పృథ్వీషా సెల్ఫీ వివాదం: సప్నా గిల్ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు..

గతంలో ముంబైలోని హోటల్‌కి వచ్చిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్ ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్విషా వారు పదేపదే అడగడంతో నిరాకరించారు. దాంతో హోటల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా వారు ఆ క్రికెటర్‌ను వెంబడించి అతనితో వాగ్వాదానికి దిగారని.. తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని ఆరోపించాడు. దాంతో ముంబై ఓషివారా పోలీసులు సప్నతో సహా 8 మందిని అరెస్టు చేశారు.  బెయిల్‌పై బయటకు వచ్చిన […]

Share:

గతంలో ముంబైలోని హోటల్‌కి వచ్చిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్ ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్విషా వారు పదేపదే అడగడంతో నిరాకరించారు. దాంతో హోటల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా వారు ఆ క్రికెటర్‌ను వెంబడించి అతనితో వాగ్వాదానికి దిగారని.. తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని ఆరోపించాడు. దాంతో ముంబై ఓషివారా పోలీసులు సప్నతో సహా 8 మందిని అరెస్టు చేశారు.  బెయిల్‌పై బయటకు వచ్చిన సప్న… పృథ్వీషాపై తిరిగి కేసు నమోదు చేసింది..

పృథ్వీషా స్నేహితుడు ఆశీష్ యాదవ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 17న సప్నా గిల్‌ను అరెస్టు చేశారు. ఈ అరెస్టు కారణంగానే తన ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని తెలిపింది. ఇదిలా ఉంటే సప్న ముంబై ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌లో ఈ క్రికెటర్‌పై ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 24న ఆమెకు పోలీసుల నుంచి సమాధానం వచ్చిందని మరుసటి రోజు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని అధికారులు తెలిపారు.. ఇంకా ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలిపారు.

పోలీసులకు ఇచ్చిన రెండు పేజీల వాంగ్మూలంలో ఫిబ్రవరి 15న తాను ఒక లగ్జరీ హోటల్లో పార్టీ చేసుకుంటుండగా.. సదరు క్రికెటర్‌ను చూడగానే అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందని ఫిర్యాదులో తెలిపింది. తన స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ కోసం పృథ్వీషాను సంప్రదించగా వాగ్వాదానికి దిగాడని అతడు బలవంతంగా తన స్నేహితురాలి ఫోను తీసుకొని నేలపై హింసాత్మకంగా విసిరి, పాడు చేశాడని ఆరోపించింది. తను క్రికెట్‌ను అంతగా అభిమానించనని, అసలు పృథ్వీషా ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేసింది. కావాలనే అతడు అతని స్నేహితులు తమపై దాడి చేశారని.. నేను వద్దని వారించినప్పటికీ తన మాటలు వినకుండా అనుచితంగా ప్రవర్తించాడని స్పష్టం చేసింది. ఆ సమయంలో పృథ్వీ తనను అనుచితంగా తాకాడని, నెట్టాడని స్పష్టం చెప్పింది. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే.. అతడు వద్దని అభ్యర్థించాడని, తన స్నేహితులు కూడా వద్దని చెప్పడంతో ఆ సమయంలో ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసింది.

కానీ పృథ్వీషా మాత్రం తనపై తన స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపింది. పృథ్వీషా సప్నా గిల్‌పై దోపిడీ కేసు పెట్టాడు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ.. నేను 50,000 అడిగానని చెబుతున్నారు. ఈరోజుల్లో 50 వేలు అంటే ఎంత.? నేను రెండు రీళ్ళు చేసి ఒక్కరోజులో అంత సంపాదించగలను. ఆరోపణ చేయాలంటే కనీసం కొంత స్థాయి అయినా ఉండాలని సప్నా తెలిపింది.

ఇప్పుడు ఎయిర్ పోర్ట్‌లో పోలీస్ స్టేషన్ అధికారులు నా కంప్లైంట్ స్టేట్మెంట్‌ను రికార్డు చేశారు. కానీ ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని ఇన్స్పెక్టర్ ఖాన్ అన్నారు. ఆమెతో వారి తరుపు లాయర్ మాట్లాడుతూ పృథ్వీకి వ్యతిరేకంగా వెళ్ళవద్దని పలు రకాలుగా ఒత్తిడి చేశారని తెలిపింది.

Tags :