మోదీకి రాఖీ క‌ట్టేందుకు వ‌స్తున్న పాకిస్తానీ చెల్లి

రాఖీ పండుగ నాడు అక్క, చెల్లి తమ అన్నదమ్ములకు పవిత్రమైన రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటిచెబుతూ ఉంటారు. రక్షాబంధన్ అంటేనే, తమ అక్క చెల్లెళ్లకు రక్షగా తమ అన్నదమ్ములు ఎన్నటికీ బాధ్యతతో ఉంటారని హామీ ఇస్తున్నట్టు. ఇప్పుడు జరగబోయే రక్షాబంధన్ పండుగలో నరేంద్ర మోదీకి రాఖీ కట్టబోతోంది, మోదీ పాకిస్తానీ చెల్లి.  అన్నా చెల్లెమ్మ అనుబంధం:  భారత దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అభిమానం అందరికీ తెలుసు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఇతర దేశాల […]

Share:

రాఖీ పండుగ నాడు అక్క, చెల్లి తమ అన్నదమ్ములకు పవిత్రమైన రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటిచెబుతూ ఉంటారు. రక్షాబంధన్ అంటేనే, తమ అక్క చెల్లెళ్లకు రక్షగా తమ అన్నదమ్ములు ఎన్నటికీ బాధ్యతతో ఉంటారని హామీ ఇస్తున్నట్టు. ఇప్పుడు జరగబోయే రక్షాబంధన్ పండుగలో నరేంద్ర మోదీకి రాఖీ కట్టబోతోంది, మోదీ పాకిస్తానీ చెల్లి. 

అన్నా చెల్లెమ్మ అనుబంధం: 

భారత దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న అభిమానం అందరికీ తెలుసు. ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఇతర దేశాల స్నేహ బంధాలు ఎక్కువ. ఈ క్రమంలోనే మోదీ చెల్లెలుగా భావించే, పాకిస్తాన్ కి చెందిన ఖమర్ మొహ్సిన్ షేక్, ఈ రాఖీ పండుగ నాడు ఢిల్లీలో ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనుంది. అంతేకాకుండా తన అన్నాచెల్లెళ్ల బంధానికి గుర్తుగా రాఖీ కట్టనుంది. గత 30 ఏళ్లుగా షేక్ ప్రతి సంవత్సరం మోదీకి రాఖీ కడుతూనే ఉన్నారు. 

ఖమర్ మొహ్సిన్ షేక్ ఎవరు?: 

పాకిస్తాన్ కి చెందిన ఖమర్ మొహ్సిన్ షేక్, పెళ్లి తర్వాత అహ్మదాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆమె 30 సంవత్సరాలుగా తనకి ఎంతగానో ఆప్తుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒక అన్నయ్యగా భావించి ఆమె ప్రతిఏటా రాఖి కట్టడం ఆనవాయితీగా చేసుకుంది. అంతేకాకుండా ఆమె మోదీ తెలిసినప్పటి నుంచి, మోదీని ఒక ప్రధానమంత్రిగా చూడాలని ఎంతగానో ఆశ పడినట్లు కూడా చెప్పింది. గత రెండు సంవత్సరాలుగా నరేంద్ర మోదీని కలవలేకపోయాను అని, మహమ్మారి కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా తన అన్నని కలుసుకోలేకపోయానని, ఈ సంవత్సరం తప్పకుండా ఢిల్లీకి వెళ్లి తన అన్న చేతికి రాఖీ కట్టనున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. 

నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ వర్కర్ గా ఉన్నప్పటి నుంచి తనకి తెలుసని, మొదటిగా తన అన్నతో రాఖీ పండుగ జరుపుకున్నది అప్పుడే అని చెప్పుకొచ్చింది ఖమర్ మొహ్సిన్ షేక్. ఆమె ఎప్పుడూ కూడా తన అన్న కోసం ప్రార్థనలు చేస్తూనే ఉంటుందని, ముఖ్యంగా మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలి అనుకున్నప్పుడు, తన అన్న ముఖ్యమంత్రి అయ్యాడని తరువాత తాను కోరుకున్నట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవ్వడం నిజంగా తనకి సంతోషాన్ని తెచ్చి పెట్టాయని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది ఖమర్ మొహ్సిన్ షేక్. 

ఆమె ప్రతి ఏటా కూడా ఇలాగే తన అన్నతో రాఖీ పండుగ జరుపుకుంటానని చెప్తోంది. తన అన్న మంచితనం వల్లే తాను అంచులంచెలుగా ఎదుగుతున్నాడని ప్రస్తావించింది. ఖమర్ మొహ్సిన్ షేక్, ఎప్పటికీ కూడా తన అన్న మంచినే కోరుకుంటారని, ఎప్పటికీ బంధం ఇలాగే ఉంటుందని మరోసారి గుర్తు చేసుకుంది. 2023 ఆగస్టు 30న భారతదేశం అంతటా రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది అక్క చెల్లెలు తమను ఎంతో ప్రేమించే అన్నదమ్ములకు రాఖీ కడుతుంటారు. ఇది ఒక ప్రత్యేకమైన బంధాన్ని గుర్తుచేసే పండుగ. ఈ పండుగనాడు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంత దూరంలో ఉన్నప్పటికీ, రాఖీ పండుగ జరుపుకోవడానికి సంతోషకరంగా కలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా, ఖమర్ మొహ్సిన్ షేక్ కూడా తన అన్న చెల్లెల బంధానికి గుర్తుగా ఆమె ఎంత దూరంలో ఉన్నప్పటికీ నరేంద్ర మోదీకి ప్రతి యేట రాఖీ పంపించడం మాత్రం మర్చిపోదంట. మోదీ కూడా తన చెల్లి కోసం రక్షాబంధన్ నాడు ఎదురుచూస్తూ ఉంటాడు అంట. ఇలా ప్రతి రక్షాబంధన్ సందర్భంగా 30 సంవత్సరాలుగా తమ అన్న చెల్లెల బంధానికి గాను కొన్ని విలువైన జ్ఞాపకాలు తాను ఎప్పుడూ కూడా మర్చిపోలేను అని చెప్తోంది ఖమర్ మొహ్సిన్ షేక్.