందిన “తర్వాతనే ఈ విషయంపై మాట్లాడతానని అన్నారు. అంతే కాకుండా విచారణను ఎదుర్కోవడంతో పాటు దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

నేను నిర్దోషిని, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. దర్యాప్తు సంస్థకు సహకరించేందుకు కూడా నేను సిద్ధమే. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే. కాకుండా నేను సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాను. ఈ సమయయంలో రాజీనామా చేయడం పెద్ద విషయం కాదు. కానీ నేను నేరస్థుడిని కాదు. నేను రాజీనామా చేస్తే వారి (మల్లయోధుల ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుంది. నా పదవీకాలం దాదాపు ముగిసింది. ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇక ఎన్నికల తర్వాత నా పదవీకాలం ముగుస్తుంది” అని అన్నారు.