మెడిక‌ల్ క‌మిష‌న్ కొత్త రూల్‌పై డాక్టర్లు మండిపాటు

డాక్టర్లు పేషెంట్లకు మెడిసిన్స్‌ రాసేటప్పుడు బ్రాండెడ్‌వి కాకుండా జనరిక్‌ మందులు రాయాలన్న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాలను పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు డాక్టర్లు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ‘‘మేకింగ్‌ కెమిస్ట్స్ ది కింగ్‌, బ్రాండెడ్‌  డ్రగ్స్ తయారీని ఆపండి, రన్నింగ్‌  ట్రైన్‌ వితౌట్‌ ట్రాక్స్” వంటి పదాలు బాగా వినిపిస్తున్నాయి.  ఎన్‌ఎంసీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. డాక్టర్లు రోగులకు బ్రాండెడ్‌ మెడిసిన్స్ సూచించకూడదు. మెజారిటీ కేసుల్లో జనరిక్‌ మందులను […]

Share:

డాక్టర్లు పేషెంట్లకు మెడిసిన్స్‌ రాసేటప్పుడు బ్రాండెడ్‌వి కాకుండా జనరిక్‌ మందులు రాయాలన్న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఆదేశాలను పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు డాక్టర్లు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ‘‘మేకింగ్‌ కెమిస్ట్స్ ది కింగ్‌, బ్రాండెడ్‌  డ్రగ్స్ తయారీని ఆపండి, రన్నింగ్‌  ట్రైన్‌ వితౌట్‌ ట్రాక్స్” వంటి పదాలు బాగా వినిపిస్తున్నాయి. 

ఎన్‌ఎంసీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. డాక్టర్లు రోగులకు బ్రాండెడ్‌ మెడిసిన్స్ సూచించకూడదు. మెజారిటీ కేసుల్లో జనరిక్‌ మందులను రాయాలి. ఈ నిబంధనలనుపదే పదే ఉల్లంఘిస్తే లైసెన్సులను తాత్కాలికంగా సస్పెన్షన్‌ చేస్తామని హెచ్చరించింది.

ఉదాహరణకు బ్రాండ్‌ క్రోసిన్‌ బదులు.. డాక్టర్లు జనరిక్‌ ‘‘పారాసిటమాల్‌” మెడిసిన్‌ను రాయాల్సి ఉంటుంది. 

ఎన్‌ఎంసీ నిర్ణయంతో వైద్య రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తే మెడిసిన్‌ బ్రాండ్లను ఎన్నికును శక్తి మొత్తం కెమిస్టులు, ఫార్మసీ అవుట్లెట్ల చేతుల్లోకి వెళ్తుందని డాక్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఉదాహరణకు.. పారాసిటమాల్‌ 10 కంటే ఎక్కువ బ్రాండ్లలో, వందలాది జనరిక్‌ బ్రాండ్లలో లభిస్తుంది. తాజా నిబంధనతో రోగి ఫార్మసీ అవుట్‌లెట్‌కు డాక్టర్‌‌ ప్రిస్ర్కిప్షన్‌ (జనరిక్ పేర్లతో) తో వెళ్తాడు. అయితే, ఆ రోగికి కెమిస్ట్ ఏ బ్రాండ్‌ను విక్రయించాలనుకుంటున్నాడో అతనే నిర్ణయిస్తాడు.

చాలా సందర్భాల్లో కొనుగోలుదారుడు లేదా పేషెంట్‌ ఎలాంటి మెడిసిన్స్‌ తీసుకోవాలో  సొంతంగా నిర్ణయం తీసుకోలేరు. చాలావరకు కెమిస్ట్ సలహా తీసుకుంటాడు. దీంతో కెమిస్ట్ లాభదాయకమైన, ఎక్కువ మార్జిన్‌ ఉన్న బ్రాండ్‌ను రాస్తాడు అని న్యూఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్‌‌  డాక్టర్‌‌ సుమిత్‌ రాయ్‌ అన్నారు. 

