50 వేల మంది కర్ణాటక బీజేపీ కార్యకర్తలతో రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్

దేశం లోనే ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీ కూడా చెయ్యని కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపెట్టబోతున్నారు. ఏప్రిల్ 27న అంటే రేపు ఆయన కర్ణాటక లో 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ మీటింగ్ పెట్టబోతున్నారు. 58112  పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ మినిస్టర్ శోభా కరణ్ డాల్జె మీడియాకి తెలిపారు.  కర్ణాటకలో […]

Share:

దేశం లోనే ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీ కూడా చెయ్యని కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపెట్టబోతున్నారు. ఏప్రిల్ 27న అంటే రేపు ఆయన కర్ణాటక లో 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్ మీటింగ్ పెట్టబోతున్నారు. 58112  పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ మినిస్టర్ శోభా కరణ్ డాల్జె మీడియాకి తెలిపారు.  కర్ణాటకలో మరోసారి బీజేపీ జెండా రెపరెపలాడడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ మీటింగ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారని ఈ సందర్భంగా మినిస్టర్ చెప్పుకొచ్చారు. అంతే కాదు బీజేపీని కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేసిన కార్యకర్తలను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రశంసించనున్నారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రత్యర్థుల ఎత్తులను, వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలి అనే దానిపై కూడా చర్చించనున్నారు.

అటు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే  మీడియా ఛానెల్స్ సర్వేలు ప్రకటించడం సర్వసాధారణమే, కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి జరగబొయ్యే ఎన్నికలు చాలా కఠినతరంగా ఉండబోతుందని, ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పడం చాలా కష్టం అయిపోతుందని, అయితే కొన్ని విశ్వసనీయ సర్వేల ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ తక్కువ మార్జి‌ తో అయినా గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 106 నుండి 116 సీట్లు, బీజేపీకి 79 నుండి 89 సీట్లు, JDS పార్టీ కి 24 నుండి 34 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేయబోతుందని  చెప్పాయి. ఇలా సర్వేలు పూర్తి బిన్నంగా రావడంతో ఈసారి ఎవరు గెలుస్తారు అనే దానిపై ముందుగా అంచనా వెయ్యలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక పోతే సినీ తారలు ఇలా ఎన్నికల సమయాలలో బయటకి వచ్చి తమకి ఇష్టమైన పార్టీలకు మద్దతు తెలిపి ప్రచారం చెయ్యడం వంటివి మనం దశాబ్దాల నుండి చూస్తూనే ఉన్నాము. మన తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య సినీ తారలు కొంతమంది బహిరంగంగా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి భయపడుతున్నారు కానీ.. కర్ణాటకలో అలా లేదు, పెద్ద పెద్ద స్టార్స్ సైతం తమకి ఇష్టమైన పార్టీలకు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. శాండిల్ వుడ్ క్రేజీ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దత్తు ఇస్తున్నట్టుగా మీడియా ముందుకి వచ్చి చెప్పాడు. మరో పక్క శివ రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు. ఇద్దరు కర్ణాటకలో యూత్, మాస్‌లో మంచి క్రేజ్ ఉన్నవాళ్లే. కానీ రాజ్ కుమార్ కుటుంబం ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం ఉంది రాజకీయ నాయకుల్లో. చూడాలి మరి హోరాహోరీగా జరగబోతున్న ఈ పోరులో ఎవరు గెలవబోతున్నారో , ఎవరు ఓడిపోబోతున్నారో, రేపు ప్రధాన మంత్రి వర్చువల్ మీటింగ్ లో కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశాలు ఇవ్వబోతున్నారో మరి.