5 గంటల్లోనే అజ్మీర్-ఢిల్లీ: వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని

ఇక ప్రధాని మోదీ అజ్మీర్ నుండి ఢిల్లీ రూట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన  వందే భారత్ రైలులో బయలుదేరారు. కేవలం 5 గంటలలోనే అజ్మీర్ నుండి ఢిల్లీకి చేరుకోవచ్చు. ముఖ్యమైన రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజ్మీర్ – ఢిల్లీ, ఢిల్లీ – అజ్మీర్.. కొత్త వందే భారత్ రైలు యొక్క రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభ కానుంది. జైపూర్, అల్వార్ మరియు గుర్గావ్‌లలో స్టాప్‌లలో ఈ ట్రైన్ ఆగనుంది. […]

Share:

ఇక ప్రధాని మోదీ అజ్మీర్ నుండి ఢిల్లీ రూట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన  వందే భారత్ రైలులో బయలుదేరారు. కేవలం 5 గంటలలోనే అజ్మీర్ నుండి ఢిల్లీకి చేరుకోవచ్చు.

ముఖ్యమైన రూట్లలో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజ్మీర్ – ఢిల్లీ, ఢిల్లీ – అజ్మీర్.. కొత్త వందే భారత్ రైలు యొక్క రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభ కానుంది. జైపూర్, అల్వార్ మరియు గుర్గావ్‌లలో స్టాప్‌లలో ఈ ట్రైన్ ఆగనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్‌లో తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, దేశంలో 15వ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ “ఇండియా ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్” స్ఫూర్తిని సుసంపన్నం చేస్తుందని అన్నారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్ పర్యాటక రంగానికి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు.

“కాగా.. గత రెండు నెలల్లో ప్రధాని మోదీ ఆరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించడం విశేషం.

గతంలో రైల్వేల ఆధునీకరణను “స్వార్థ మరియు నీచ రాజకీయాలు” అడ్డుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

దురదృష్టవశాత్తూ, స్వార్థపూరితమైన మరియు నీచమైన రాజకీయాల వల్ల  రైల్వేల ఆధునీకరణ జరగలేదని అన్నారు. పెద్ద ఎత్తున జరిగిన అవినీతి వల్ల రైల్వేలో అభివృద్ధి జరగకుండా ఆగిపోయిందని, రైల్వేల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని మోదీ పేర్కొన్నారు.

ఇక ఈ కొత్త వందే భారత్ రైలు యొక్క రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభం కానుందన్న మోదీ.. జైపూర్, అల్వార్, గుర్గావ్‌లలో స్టాప్‌లతో అజ్మీర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్‌ల మధ్య నడుస్తుందని పేర్కొన్నారు.

ఇది ఢిల్లీ కంటోన్మెంట్ మరియు అజ్మీర్‌ల మధ్య దూరాన్ని కేవలం 5 గంటల 15 నిమిషాల్లో కవర్ చేస్తుందని మోదీ తెలిపారు.

అయితే అజ్మీర్- ఢిల్లీ కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ (OHE) భూభాగంలో ప్రపంచంలోనే మొదటి సెమీ హైస్పీడ్ ప్యాసింజర్ రైలు అవుతుందని మోదీ వివరించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దీనిని గతంలో ట్రైన్ 18 అని పిలిచేవారు. ఇది భారతీయ రైల్వేలు నిర్వహించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు. టెస్టింగ్ సమయంలో రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల (గంటకు 110 మైళ్ళ) వేగంతో ప్రయాణిస్తుంది. రైల్వే ట్రాక్ వేగం, సామర్థ్యం మరియు ట్రాఫిక్ పరిమితుల కారణంగా, రైలు నిర్వహణ వేగం ఢిల్లీ- భోపాల్ మార్గంలో  గంటకు 160 కిలోమీటర్లు (గంటకు 99 మైళ్ళు) మరియు ఇతర మార్గాలలో గంటకు 110–130 కిలోమీటర్లకి (గంటకు 68-81 మైళ్ళు) పరిమితం చేయబడింది. 

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను RDSO రూపొందించింది. ఇది చెన్నైలోని ICF చేత తయారు చేయబడింది. డిజైన్ మరియు స్పెసిఫికేషన్‌లు RDSO ద్వారా ప్రమాణీకరించబడ్డాయి. ఈ రైలు తక్కువ ధర మరియు యాక్టివిటీ  ఆప్టిమైజేషన్‌తో తయారు చేయబడింది. ఈ రైలులో 16 కోచ్‌లున్నాయి. దీనిని తయారు చేయడానికి సుమారు 14 మిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. ఇక 8 కోచ్‌ల మినీ వందే భారత్ రైలును తయారు చేయడానికి సుమారు 8.8 మిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. 

జనవరి 27, 2019 న, ట్రైన్ 18 పేరును వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ వందే భారత్ రైలు ఫిబ్రవరి 15, 2019 న సేవలను ప్రారంభించింది.