అమ్మాయిల బాత్రూమ్‌లో కెమెరా పెట్టిన ప్రిన్స్‌ప‌ల్

స్కూల్ వాష్ రూమ్స్ లో కెమెరాలు పెట్టారని అమ్మాయిల పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  అమ్మాయిలకు భద్రత లేదా? ప్రతిరోజు గర్ల్స్ విషయంలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ప్రతిరోజు దేశంలో ఎంతోమంది ఏదో విధంగా అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడేమో పూణేలో ఈ స్కూల్ ఘటన,  డివై పాటిల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని విశ్వహిందూ పరిషత్ వాళ్ళు చితకబాదారు. ఈ స్కూల్లో క్రిస్టియన్ ప్రేయర్స్ చేయమంటున్నారని ఆరోపణ కూడా ఉంది.  […]

Share:

స్కూల్ వాష్ రూమ్స్ లో కెమెరాలు పెట్టారని అమ్మాయిల పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

అమ్మాయిలకు భద్రత లేదా?

ప్రతిరోజు గర్ల్స్ విషయంలో ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ప్రతిరోజు దేశంలో ఎంతోమంది ఏదో విధంగా అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడేమో పూణేలో ఈ స్కూల్ ఘటన, 

డివై పాటిల్ స్కూల్ ప్రిన్సిపాల్ ని విశ్వహిందూ పరిషత్ వాళ్ళు చితకబాదారు. ఈ స్కూల్లో క్రిస్టియన్ ప్రేయర్స్ చేయమంటున్నారని ఆరోపణ కూడా ఉంది. 

పేరెంట్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్కూల్ ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మనకు తెలిసిన రిపోర్ట్స్ ప్రకారం ఈ స్కూల్ పోయిన నెల ఓపెన్ అయింది. ఈ స్కూల్లో టాయిలెట్స్ లో కెమెరాలు ఇన్స్టాల్ చేశారని గర్ల్స్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ విషయం తెలిసి విశ్వహిందూ పరిషత్ వాళ్లు స్కూల్ ప్రిన్సిపాల్ ని చితకబాదారు. స్కూల్లో పిల్లలని క్రిస్టియన్ మతానికి మారమని బలవంతం చేసుకున్నారని ఆరోపణ కూడా ఉంది. ఈ స్కూల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అధికారి వెల్లడించాడు. 

దేశంలో అమ్మాయిలపై జరిగే ఆగడాలు ఆపడం ఎలా? 

మన దేశంలో గర్ల్స్ మీద రోజు ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉంది. రోజు చాలామంది సఫర్ అవుతూనే ఉన్నారు. ఇలాగే ఘటనలు జరుగుతూ పోతే ఆడవాళ్లు బయటకు రావాలంటేనే భయపడతారు. అందుకే మనం వీలైనంత త్వరగా వీటిని ఆపాలి. ముందుగా మనం గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్లకి చాలా ధైర్యం ఇవ్వాలి. వాళ్లని బలంగా తయారు చేయాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పాలి. ఇలా నేర్పడం వల్ల వాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. ఇవన్నీ కాకుండా గర్ల్స్ కి మనం భద్రత ఇవ్వాలి. చట్టాలని చాలా కఠినంగా ఉంచాలి. ఎవరైనా అమ్మాయిని చూడాలంటే భయపడేలా చేయాలి. మన చట్టాలు ఆ విధంగా ఉండాలి. అలా చట్టాలు తయారుచేస్తే ప్రతి ఒక్కరూ భయపడతారు. వీటితోపాటు అమ్మాయిలని గౌరవంగా చూడాలి అనే విషయాన్ని కూడా నేర్పాలి. వాళ్లకి కూడా హక్కులున్నాయని నేర్పాలి. ముఖ్యంగా బాయ్స్ కి క్రమశిక్షణ నేర్పాలి. ఇలా నేర్పడం వల్ల వాళ్లు అమ్మాయిలతో మంచిగా ప్రవర్తిస్తారు. అప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గిపోతాయి. మన దేశంలో బాయ్స్ కి మితిమీరిన స్వేచ్ఛ ఉంది. ముందు మనం దాన్ని తగ్గించాలి. ఇలా చేయడంతో పాటు గర్ల్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పితే సగం నేరాలు తగ్గిపోతాయి. ఒక సొసైటీగా అందరూ కలిసే ఉంటారు. ప్రభుత్వం ఈ విషయంపై గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వాళ్లను ఘోరంగా శిక్షిస్తే ఇలాంటివి చేయాలంటే వేరే వాళ్ళు భయపడతారు. అలా భయపడటం వల్ల క్రమంగా మన దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న ఆగడాలు తగ్గిపోయి మన దేశం బాగుంటుంది. ఒక మంచి పౌరుడు అంటే దేశాన్ని కాపాడటమే కాదు. అమ్మాయిల పట్ల గౌరవం కూడా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే మనం దేశానికి గౌరవం ఇచ్చినట్టు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది అని ఆశిస్తున్నాం.