కేరళలో మెట్రో బోట్స్ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో బృహత్తర కార్యక్రమానికి ఒడిగట్టారు. కేరళలో ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న కొచ్చి వాటర్ మెట్రోని పూర్తి చేసి నేడు జాతికి అంకితం చేశారు. కొచ్చి వాటర్ మెట్రో కేవలం ఇండియాలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో కాదు,ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో. అది మన ఇండియాలోనే ప్రారంభం అవ్వడం మనకి గర్వకారణం. నీటి ట్రాన్స్‌పోర్ట్ రంగంలో మన భారత దేశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక మెట్టు పైకి […]

Share:

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో బృహత్తర కార్యక్రమానికి ఒడిగట్టారు. కేరళలో ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న కొచ్చి వాటర్ మెట్రోని పూర్తి చేసి నేడు జాతికి అంకితం చేశారు. కొచ్చి వాటర్ మెట్రో కేవలం ఇండియాలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో కాదు,ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో. అది మన ఇండియాలోనే ప్రారంభం అవ్వడం మనకి గర్వకారణం. నీటి ట్రాన్స్‌పోర్ట్ రంగంలో మన భారత దేశం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక మెట్టు పైకి ఎక్కేసినట్టే అనుకోవచ్చు.ప్రధాన మంత్రి మోడీ ఈమధ్యనే కేరళలో మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని తిరువనందపురం రైల్వే స్టేషన్ లో ప్రారంభించాడు. అంతే కాదు, నేడు ఆయన కేరళలో 3200 కోట్ల రూపాయిల విలువ గల ప్రాజెక్ట్స్ కి శంకుస్థాపన చేశాడు. ఇది ఇలా ఉండగా కొచ్చి వాటర్ మెట్రో గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఈ కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ని పూర్తి చెయ్యడానికి అక్షరాలా 1136 కోట్లు ఖర్చు అయ్యిందట, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ ప్రాజెక్ట్ కార్యకలాపాలను పర్యవేక్షించి పూర్తి చేయించాడట. ఈ ప్రాజెక్ట్‌కి ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా, కేరళ ప్రభుత్వం నుండి వచ్చాయి.అలా రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం వల్లే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది. ముందుగా మొదటి ఫేస్‌లో హై కోర్ట్ నుండి వైపిన్ వరకు, మరియు వైటిల్లా నుండి కక్కనాడ్ వరకు ఈ వాటర్ మెట్రో సర్వీసులను అందించనున్నారు.ఈ మెట్రో సర్వీస్ ద్వారా హై కోర్ట్ నుండి వైపిన్ వరకు కేవలం 20 నిమిషాలలో వెళ్లిపోవచ్చు. అలాగే వైటిల్లా నుండి కక్కనాడ్ ప్రాంతానికి కేవలం 25 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఇక ఈ మెట్రో సర్వీస్‌కి టికెట్ ధర కేవలం 20 రూపాయిలు మాత్రమే. 

అంతే కాదు, ఈ మెట్రో సర్వీసెస్‌లో పాసులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్యాసెంజర్స్ వారం, నెల మరియు సంవత్సరానికి తగ్గట్టుగా పాసులు తీసుకోవచ్చు.ఇక ఈ మెట్రో టికెట్స్ డిజిటల్‌గా కూడా అందుబాటులో ఉంటాయి. కొచ్చి వన్ యాప్ ద్వారా టికెట్స్‌ని ఆన్లైన్‌లో విక్రయించవచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రతీ రోజు 78 బోట్స్ 38 టెర్మినల్స్ మధ్య, అలాగే 10 ఐలాండ్స్ మధ్య పర్యటించనున్నాయట. ఈ బోట్స్‌ని అల్లుమ్యునియం కాటమరాన్ హుల్స్‌తో తయారు చేయబడినది అట. ఈ బోట్స్ అన్నీ కూడా లిథినియం బ్యాటరీస్‌తో అమర్చబడినది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ, ఈ మెట్రో బోట్స్ వాళ్ళ నీటిలో 44 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ప్రతీ ఏడాది తగ్గుతుందని ఈ మెట్రో బోట్స్ కేవలం కేరళకి మాత్రమే పరిమితం కాదని, ఇండియాలో ఉన్న 40 సిటీస్‌లో త్వరలోనే అందుబాటులోకి రానుంది అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మెట్రో బోట్స్ ని మన దేశంలోని కేరళలో ప్రారంభం కావడం మన దేశానికే కూడా గర్వకారణం. ఈ మధ్య మనదేశంలో ఇలా ఊహించని అభివృద్ధి ఎన్నో రకాలుగా ఆశ్చర్యపరుస్తోంది.