పోర్ట్ బ్లేర్ కొత్త టర్మినల్ ప్రారంభించిన‌ మోదీ 

పోర్ట్ బ్లేర్లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభించనున్నారు. ఇనోగ్రేషన్ కార్యక్రమం మొత్తం కూడా వర్చువల్ గానే జరుగుతుంది. అండమాన్కు కొత్త ఆదాయవనరు:  దాదాపు 710 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం నేడు జరగబోతోంది. అయితే ఇది అండమాన్ […]

Share:

పోర్ట్ బ్లేర్లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభించనున్నారు. ఇనోగ్రేషన్ కార్యక్రమం మొత్తం కూడా వర్చువల్ గానే జరుగుతుంది.

అండమాన్కు కొత్త ఆదాయవనరు: 

దాదాపు 710 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం నేడు జరగబోతోంది. అయితే ఇది అండమాన్ మరియు నికోబార్ కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించడంలో సహాయపడుతుంది. అండమాన్ అందాలను చూసేందుకు ఎంతోమంది ప్రతి ఏటా అండమాన్ సందర్శిస్తూ ఉంటారు. కొత్త టర్మినల్ తప్పకుండా మరో కొత్త ఆదాయ వనరుగా మారనుంది. అంతేకాకుండా ప్రయాణికులకు కూడా చాలా ఈజీ బోర్డింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది.

పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అండమాన్ మరియు నికోబార్ దీవులకు సులభంగా ప్రయాణాన్ని తప్పకుండా కల్పిస్తుంది అని, ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి ఇది పెద్ద ఊపునిస్తుందని ఆయన అన్నారు. దాదాపు 40,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, కొత్త టెర్మినల్ భవనం ఏటా 50 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు.

ప్రస్తుతం, వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ మరియు విశాఖపట్నంలతో కనెక్టివిటీని కలిగి ఉంది, అయితే రాబోయే కాలంలో మరింత విస్తరిస్తుంది. అండమాన్ & నికోబార్ దీవులు భారతదేశ ప్రాచీన చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాకుండా పర్యటకులకు సేద తీరేందుకు అనువైన ప్రదేశం కూడా. 

పోర్ట్ బ్లెయిర్‌ కొత్త టర్మినల్ విశేషాలు: 

80 కోట్లతో రెండు బోయింగ్-767-400 మరియు రెండు ఎయిర్‌బస్-321 రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనువైన ఆప్రాన్‌ను కూడా విమానాశ్రయంలో నిర్మించారు, దీనితో విమానాశ్రయం ఇప్పుడు ఒకేసారి పది విమానాలు పార్కింగ్ చేయడానికి అనుకూలంగా మారింది.

విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణ రూపకల్పన నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. టర్మినల్ చూడ్డానికి సముద్రం మరియు ద్వీపాలను వర్ణించే షెల్ ఆకారం పోలి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్‌లో ఉష్ణాన్ని తగ్గించడానికి డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, భవనం లోపల నార్మల్ పవర్ లైట్ వినియోగాన్ని తగ్గించడానికి, పగటిపూట ఎక్కువగా సన్ లైట్ ఉపయోగించి గరిష్ట ఇన్‌లెట్‌ను అందించడానికి స్కైలైట్‌లు, LED లైటింగ్, తక్కువ హీట్ గెయిన్ గ్లేజింగ్ వంటి అనేక కొత్త టెక్నాలజీలను ఈ ఎయిర్ పోర్ట్ టర్మినల్లో మనం చూడొచ్చు.

అంతేకాకుండా వర్షం నీటిని వృధా కానివ్వకుండా, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 శాతం ప్యూరిఫికేషన్ చేసిన మురుగునీటిని ల్యాండ్‌స్కేపింగ్ కోసం తిరిగి ఉపయోగించిన ఆన్-సైట్ sewage treatment plan ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా 500 KW కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్ టెర్మినల్ బిల్డింగ్‌లోని కొన్ని ఆకర్షణగా నిలుస్తాయి. 

అండమాన్ మరియు నికోబార్కు పోర్ట్ బ్లేయర్ అనేది నిజానికి స్వాగతం పలికే ఒక ద్వారంలా కనిపిస్తుంది. పోర్ట్ బ్లెయిర్ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. విశాలమైన టెర్మినల్ భవనం, ఇప్పుడు మరింత ఎయిర్లైన్ ట్రాఫిక్‌ను పెంచుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత రద్దీగా మారుస్తుంది. ఇది స్థానిక కమ్యూనిటీకి మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, అంతేకాకుండా ఇప్పుడు ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు సహాయకరంగా కూడా మారుతుంది.