రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలి అంటున్న కవిత

కొన్ని నెలలుగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కే కవిత మహిళా రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, చర్చలు సజావుగా సాగేందుకు మరియు పార్లమెంటులో బిల్లును ఆమోదించడానికి.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత మంగళవారం జనసేన, టీడీపీ, వైఎస్సార్సీపీ తదితర 47 […]

Share:

కొన్ని నెలలుగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కే కవిత మహిళా రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, చర్చలు సజావుగా సాగేందుకు మరియు పార్లమెంటులో బిల్లును ఆమోదించడానికి.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత మంగళవారం జనసేన, టీడీపీ, వైఎస్సార్సీపీ తదితర 47 రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాశారు. 

అందరూ కలిసికట్టుగా పోరాడాలి అంటున్న కవిత: 

పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని ఎంతగానో కృషి చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి రానున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేందుకు ప్రాధాన్యతనివ్వాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తన లేఖలో పిలుపునిచ్చారు.

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు. లింగ సమానత్వం, సమాన పాలనకు కీలకమైన అడుగు అయినప్పటికీ, బిల్లు చాలా కాలం పాటు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. అయితే ఇప్పటికైనా, ప్రతి ఒక్క పార్టీ స్పందించి, తమదైన శైలిలో తమ బిల్లును ఆమోదించేలా తమ వైపు నుంచి కృషి చేయాలని, తమ సపోర్ట్ కావాలని కోరుతోంది కవిత.

కవిత తన లేఖలో, భారతీయ ప్రసంగంలో మహిళలు పోషించే కీలక పాత్రను గురించి, అదే విధంగా శాసనసభలో వారి ప్రాతినిధ్యం గురించిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎప్పటికీ ఆడవారి ప్రాముఖ్యతను చాటి చెప్పిన 14 లక్షల మంది మహిళల స్ఫూర్తితో, బిల్లు కోసం ముందడుగు వేస్తున్నట్లు ఆమె మరోసారి గుర్తు చేస్తుంది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత.

మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న బిఆర్ఎస్ పార్టీ: 

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, BRS తమ అభ్యర్థులను ఎన్నుకోవడంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను సోమవారం ప్రకటించడం జరిగింది. ఇంకో నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అభ్యర్థుల మొదట జాబితాలో పెద్దగా మార్పులు చేయలేనట్టు వెల్లడించింది. కేవలం ఏడు స్థానాల అభ్యర్థులకు సంబంధించిన మార్పు ప్రకటించింది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారు.

అభ్యర్థుల జాబితా ప్రకటన: 

అయితే నాగపంచమి తిది సందర్భంగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరిగిందని చెప్పుకోవాలి. 2009లో గెలుపొందిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వయంగా, కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించినట్లు కేసీఆర్ సోమవారం తెలిపారు. నిజామాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలు వచ్చాయని, అయితే చివరకు కామారెడ్డిని ఎంచుకున్నారని సీఎం చెప్పడం జరిగింది. అక్టోబర్ 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచామని, తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించి 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తుందని తమ వైపు నుంచి ధీమా వ్యక్తం చేశారు. తేదీలు ఇంకా ప్రకటించలేదు కానీ డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు ఎదుర్కొన్న చిక్కులను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో తమకు ఎలాంటి రాజకీయ సంక్షోభం రాకుండా చూసుకోవాలని కేసీఆర్ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా చేసిన అభ్యర్థనలు ఏవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా, పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని కేసీఆర్, అలాగే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.