ఇండియన్ నేవీకి మరో యుద్ధనౌక

భారత నౌకాదళం ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. కొద్ది రోజుల నుంచి మన నౌకాదళం ఫుల్ స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. నేవీకి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇండియాలో తయారు చేసిన పలు యుద్ధ నౌకలను ఇప్పటికే నేవీకి అందించిన ప్రభుత్వం తాజాగా మరో యుద్ధ నౌకను కూడా జలాల్లోకి విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఈ అధునాతన యుద్ధ నౌకను రాష్ట్రపతి జలాల్లోకి విడుదల చేసింది.  INS వింధ్యగిరి GRSE అధికారి తెలిపిన […]

Share:

భారత నౌకాదళం ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది. కొద్ది రోజుల నుంచి మన నౌకాదళం ఫుల్ స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. నేవీకి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇండియాలో తయారు చేసిన పలు యుద్ధ నౌకలను ఇప్పటికే నేవీకి అందించిన ప్రభుత్వం తాజాగా మరో యుద్ధ నౌకను కూడా జలాల్లోకి విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఈ అధునాతన యుద్ధ నౌకను రాష్ట్రపతి జలాల్లోకి విడుదల చేసింది. 

INS వింధ్యగిరి

GRSE అధికారి తెలిపిన వివరాల ప్రకారం P17 నౌకలు గైడెడ్ యుద్ధ క్షిపణి యుద్ధనౌకలుగా సేవలందింస్తాయి. ఇవి ఒక్కొక్కటి 149 మీటర్ల పొడవు, సుమారు 6,670 టన్నుల స్థానభ్రంశాన్ని మరియు 28 నాట్ల వేగాన్ని కలిగి ఉంటాయి. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా లో గల హుగ్గీ నదీ ఒడ్డున ఉన్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE) ఫెసిలిటీలో రాష్ట్రపతి, ఇండియన్ ఫస్ట్ లేడీ ద్రౌపది ముర్ము INS వింధ్యగిరి అనే సరికొత్త యుద్ధ నౌకను ప్రారంభించారు. ఆమె ఈ నౌకను నదీ జలాల్లో వదిలారు. ఇది దాని పనులను ఇక నుంచి ప్రారంభించనుంది. ఈ నౌక చేరికతో మన నేవీ మరింత బలోపేతం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్. దీనిని ప్రారంభించడం కోసమే ముర్ము పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు. కర్ణాటకలోని పర్వతాల శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఇది ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్ లో ఆరో నౌక. ఈ సరికొత్త యుద్ధ నౌకలో అనేక అధునాతన సదుపాయాలు ఉన్నాయి. 

మూడు రకాలుగా ఉపయోగపడతాయి.. 

ఈ అధునాతన యుద్ధ నౌకలలో ఎన్నో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాయు, ఉపరితలం, మరియు నీటి మీదుగా వచ్చే క్షిపణుల నుంచి మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాయని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నౌకలను మన నేవీని ఎంతో పటిష్టం చేస్తాయని డిఫెన్స్ తెలిపింది. రాష్ట్రపతి అయిన తర్వాత ముర్ము పశ్చిమ బెంగాల్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ సారి ఆమె దేశానికి ఎంతో ఉపయోగపడే ఈ నౌకను ప్రారంభించింది. 

ఇదే చివరిది.. 

ఇండియన్ నేవీ కోసం డిఫెన్స్ PSU GRSE నిర్మిస్తున్న యుద్ద నౌకల్లో వింధ్యగిరి ప్రాజెక్టు నౌక చివరిది. మొదటి ఐదు యుద్ధ నౌకలు 2019-22 మధ్య ప్రారంభించబడ్డాయి. ఇక ఈ నౌక 2023లో దేశానికి అంకితం చేయబడింది. ఈ నౌకల ద్వారా ఇండియన్ నేవీ మరింత బలోపేతం అవుతుందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నౌకల సామర్థ్యం చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 

ఇంకా వేరే కార్యక్రమాలు కూడా.,. 

గతేడాది రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ముర్ము పశ్చిమ బెంగాల్ లో పర్యటించడం ఇది రెండో సారి. ఈ సారి ఆమె కేవలం యుద్ధ నౌకను ప్రారంభించడం కోసం మాత్రమే కాకుండా రాజ్ భవన్ లో బ్రహ్మకుమారీలు నిర్వహించే కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు. ‘నాషా ముక్త్ భారత్ అభియాన్ కింద’ నా బెంగాల్, అడిక్షన్ ఫ్రీ బెంగాల్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ కుమారీస్ నిర్వహిస్తున్నారు. 

ఇక చివరగా ఇది భారత నేవీ అమ్ముల పొదిలో మరింత రాటు దేలనుంది. ఈ యుద్ధ నౌక రావడం వల్ల నేవీ స్ట్రెంత్ మరింత పెరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేవీ వాళ్లకు అందులో ఉన్న కమాండర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.