Content: పిల్లల లైంగిక కంటెంట్ యాప్స్ ద్వారా సర్కులేషన్

తగిన చర్యలు తీసుకోవాలంటే కంప్లైంట్

Courtesy: Pexels

Share:

Content: హైదరాబాద్కు చెందిన బాలల హక్కుల కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత సునీతా కృష్ణన్ (Sunitha Krishnan), పిల్లల (Children)పై లైంగిక వేధింపుల మెటీరియల్, CSAM, పిల్లల (Children)పై లైంగిక దోపిడీని అనుమతించే పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయని, మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (telegram), డిజిటల్ చెల్లింపు యాప్లు PhonePe, Paytm లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంటెంట్ యాప్స్ ద్వారా సర్కులేషన్:

ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లు తమ నెట్వర్క్ ద్వారా CSAM ఒంటి కంటెంట్ (Content) సర్కులేషన్ జరుగుతున్న విధానానికి బాధ్యత వహించాలని Ms సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) పిలుపునిచ్చారు. పెద్దల ఫోటోగ్రఫీతో సహా పిల్లల (Children)కు సంబంధించిన లైంగిక అసభ్యకరమైన కంటెంట్ (Content) సర్కులేషన్, విక్రయాలను నిరోధించడానికి ప్రోటోకాల్లు పాటిస్తున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. పిల్లల (Children)కు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ (Content) కు సంబంధించిన మెటీరియల్స్ విక్రయిస్తూ, చాలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ యాప్స్ (App) డబ్బులు సంపాదిస్తున్నాయంటూ ఆరోపించారు Ms సునీతా కృష్ణన్ (Sunitha Krishnan).

విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం, తమ యాప్ వినియోగంలోకి వచ్చిన దగ్గర నుంచి, టెలిగ్రామ్ (telegram) ప్లాట్ఫారమ్లో పిల్లల (Children)కు సంబంధించి అబ్యూస్ చేసే మెటీరియల్ సహా, హానికరమైన కంటెంట్ (Content)‌ను మోడరేట్ చేసింది అంటూ టెలిగ్రామ్ (telegram) స్పందించింది. ఇలా మోడరేట్ చేసినప్పుడు ఏవైనా పిల్లల (Children)కు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ (Content) వెలుగులోకి వచ్చిన వెంటనే తొలగించడం కూడా జరుగుతుందని టెలిగ్రామ్ (telegram) స్పష్టం చేస్తుంది. పేటీఎం గానీ, ఫోన్పే గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

టెలిగ్రామ్ (telegram) ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన IM లేదా ఇన్స్టంట్ మెసేజింగ్, ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల వినియోగదారులతో యాప్లలో ఒకటి. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యా దాని అతిపెద్ద మార్కెట్లు. యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, ప్రైవేట్ ఛానెల్లు మరియు సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మెసేజ్లతో సహా విస్తృతమైన భద్రతా లక్షణాలను అందిస్తుంది.

ఇదంతా ఎలా ఉండగా మరోవైపు, CSAM ఆన్లైన్లో సెర్చ్ చేయడం అనేది ఎంత సులభమో అని, సెక్స్ ట్రాఫికింగ్ను ఎదుర్కొనే NGO, ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) చెప్పారు. లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలను పెద్ద సంఖ్యలో ప్రజలు అక్రమంగా కొనుగోలు చేయడం, అమ్మడం కూడా ఆమెను షాక్కు గురి చేసినట్లు తెలిపారు.

ప్రణాళిక ప్రకారం బయటపడిన నిజం:

టెలిగ్రామ్ (telegram) లో ఇటువంటి పిల్లల (Children) విషయానికి సంబంధించి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన మిస్ సునీతా కృష్ణన్ (Sunitha Krishnan), తనదైన శైలిలో విచారణ జరిపినట్లు, దాని ప్రకారమే ఇప్పుడు ఆధారాలతో కంప్లైంట్ నమోదు చేసినట్లు తెలపడం జరిగింది. టెలిగ్రామ్ (telegram) లోని CSAMకు సంబంధించిన విషయాలు సర్కులేట్ అవుతున్న కొన్ని గ్రూపులను సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) ఫాలో అవ్వడం జరిగింది. అంతేకాకుండా, తను స్వయంగా కొనుగోలు చేసేందుకు వశిష్ట అనే పేరుతో అనోన్మస్ గా ఎకౌంట్ క్రియేట్ చేసుకుంది. ఎవరైనా టెలిగ్రామ్ (telegram) ఓపెన్ చేసిన వెంటనే యాప్ లోని సెర్చ్ బార్ లో మీకు ఎటువంటి కంటెంట్ (Content) అయిన కనిపెట్టడానికి వీలు పడుతుందని, గూగుల్ మాదిరిగానే మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చు అంటూ సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) వెల్లడించారు. ఇదే మాదిరిగా CSAMకు సంబంధించిన కంటెంట్ (Content) అమ్మకాలు జరిపే చాలా గ్రూపులను ఆమె చూడడం జరిగింది.

ఆమె CSAM కోసం ముగ్గురు సెల్లర్స్ (Seller) తో పరిచయాన్ని ఏర్పరచుకుంది. ప్రతి సందర్భంలో Paytm లేదా PhonePe యాప్ ద్వారా చెల్లింపులు చేసింది. ఒక సెల్లర్ (Seller) నుండి ఆమె ₹ 50కి CSAM కొనుగోలు చేసినట్లు. ₹ 400 నుండి ₹ 150 వరకు బేరం చేసి మరిన్ని లింక్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే డబ్బులు పంపించినప్పటికీ కంటెంట్ (Content) ఆలస్యంగా రావడంతో, అనుమానం వచ్చి ఆలస్యం ఎందుకు అయిందని, సెల్లర్ (Seller) ని అడిగినప్పుడు, తాను ట్యూషన్ కి వెళ్లానని చెప్పినట్లు సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) వెల్లడించారు. అయితే విక్రయాలకు (Seller) పాల్పడుతున్న చాలామంది మైనర్లుగా (Minor) సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) గుర్తించినట్లు చెప్పుకొచ్చారు.

అయితే వెంటనే CSAMకు సంబంధించిన కంటెంట్ (Content) మరింత సర్కులేట్ జరగకుండా ఉండేందుకు మరింత దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలంటూ సునీతా కృష్ణన్ (Sunitha Krishnan) పోలీసులకు విజ్ఞప్తి చేస్తారు.