విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ..

విపత్తులు సంభవించినప్పుడు అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.   విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ) పై 5వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు..  విపత్తులను తట్టుకోగలిగే మౌలిక సహదుపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మోదీ పునరుద్ఘాటించారు. రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైన అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. ప్రకృతి […]

Share:

విపత్తులు సంభవించినప్పుడు అన్ని దేశాలూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.  

విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సిడిఆర్ఐ) పై 5వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు..  విపత్తులను తట్టుకోగలిగే మౌలిక సహదుపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మోదీ పునరుద్ఘాటించారు. రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమైనవో డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైన అంటూ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. ప్రకృతి వైపరీత్యాలను, వాటిని ఎలా సక్రమంగా నిర్వహించవచ్చు అనే విషయాల గురించి ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.. 

ప్రతిస్పందన ఒంటరిగా కాకుండా సమైక్యంగా ఉండాలి..

ఈ ప్రపంచంలో విపత్తుల ప్రభావం కేవలం స్థానికంగా ఉండదనే ప్రపంచ భావన నుండి సిడిఆర్ఐ ఉద్భవించిందని ప్రధాని మోదీ అన్నారు. అందువలన మన ప్రతిస్పందన ఒంటరిగా కాకుండా సమైక్యంగా ఉండాలని ఆయన సూచించారు. కేవలం అతి తక్కువ సంవత్సరాలలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న 42 కి పైగా దేశాలు, పెద్ద చిన్న అనే తేడాలు లేకుండా సిడిఆర్ఐలో భాగమయ్యామని ఆయన తెలిపారు. ప్రభుత్వాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగాలు కూడా విపత్తులను తట్టుకునే సమ్మిళితమైన మౌలిక సదుపాయాలను అందించడం అనేది ఈ ఏడాది ప్రధాన అంశంగా చెప్పవచ్చని ఆయన తెలిపారు. 

 ఈ నేపథ్యంలో విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలకు సంబంధించిన కోసం చర్చకు సంబంధించిన కొన్ని ప్రాధాన్యతలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. మౌలిక సదుపాయాలు కేవలం రాబడికి సంబంధించినవి మాత్రమే కాకుండా.. వాటిని చేరుకోవడం, స్థితిస్థాపకత కూడా అని తెలిపారు. అదేవిధంగా ఈ మౌలిక సదుపాయాలు, రవాణా ఎంత ముఖ్యమో సామాజిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమైనవి.  అందువలన మౌలిక సదుపాయాలపై సమగ్ర దృక్పథం అవసరమని ప్రధానమంత్రి మోదీ నొక్కి వక్కాణించారు. తత్వ రూపశమనంతో పాటు సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని పునరుద్ఘాటించారు.  విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడంలో స్థానిక పరిజ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి అని నరేంద్ర మోదీ అందరికీ గుర్తు చేశారు.

ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిడెన్స్ ఆక్సిలరేటర్ ఫండ్..

పరిస్థితులను చక్కదిద్దడానికి స్థానిక దృక్పథంతో కూడిన ఆధునిక సాంకేతికత చాలా అవసరమని ఆయన అన్నారు. ఆ విధంగా ఈ విషయాలు చక్కగా నమోదు చేయడంపై సిడిఆర్ఐకి చెందిన కొన్ని కార్యక్రమాల సమగ్ర ఉద్దేశాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.  ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫర్ ప్రెసిడెంట్ ఐలాండ్ స్టేట్స్ చేపట్టిన కార్యక్రమాలు ఐ.ఆర్.ఐ.ఎస్ ద్వారా ప్రయోజనం పొందిన పలు దేశాల గురించి ఆయన ప్రస్తావించారు. గత ఏడాది ప్రకటించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిడెన్స్ ఆక్సిలరేటర్ ఫండ్ గురించి కూడా ఆయన మరోసారి వివరించారు. భారతదేశపు జి20 ప్రెసిడెంట్ గురించి ప్రధానమంత్రి తెలుపుతూ సిడిఆర్ఐని అనేక కార్యనిర్వాహక బృందాల్లో చేరినట్లు తెలిపారు. మీరు ఇక్కడ అన్వేషించే పరిష్కార మార్గాలు ప్రపంచ విధాన రూపకల్పనలో అత్యున్నత స్థాయిలో విధాన రూపకర్తల దృష్టిని ఆకర్షిస్తాయని ఆయన చెప్పారు.

ఇటీవల టర్కీ,  సిరియాలలో సంభవించిన భూకంపాల వంటి విపత్తుల స్థాయి యొక్క తీవ్రత గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ సిడిఆర్ఐ పనితీరు గురించి, దాని ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించి చెప్పారు. ఇందులో సిడిఆర్ఐ కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ఇందులో పాలుపంచుకున్న ప్రభుత్వాలు మాత్రమే కాదు. ప్రపంచ సంస్థలు ప్రైవేట్ రంగాలు కలిసి ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.  విపత్తుల ప్రభావం స్థానికంగా ఉండదు. కాబట్టి మన స్పందన ఒంటరిగా కాకుండా సమగ్రంగా ఐక్యంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు.