155 రూపాయలకు పెరిగిన కిలో టమాటా ధర

కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ   టమాటా రేట్లు మెట్రో సిటీలలో 58 నుండి 148 గా ఉందని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోని పురోలియాలో ఒక కిలో టమాటా ధర 155 పలికింది. దేశంలో సెగలు రేపుతున్న టమాటా ధర: మంగళవారం చాలా సిటీల్లో కిలో టమాటా ధర 155 రూపాయలు పలికింది. వర్షాకాలం లేట్ అయినందువల్లే రేట్ బాగా పెరిగిందని రైతులు అంటున్నారు. ఈసారి ప్రతిసారి టైం కి వచ్చే ఋతుపవనాలు లేట్ గా వచ్చాయి.ఈసారి […]

Share:

కన్జ్యూమర్ ఎఫైర్స్ మినిస్ట్రీ   టమాటా రేట్లు మెట్రో సిటీలలో 58 నుండి 148 గా ఉందని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోని పురోలియాలో ఒక కిలో టమాటా ధర 155 పలికింది.

దేశంలో సెగలు రేపుతున్న టమాటా ధర:

మంగళవారం చాలా సిటీల్లో కిలో టమాటా ధర 155 రూపాయలు పలికింది. వర్షాకాలం లేట్ అయినందువల్లే రేట్ బాగా పెరిగిందని రైతులు అంటున్నారు. ఈసారి ప్రతిసారి టైం కి వచ్చే ఋతుపవనాలు లేట్ గా వచ్చాయి.ఈసారి సమ్మర్ సీజన్ చాలా ఎక్కువ రోజులు ఉంది. ఈ సమ్మర్ లో ప్రజలు చాలా అవస్థల పాలయ్యారు. రైతులు కూడా ఎండల వల్ల చాలా అవస్థలు పడ్డారు. వర్షాకాలం లేట్ అవ్వడంతో

టమాటాల రేట్లు ఇంత పెరిగాయి అని అంటున్నారు.

కోల్ కతాలో 155 రూపాయలు పలికిన టమాటా ధర, చెన్నైలో 110 రూపాయలు గాను, ఢిల్లీలో 117 రూపాయలు గాను నమోదయింది.కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపిన దాని ప్రకారం ఇండియా మొత్తం పరిశీలిస్తే కిలో టమాటా ధర 83.29 గా ఉంది. కానీ మార్కెట్లలో దాన్ని 100కు అమ్ముతున్నారు. 

వేర్వేరు ప్రాంతాల్లో టమాటా ధరలు:

ఢిల్లీలో లోకల్ మార్కెట్లలో కిలో  140 దాకా అమ్ముతున్నారు.ఉత్తర ప్రదేశ్, హర్యానాల నుండి సప్లై రానందువల్లనే ఢిల్లీలో రేట్ పెరిగింది అంటున్నారు. ఈ రేట్లు రానున్న 15 రోజుల్లో తగ్గుతాయని గవర్నమెంట్ అంటుంది. వచ్చే నెల రోజుల్లో టమాటా రేట్లు నార్మల్ అవుతాయని గవర్నమెంట్ అంటుంది. ఒక నెల క్రితం వరకు కిలో టమాట ధర 20 రూపాయలుగా ఉండేది.

కానీ సీజన్ ఆలస్యం అవ్వడం వల్ల దీని రేటు భారీగా పెరిగింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో దాదాపు ప్రతి ఇంట్లో టమాటా వాడుతారు. ఇప్పుడు వాళ్లంతా దీని రేట్ పెరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. టమాటా వల్ల మన శరీరానికి కూడా చాలా లాభాలు ఉంటాయి దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మన శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది. టమాటా సలాడ్స్ తో కలిపి తింటే మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టమాట ధర హైదరాబాద్ లో దాదాపు కిలో 150 దాకా ఉంది. హైదరాబాద్ లో లోకల్ మార్కెట్లలో దీని రేటు ఇంకా ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దాదాపు అన్ని మెట్రో సిటీలలో ఇదే పరిస్థితి. టమాటా ధర రానున్న రెండు వారాల్లో తగ్గాలంటే ముందుగా వర్షాలు పడాలి. వర్షాలు పడ్డాక ఆటోమెటిగ్గా దీని రేటు తగ్గిపోతుంది. ఒక నెలలో టమాటో ధర సాధారణ స్థాయికి వస్తుండొచ్చని గవర్నమెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఈ రేట్లు చూసి చాలామంది నిరాశ చెందుతున్నారు. ఆకాశాన్నంటిన టమాట ధరలు త్వరలోనే తగ్గుముఖం పడతాయని అందరూ ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టమాట ధరలు భారీగానే ఉన్నాయి. అక్కడ కిలో టమాటా ధర దాదాపు 120 పైగానే ఉంది. అక్కడ కూడా ప్రైవేట్ మార్కెట్లలో వీటి ధర ఎక్కువ చేసి అమ్ముతున్నారు. వీటి ధర త్వరలోనే తగ్గుముఖం పట్టాలని కోరుకుందాం.