ఏడు సంవత్సరాల క్రితం పోయిన చెప్పులు.. పోలీసులకు ఫిర్యాదు

పోలీసు వారు తమ కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది… అసలు ఏం జరిగిందో మీరే చూడండి. ఇది విషయం: మన్స్ ఆఫియా పోలీస్ స్టేషన్ లో ఏడు సంవత్సరాల క్రితం.. రాజస్థాన్లోని చిత్తూర్గారు డిస్ట్రిక్ట్ లో మహేంద్ర కుమార్ అనే వ్యక్తి తన చెప్పులు పోయినట్లు కంప్లైంట్ ఇచ్చాడు.. 2017లో మహేంద్ర కుమార్ ఒక గుడి […]

Share:

పోలీసు వారు తమ కర్తవ్యాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది… అసలు ఏం జరిగిందో మీరే చూడండి.

ఇది విషయం:

మన్స్ ఆఫియా పోలీస్ స్టేషన్ లో ఏడు సంవత్సరాల క్రితం.. రాజస్థాన్లోని చిత్తూర్గారు డిస్ట్రిక్ట్ లో మహేంద్ర కుమార్ అనే వ్యక్తి తన చెప్పులు పోయినట్లు కంప్లైంట్ ఇచ్చాడు.. 2017లో మహేంద్ర కుమార్ ఒక గుడి దగ్గర తన చెప్పులు పోగొట్టుకున్నట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే క్రమంలోనే ఏడు సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్ శివపురి ఊర్లో ఉన్న పోలీస్.. మహేంద్ర ని పోలీస్ స్టేషన్ కి వచ్చి.. షో వెతుక్కోమని పిలవడం జరిగింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ అసలు ఈ విషయాన్ని ఎలా స్పందించాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు

మహేంద్ర కుమార్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఏడు సంవత్సరాల క్రితం అంటే 2017లోని ఆర్యసేతు టెంపుల్ సందర్శించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆయన గుడి బయట వదిలిపెట్టిన షూ పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని స్టేషన్లో జనవరి 14 2017లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత షో గురించి అసలు ప్రస్తావనే లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే అందరూ మర్చిపోయి కూడా ఉంటారు. ఎందుకంటే కేసు ఫైల్ చేసి ఏడు సంవత్సరాల అయినప్పటికీ తనకి షూ మాత్రం దొరకలేదు. ఇటీవల పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది… అయితే తను పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నానని చెప్పి.. తాము ఒకప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసిన షూ దొరికిందని.. స్టేషన్ కి వచ్చి అవి గుర్తుపట్టాల్సి ఉంటుందని కబురు పెట్టాడు కానిస్టేబుల్.

అయితే ఇటీవల అదే ఊర్లో ఉంటున్న ఒక జడ్జి కొడుకు షూ కూడా అదే గుడిలో పోవడం జరిగింది. ఈ విషయాన్ని గురించి న్యూస్ పేపర్ లో రావడం చూసిన మహేంద్ర.. తన షూ కూడా పోయిందని, కానీ ఇప్పటివరకు తన షూ కనిపెట్టింది లేదు అంటూ.. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ.. పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ గురించి మరొకసారి గుర్తు చేశాడు. అయితే ఈ క్రమంలోనే మహేంద్ర కు పోలీస్ స్టేషన్ నుంచి షూ దొరికిందని.. ఒకసారి వచ్చి గుర్తుపట్టాల్సి ఉంటుందని కాల్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర పోలీస్ స్టేషన్ కు వెళ్లాలా లేదా అనే డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రితం పోయిన షూస్ విలువ కన్నా.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి రాను పోను ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా.

ఇలాంటి సంఘటనలు మరెన్నో:

ఒక్కసారి వస్తువు పోగొట్టుకుంటే అది మళ్ళీ మన చేతికి వచ్చేవరకు చెప్పలేము. అందుకే ఏ వస్తువు అయినా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలని సంగతి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా కావాలని దొంగలించిన వస్తువు, తిరిగి దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే.. ఏడు సంవత్సరాల క్రితం పోయిన షూ గురించి.. కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వెతకని పోలీసులు.. ఏకంగా జడ్జి కొడుకు షూ పోయిందని న్యూస్ పేపర్లో రావడంతో అలర్ట్ అవడం గమనార్హం. ఒక సాధారణ వ్యక్తి వస్తువు కంటే.. పై అధికారుల గురించి పని చేస్తున్నవారు ఎక్కువ అయ్యారని ఈ కేసు ద్వారా అర్థం చేసుకోవచ్చు.