‘‘డాక్టర్‌‌ ప్రిస్ర్కిప్షన్‌ ప్రకారం మెడిసిన్స్ తీసుకుంటే పేషెంట్ హెల్త్ బాగుపడే బాధ్యత డాక్టర్లపై ఉంటుంది. కానీ, ఇక్కడ కెమిస్ట్ వారికి నచ్చిన బ్రాండ్ మెడిసిన్ ఎంపిక చేసుకునే చాన్స్ ఉంటుంది. కాబట్టి, ప్రిస్క్రిప్షన్  బాధ్యత డాక్టర్‌‌ నుంచి కెమిస్ట్‌ కు మారుతుంది. చివరికి మందులను ఎంచుకునే అధికారం పేషెంట్లకు ఇచ్చే ప్రభుత్వ ఉద్దేశం విఫలం అవుతుంది’’ అని రాయ్‌ అన్నారు.

జనరిక్‌ మెడిసిన్స్ ను ఎంచుకునే అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రాండెడ్‌ మెడిసిన్స్‌ అమ్మకాలను పూర్తిగా  ఆపివేయాలని మరికొంత మంది డాక్టర్లు అన్నారు. 

బ్రాండ్‌ పేర్లను రాయొద్దని డాక్టర్లను అడగడానికి బదులుగా, మెడిసిన్స్‌పై, జనరిక్స్ పై బ్రాండ్‌ పేర్లు రాయొద్దని ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం సూచించవచ్చు కదా అని ఢిల్లీకి చెందినపీఎస్‌ఆర్‌‌ఐ హాస్పిటల్‌ డాక్టర్‌‌ సుమేత్‌ షా అన్నారు.

ట్రాక్స్‌ లేకుండా ట్రైన్స్ ను నడిపినట్టు ఉంటుంది… 

చాలా మంది సోషల్‌ మీడియాలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ‘తిరోగమన చర్య’ అని కోల్‌కతాకు చెందిన జీడీ హాస్పిటల్‌ అండ్‌ డయాబెటిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్‌‌ ఏకే సింగ్‌ అన్నారు. లైసెన్స్‌ పొందిన డాక్టర్ ప్రభుత్వం చేత ఆమోదం పొందిన చట్టబద్దంగా లభించే బ్రాండెడ్‌ డ్రగ్స్‌ ను సూచిస్తే.. అది నేరం ఎలా అవుతుంది? మరి ఈ మందులను ఎవరు సూచిస్తారు? ఎవరూ వాటిని సూచించకపోతే, వారు మార్కెట్‌లో ఎందుకు ఉన్నారు అని మరో డాక్టర్‌‌ ప్రశ్నించారు. జనరిక్‌ మందులు మాత్రమే రాస్తే, బ్రాండెడ్‌ డ్రగ్స్‌ ఎందుకు తయారు చేయాలి? బ్రాండెడ్‌ డ్రగ్స్ పంపిణీ చేయాలని ఎవరు నిర్ణయిస్తారు? మెడిసిన్‌, నాణ్యత సేమ్‌ అయినప్పుడు జనరిక్‌, బ్రాండెడ్‌ మందుల మధ్య తేడా ఏంటి? అని మణిపాల్‌లోని కస్తూర్భా మెడికల్‌ కాలేజీలోని స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ఆర్థోస్కోపి యూనిట్ హెడ్‌ డాక్టర్ వివేక్‌ పాండే ప్రశ్నించారు. ఎన్‌ఎంసీ నిర్ణయం ట్రాక్‌లు లేకుండా రైళ్లను నడపడానికి చేసిన ప్రయత్నంలా ఉందని ఇండియన్‌ మెడికల్‌అసోసియేషన్‌ (ఐఎంఏ) పేర్కొంది. జనరిక్‌ మందులు మాత్రమే రాయాలన్న నిర్ణయం పేషెంట్ల రక్షణ, భద్రతను ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.