చంద్రయాన్-3 శాస్త్రవేత్తలను కలవనున్న మోదీ

రెండు దేశాల పర్యటనను ముగించుకున్న అనంతరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు బెంగళూరు, కర్ణాటకలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇస్రో గొప్ప చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న విజయవంతమైన శాస్త్రవేత్తలను కలిసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని ఎంతో గర్వించదగ్గ సంతోషంలో ముంచేత్తిన శాస్త్రవేత్తల విజయాన్ని మరోసారి నేరుగా ప్రశంసించడానికి ప్రయాణమయ్యారు మోదీ.  బ్రిక్స్ సమావేశంలో భారతదేశ ఘనత గురించి మాట్లాడిన మోదీ:  ఆగస్టు 23 సాయంత్రం 6 గంటలకు చంద్రుడు సౌత్ పోల్ పైన […]

Share:

రెండు దేశాల పర్యటనను ముగించుకున్న అనంతరం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు బెంగళూరు, కర్ణాటకలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇస్రో గొప్ప చంద్రయాన్-3 మిషన్ వెనుక ఉన్న విజయవంతమైన శాస్త్రవేత్తలను కలిసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని ఎంతో గర్వించదగ్గ సంతోషంలో ముంచేత్తిన శాస్త్రవేత్తల విజయాన్ని మరోసారి నేరుగా ప్రశంసించడానికి ప్రయాణమయ్యారు మోదీ. 

బ్రిక్స్ సమావేశంలో భారతదేశ ఘనత గురించి మాట్లాడిన మోదీ: 

ఆగస్టు 23 సాయంత్రం 6 గంటలకు చంద్రుడు సౌత్ పోల్ పైన అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం భారతదేశం అంటూ, ఈ మిషన్ లో తమదైన కృషిని చూపించిన శాస్త్రవేత్తలకు అభినందనలు కూడా తెలిపారు. తమ దేశం ఎవరు సాధించలేని ఘనతను సాధించి చూపించారని, ఇలాంటి మరెన్నో ప్రయోగాలు భారతదేశ నుంచి జరుగుతాయని వెల్లడించారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు బ్రిక్స్ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకున్నారు మోది. 

జోహన్నెస్‌బర్గ్‌లోని శాండ్‌టన్ కన్వెన్షన్ సెంటర్లో 2023 బ్రిక్స్ సబ్మిట్ గాను ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బ్రిక్స్ లో ఇప్పటికే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు మెంబర్స్ గా ఉండగా, ఈ సంవత్సరం మరో ఆరు దేశాలు బ్రిక్స్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. 

ఇరాన్ ,సౌదీ అరేబియా, ఇథియోపియా, యూఏఈ, అర్జెంటుగా, ఈజిప్ట్, ఈ ఆరు దేశాలు సభ్యత్వం తీసుకుంటున్నట్లు, బ్రిక్స్ సమీట్లో మాట్లాడిన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆరు దేశాల పేర్లను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే 2024, జనవరి 1 నుంచి ఈ దేశాలు బ్రిక్స్ లో పాలుపంచుకొని, తమ కార్యకలాపాలను మొదలు పెట్టనున్నట్లు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ వెల్లడించారు. నరేంద్ర మోదీ సమ్మేట్ గురించి మాట్లాడుతూ బ్రిక్స్ లో మరిన్ని దేశాలు కలవడం అనేది సంతోషకరంగా ఉందని ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన బలగం ఏర్పడుతున్నందుకు ఆనందిస్తున్నట్లు వెల్లడించారు. 

చంద్రయాన్-3: 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ 900 కోట్లు , మరి ఇప్పుడు విజయవంతంగా చంద్రుడు మీద అడుగుపెట్టిన చంద్రయాన్-3 బడ్జెట్ 600 కోట్లు.

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి చెప్పిన విధంగానే ఇప్పుడు ఇస్రో సాధించి చూపించింది. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉండడం వల్ల మిషన్ విజయవంతమైంది.  

భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పట్టింది. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టింది. అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేయడం స్టార్ట్ అయింది. 14 రోజులు అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద కొన్ని విశేషాలను సేకరిస్తారు.