పొంగులేటి నమ్మకాన్ని బీఆర్ఎస్ వమ్ము చేసింది – వీహెచ్ఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం అవతరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ కోసం కె చంద్రశేఖర రావు చేసిన పోరాటం అంతా కాదని చెప్పాలి. అనంతరం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా అధిష్టాన్నాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణకు బాధ్యతలు చేపట్టి తెలంగాణను సుస్యశ్యామలంగా మార్చారు. అంతేకాదు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. […]

Share:

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రం అవతరించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ కోసం కె చంద్రశేఖర రావు చేసిన పోరాటం అంతా కాదని చెప్పాలి. అనంతరం తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా అధిష్టాన్నాన్ని కైవసం చేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణకు బాధ్యతలు చేపట్టి తెలంగాణను సుస్యశ్యామలంగా మార్చారు. అంతేకాదు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఎలాగైనా సరే కేసీఆర్ ను గద్దె దింపాలని తమ పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. అటు బిఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీలు పూర్తిస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే కేసీఆర్ వల్ల ప్రజలు ఏ మేరా లాభ పొందారో అందరికీ తెలిసిందే. ఎన్నో తెలియని ప్రాంతాలు కూడా ఇప్పుడు సుస్యశ్యామలంగా మారిపోయి సినిమాలను కూడా తెరకెక్కించేంత స్థాయికి తెలంగాణలోని ప్రాంతాలు ఎదిగాయి అంటే ఇక ఏ విధంగా అవి అభివృద్ధి చెందాయో అర్థం చేసుకోవచ్చు ఇది ఇలా ఉండగా తాజాగా ఇప్పుడు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి.

అసలు విషయంలోకెళితే టిఆర్ఎస్ అనే పేరును బి ఆర్ ఎస్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని.. పీ సీ సీ మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన రోజే కే చంద్రశేఖర రావు విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. దాంతో బీఆర్ఎస్ అధినేత పై నమ్మకం కోల్పోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు.  అతను వచ్చి నన్ను కలిశాడు.. ఇక మేము కలిసి మీతో పని చేస్తాము అలాగే ప్రజల కోరికలను వారికి మా హామీలను కూడా నెరవేరుస్తాము అంటూ తెలిపినట్లు శ్రీనివాస్ రెడ్డి సోమవారం వెల్లడించారు.. అంటూ హనుమంతరావు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పొంగులేటిని తన నివాసంలో పరామర్శించిన తర్వాత మీడియాతో వెల్లడించడం జరిగింది.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. పార్టీలో తనకు ఈ పదవి ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, భట్టి విక్రమార్క, హనుమంతరావు, రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీ,  మధుయాష్కి లకు ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా త్వరలోనే సీనియర్లందరినీ కలుస్తాను. ఇక ప్రజలు కోరుకున్న తెలంగాణను తీసుకురావడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను అంటూ వెల్లడించారు. అంతేకాదు రాహుల్ గాంధీ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన మాట్లాడుతూ క్యాప్సికం సాగు చేసి  రూ.10 కోట్లకు పైగా సంపాదించానని కే చంద్రశేఖర రావు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు రైతులను లక్షాధికారులను చేయడంలో ఎలా విఫలమయ్యారు.. కేటీఆర్  ఒకసారి రాహుల్ గాంధీ లాంటి వారిని పిలిచే ముందు తన స్థాయిని చూసుకోవాలి. అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఇకపోతే బీసీ గర్జన సభకు సంబంధించి రంగారెడ్డి, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ లో బీసీల సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు హనుమంతరావు ప్రత్యేక విలేకరి సమావేశంలో తెలిపారు.. మరి దీనిపై అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.