సెమికాన్‌ను ప్రారంభించ‌నున్న‌ ప్ర‌ధాని మోదీ

భారతదేశం యొక్క సెమీకండక్టర్ సామర్థ్యాలు మరియు చిప్ డిజైన్ ఆవిష్కరణకు సంబంధించిన ప్రీమియర్ షోకేస్, జూలై 28 న గాంధీనగర్‌లో జరగబోతుంది. Foxconn, Micron, AMD, IBM, Marvell, Vedanta, LAM Research, NXP సెమీకండక్టర్స్, STMicroelectronics వంటి కంపెనీల భాగస్వామ్యంతో, ఈ మెగా ఈవెంట్ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ మరియు డిజైన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో భారతదేశం తోడ్పడుతుంది.  ఈ ఈవెంట్ లో చిప్-మేకింగ్‌ అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆవిష్కరణల పై లోతైన ఇన్సైట్ ని అందిస్తుంది […]

Share:

భారతదేశం యొక్క సెమీకండక్టర్ సామర్థ్యాలు మరియు చిప్ డిజైన్ ఆవిష్కరణకు సంబంధించిన ప్రీమియర్ షోకేస్, జూలై 28 న గాంధీనగర్‌లో జరగబోతుంది.

Foxconn, Micron, AMD, IBM, Marvell, Vedanta, LAM Research, NXP సెమీకండక్టర్స్, STMicroelectronics వంటి కంపెనీల భాగస్వామ్యంతో, ఈ మెగా ఈవెంట్ గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ మరియు డిజైన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో భారతదేశం తోడ్పడుతుంది. 

ఈ ఈవెంట్ లో చిప్-మేకింగ్‌ అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆవిష్కరణల పై లోతైన ఇన్సైట్ ని అందిస్తుంది . సెమీకండక్టర్ మరియు టెక్నాలజీ లో అతిపెద్ద పేరులున్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుంది.

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ…భారతదేశంలో సెమీకండక్టర్ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. గాంధీనగర్‌ లో  ‘సెమీకాన్ ఇండియా 2023’ ప్రారంభోత్సవం, 28 జూలై 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చేత ప్రారంభం కానుంది అని  ఒక ప్రకటన ప్రకారం తెలుస్తుంది. 

ప్రధాన కార్యక్రమం ప్రారంభానికి ముందు, ఒక ప్రత్యేక ప్రదర్శనను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ జూలై 25, 2023న ప్రారంభించనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమను నడిపించే ప్రముఖ సాంకేతికతలు మరియు ఆవిష్కరణల గురించి సందర్శకులకు సమగ్ర ఇన్సైట్  అందించడానికి ఈ ప్రదర్శన  జరగబోతుంది.

 ఔత్సాహిక విద్యార్థుల కోసం సెమీకండక్టర్ మరియు టెక్నాలజీ గురించి అవగాహనా కలిపిస్తుంది 

 ఈ ప్లాట్‌ఫారమ్ సెమీకండక్టర్ తయారీ గురించి లోతైన జ్ఞానాన్ని పొందేందుకు విలువైన అవకాశాన్ని అందిస్తుంది, ఈ రంగంలో రివార్డింగ్ కెరీర్‌కు మార్గాన్ని చూపిస్తుంది. 

సెమీకాన్ ఇండియా, ప్రతిష్టాత్మక జాతీయ-స్థాయి లో  ఈవెంట్…..

సెమీకాన్ ఇండియా, ప్రతిష్టాత్మక జాతీయ-స్థాయి ఈవెంట్, అమూల్యమైన నెట్‌వర్కింగ్, సాంకేతిక ప్రదర్శనలు మరియు లాభదాయకమైన వ్యాపార అవకాశాల ద్వారా సెమీకండక్టర్ పరిశ్రమ పురోగతి ఉంటుందని బలంగా హామీ ఇచ్చి  మరి చెప్తుంది . ఆవిష్కరణ, భాగస్వామ్యం మరియు వృద్ధి పై బలమైన దృష్టితో, భారతదేశం మరియు గుజరాత్ రెండింటిలోనూ సెమీకండక్టర్ పరిశ్రమ యొక్క భవిష్యత్తును రూపొందించడం లో ఈ ఈవెంట్ అద్భుతమైన  ప్రాముఖ్యతను కలిగి ఉండబోతుంది అని  ఒక  ప్రకటన పేర్కొంది.

సెమికాన్ ఇండియా 2023లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు మరియు కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా హాజరవుతారు.

పరిశ్రమ నాయకులు మరియు సెమీకండక్టర్ కంపెనీల అధిపతులు కూడా ఇందులో పాల్గొనుబోతున్నారు.

సెమీకండక్టర్ చిప్, డిస్ప్లే ఫ్యాబ్, చిప్ డిజైన్ మరియు అసెంబ్లింగ్‌లో గ్లోబల్ దిగ్గజాలు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలపై అందరి అభిప్రాయాన్ని పంచుకోవడానికి సమావేశమవుతారు.

గుజరాత్ ప్రభుత్వం సెమీకండక్టర్ పాలసీని (2022-2027) ఆవిష్కరించింది – దేశీయ సెమీకండక్టర్ చిప్ తయారీ రంగంలో వేగవంతమైన మరియు ఉపాధి అవకాశాలను,అభివృద్ధిని ప్రోత్సహహించడం లో ముందు ఉంటుంది.

కంప్యూటర్ స్టోరేజీ చిప్‌ల తయారీ సంస్థ మైక్రోన్ గుజరాత్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది, దీనితో మొత్తం USD 2.75 బిలియన్ల (సుమారు రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ఉంటుంది.

సెమీకాన్ ఇండియా, ప్రతిష్టాత్మక జాతీయ-స్థాయి ఈవెంట్ ఇందులో నెట్‌వర్కింగ్, సాంకేతిక ప్రదర్శనలు మరియు లాభదాయకమైన వ్యాపార అవకాశాల ద్వారా సెమీకండక్టర్ పరిశ్రమ పురోగతి బలంగా ఉండబోతుంది అని చూపించబోతున్నారు.గుజరాత్ ప్రభుత్వం సెమీకండక్టర్ పాలసీని  ఆవిష్కరించి – దేశీయ సెమీకండక్టర్ చిప్ తయారీ రంగంలో వేగవంతమైన మరియు ఉపాధి అవకాశాలను అందించాలి అని అనుకుంటున్నారు.