ప్రియాంక గాంధీ పార్లమెంట్ ఎంట్రీ..? 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సుప్రీం కోర్ట్ నుంచి లభించిన తర్వాత పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా మణిపూర్ విషయాల గురించి బిజెపి మాట్లాడాలని డిమాండ్ చేయడంతో పాటుగా మణిపూర్ లోని జరుగుతున్న హింసను ఆపేందుకు ఇండియన్ ఆర్మీని దింపమన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. మరోపక్క ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శనివారం మీడియాతో మాట్లాడుతూ, తన భార్య ప్రియాంక గాంధీకి పార్లమెంట్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె కచ్చితంగా పార్లమెంట్లో […]

Share:

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సుప్రీం కోర్ట్ నుంచి లభించిన తర్వాత పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా మణిపూర్ విషయాల గురించి బిజెపి మాట్లాడాలని డిమాండ్ చేయడంతో పాటుగా మణిపూర్ లోని జరుగుతున్న హింసను ఆపేందుకు ఇండియన్ ఆర్మీని దింపమన్నారు. అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. మరోపక్క ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శనివారం మీడియాతో మాట్లాడుతూ, తన భార్య ప్రియాంక గాంధీకి పార్లమెంట్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె కచ్చితంగా పార్లమెంట్లో ఉండాలని అన్నారు. ఆమె లోక్‌సభ ప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాబర్ట్ వాద్రా.

ఆమె లోక్‌సభ ప్రవేశానికి అర్హురాలు: 

ప్రియాంక గాంధీ పార్లమెంటులో ఉండాలని రాబర్ట్ వాద్రా భావిస్తున్నట్లు.. అంతేకాకుండా ఆమె ఖచ్చితంగా లోక్‌సభలో ఉండాలి అంటూ.. ప్రియాంక గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయి అని.. ఆమె పార్లమెంటులో ఉండాల్సిన వ్యక్తి అని.. ఆమె కచ్చితంగా పార్లమెంటులో నెలదొక్కుకోగలదని, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఆశిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ తన పేరును వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీతో పోల్చినందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కూడా వాద్రా మండిపడ్డారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అదానీతో కలిసి ఉన్న వాద్రా ఫోటోని షేర్ చేశారు స్మృతి ఇరానీ. దీని గురించి రాబర్ట్ స్మృతి ఇరానీ పై ఇంకాస్త మండిపడ్డారు.

నా పేరు ఎందుకు ప్రస్తావించారు: 

తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, అధికార పార్టీ తన పేరు ప్రస్తావన చేసినందు వల్లే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని వాద్రా అన్నారు. అదానీ విమానంలో కూర్చొని ఉన్న ప్రధానమంత్రి ఫోటో కూడా తమ వద్ద ఉంది అని, మరి ఇటువంటి ఫోటోల గురించి ఎందుకు ప్రశ్నలు అడగకూడదు ఆయన చర్చకు దిగారు. అంతేకాకుండా పార్లమెంటులో రాహుల్ గాంధీ అడిగిన ఈ ప్రశ్నలకు, అధికార పార్టీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అంటూ ప్రశ్నించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ..”నేను నా పేరు కోసం పోరాడటానికి మాట్లాడతాను ఎందుకంటే వారు చెప్పేది ఏదైనా ఉంటే.. వాళ్లు కచ్చితంగా దాన్ని నిరూపించాలి. అంతేగాని, లేనిపోని విషయాల గురించి మాట్లాడుతూ భారత దేశంలో అనేక విషయాలు జరుగుతుంటే వాటిని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అధికార పార్టీ ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారోఒకవేళ నిరూపించలేకపోతే, కచ్చితంగా తమకి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది, అని రాబర్ట్ వాద్రా చెప్పాడు.

చాంపియన్ మహిళా రెజ్లర్లు తమ హక్కుల కోసం ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారని, అయితే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఇరానీ ఏనాడూ వారిని కలవడానికి, వారి బాధలను వినడానికి వెళ్లలేదని వాద్రా అన్నారు. ‘స్మృతి ఇరానీ తమను కలవడం, వారి సమస్యలు చెప్పుకోవడం తాను చూడలేదని.. మణిపూర్ మరో పక్క హింసకు గురవుతోంది, ఇవన్నీ వదిలేసి, మంత్రి స్మృతి ఇరానీ తన గురించి ఏదో ఒక రకమైన నెగిటివ్ విషయాన్ని తీసుకురావాల్సి అవసరంగ ఏముంది అని.. ఆ సమయంలో తాను పార్లమెంటులో కూడా లేను అంటూ వాపోయాడు రాబర్ట్.

ఈ విషయాలన్నీ మాట్లాడటానికి కారణం కేవలం అధికార పార్టీ అసలు విషయాలు తప్పించేందుకు అనవసరమైన విషయాలను వెతుకుతున్నట్లు ఆయన మరోసారి గుర్తు చేసి అధికార పార్టీ మీద మరోసారి మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమిపై, కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమిలో చేరిందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమకు (ఎన్‌డిఎ) మంచి పోటీ ఇస్తుందని అన్నారు.