పోక్సో నిందితుడికి విముక్తి

ఎంతో సంచలనం సృష్టించిన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోక్సో కేసులో నిందితుడిని నిర్దోషిగా రిలీజ్ చేస్తూ ఎల్ బీ నగర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు పోలీసుల మీద ఫైర్ అయింది. బాధితురాలి ఆధారాలు సమర్పించడంలో పోలీస్ డిపార్ట్ మెంట్ విఫలం అయిందని తెలిపింది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కేసులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది.  2018లో జరిగినా..  హైదరాబాద్ లో జరిగిన సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు మొదట […]

Share:

ఎంతో సంచలనం సృష్టించిన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోక్సో కేసులో నిందితుడిని నిర్దోషిగా రిలీజ్ చేస్తూ ఎల్ బీ నగర్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు పోలీసుల మీద ఫైర్ అయింది. బాధితురాలి ఆధారాలు సమర్పించడంలో పోలీస్ డిపార్ట్ మెంట్ విఫలం అయిందని తెలిపింది. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కేసులో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. 

2018లో జరిగినా.. 

హైదరాబాద్ లో జరిగిన సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు మొదట నిందితుడి మీద పోక్సో చట్టాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు ట్రయల్ లోనే ఉండగా.. తాజాగా ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. 

సాక్ష్యాలు సమర్పించడంలో.. 

ఇంత సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసులు కీలక సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైనట్లు కోర్టు అభిప్రాయ పడింది. అసలు బాలిక మైనర్ అని ప్రూవ్ చేసే ఆధారాలను కలెక్ట్ చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందని కోర్టు తెలిపింది. బాధితురాలు మైనర్ అని చూపేందుకు బాధితురాలి తల్లిదండ్రులను కూడా కోర్టు ముందు పరీక్షించాల్సి ఉండగా..పోలీస్ శాఖ అందులో విఫలం అయిందని తెలిపింది. దీంతో నిందితుడిని పోక్సో చట్టం కింద రిలీఫ్ అందజేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ అని చెప్పేందుకు ఏ సాక్ష్యం కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ కోర్టుకు సమర్పించలేదని తెలిపింది. 

అసలేం జరిగిందంటే.. 

2018లో ఆగస్టులో ఈ నేరం జరిగింది. ఇద్దరు వస్తు ఉండగా.. నిందితులు వారిని అడ్డగించి దుర్భాషలాడారు. దీంతో ఆమెతో ఉన్న స్నేహితుడు ఆమెను ప్రొటెక్ట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఆ నిందితులు అతడిని కూడా దుర్భాషలాడి.. అతడి చొక్కాను చించేశారు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. కోర్టు ఈ నేపథ్యంలో పోలీసులకు ఒక ప్రశ్నను సంధించింది. మీరు ఆ కుర్రాడి చిరిగిన చొక్కాను సేకరించడంలో ఎందుకు విఫలం అయ్యారని ప్రశ్నించింది. బాధితురాలి స్నేహితుడు కూడా నిందితులను గుర్తించాడు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటన బహిరంగ ప్రదేశంలో జరిగిందని.. పోలీసులు ఆ బాలిక స్నేహితుడిని తప్పా మరెవర్నీ విచారించలేదని కోర్టు తెలిపింది. 

అనుచిత మెసేజ్ లు పంపినా

ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు బాధితురాలికి అసభ్యకరమైన సందేశాలను పంపించాడు. నిందితుడు బాధితురాలి  సోదరుడి ఫోన్ కు మెసేజెస్ పంపించాడు. అయినా కానీ ఆ సందేశాలను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంలో పోలీస్ శాఖ విఫలం అయింది. దీంతో వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అన్నీ పరిశీలించిన కోర్టు.. 

ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ప్రొవైడ్ చేసిన ఆధారాలు మరియు మౌఖిక సందేశాలను మొత్తం విన్న కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలి మీద రేప్ జరిగినా కానీ పోలీస్ శాఖ సరైన సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో విఫలం కావడంతో ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.  ఒక మైనర్ బాలిక జీవితంతో ఆడుకున్న నిందితులను దోషులుగా ప్రూవ్ చేయడంలో పోలీస్ డిపార్ట్ మెంట్ విఫలం కావడం అందర్నీఆశ్చర్యానికి గురి చేసింది. ఇటువంటి కేసుల్లో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని పోలీసులకు తెలిసేలా ఈ కేసు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో సంచలన కేసులను చేధించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న పోలీస్ శాఖ ఈ కేసులో మాత్రం సాక్ష్యాలను ప్రొవైడ్ చేయడంలో విఫలం కావడం బాధాకరం.