ఇస్రోను అభినందించిన ప్రధాని మోదీ

చంద్రయాన్, చంద్రయాన్.. చంద్రయాన్ కొద్ది రోజుల నుంచి ఇండియా మొత్తం ఇస్రో జపం చేస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇస్రో సాధించిన ఘనత చిన్నదేం కాదు. ఇప్పటి వరకు ఏ పెద్ద దేశాలకు సాధ్యం కాని ఫీట్ ను ఇస్రో చేసి చూపెట్టింది. మేమే ప్రపంచాన్ని ఏలుతున్నామన్న భావన ఉన్న దేశాలకు స్వీట్ వార్నింగ్ పంపింది. రేసులో మేము కూడా ఉన్నామని చెప్పకనే చెప్పింది. ఇస్రో సాధించిన విజయంతో ప్రపంచదేశాలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. రష్యా […]

Share:

చంద్రయాన్, చంద్రయాన్.. చంద్రయాన్ కొద్ది రోజుల నుంచి ఇండియా మొత్తం ఇస్రో జపం చేస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇస్రో సాధించిన ఘనత చిన్నదేం కాదు. ఇప్పటి వరకు ఏ పెద్ద దేశాలకు సాధ్యం కాని ఫీట్ ను ఇస్రో చేసి చూపెట్టింది. మేమే ప్రపంచాన్ని ఏలుతున్నామన్న భావన ఉన్న దేశాలకు స్వీట్ వార్నింగ్ పంపింది. రేసులో మేము కూడా ఉన్నామని చెప్పకనే చెప్పింది. ఇస్రో సాధించిన విజయంతో ప్రపంచదేశాలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. రష్యా మనతో పాటే పంపించిన లూనా-25 మిషన్ క్రాష్ అయింది. దీంతో ఇస్రో ప్రొడక్ట్ మీద అందరి దృష్టి పడింది. కానీ లాస్ట్ టైమ్  ఇస్రో ఫెయిల్ అయినా కానీ ఈ సారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. జాబిలమ్మ దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ను నిలపడంలో ఇస్రో కీలక భూమిక పోషించింది. 

దేశంలో లేని ప్రధాని

ఇస్రో ఇంతటి ఘనత సాధించినపుడు దేశ ప్రధాని మోదీ దేశంలో లేడు. ఆయన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్నారు. మోదీ బయట దేశంలో ఉన్నా కానీ ఆయన మనసు మొత్తం ఇక్కడే ఉంది. ఇస్రో పంపిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవుతుందా? లేదా? అని సాధారణ భారతీయులు ఎంత టెన్షన్ తో ఎదురు చూశారో మోదీ కూడా అలాగే ఎదురు చూశారు. మిషన్ సక్సెస్ అయిందనే వార్త తెలియగానే వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి అభినందించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుంటానా అని ఆయన ఎదురు చూశారు. ఆయన పర్యటనలు అయిపోగానే ముందుకు ఢిల్లీకి వెళ్లకుండా నేరుగా బెంగళూరుకు వచ్చి ఇస్రో శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. 

నేరుగా ఇక్కడికే

అధికారిక పర్యటనలు ముగిసిన తర్వాత మోదీ ఢిల్లీకి వెళ్లాలి. కానీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడం కోసం మోదీ నేరుగా బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరులోని ఇస్రో హెడ్ కార్డర్స్ లో ఆయన చంద్రయాన్-3 మిషన్ కోసం పని చేసిన శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మిషన్ గురించిన అన్ని వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. 

ఆ ప్రాంతానికి కొత్త పేరు పెట్టిన మోదీ

జాబిల్లి మీద రోవర్ దిగిన ప్రాంతానికి ప్రధాని మోదీ కొత్త పేరును పెట్టారు. చంద్రుని ల్యాండర్ తాకిన ప్రాంతానికి ‘శివశక్తి’ పాయింట్‌గా పేరు పెట్టారు. చంద్రయాన్-3 మిషన్ విజయం యావత్ దేశానికి స్ఫూర్తిదాయకం. ఎంతో గర్వంతో కూడిన విజయమని తెలిపారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) నమస్కారం చేయాలనుకుంటున్నానని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. అంతే కాకుండా మీ ధైర్యానికి, కృషికి, అంకితభావానికి మరియు పట్టుదలకు వందనం అని ఆయన పేర్కొన్నారు.

జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రకటన… 

చంద్రయాన్-3 అనేది కోట్లాది మంది ఇండియన్ల కల. ఈ మిషన్ సక్సెస్ కాగానే ఇస్రో సైంటిస్టులు ఎంతలా సంబరాలు చేసుకున్నారో.. యావత్ దేశం అంతకంటే ఎక్కువగా సంబరాలు చేసుకుంది. అంతే కాకుండా ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ రోజు చాలా మంది వాట్సాప్ స్టేటస్ లలో ఇస్రో విజయాన్ని అభినందిస్తూ కంగ్రాట్స్ చెప్పే ఫొటోలే దర్శనం ఇచ్చాయి. దీంతో ప్రధాని మోదీ కూడా ఇస్రో విజయం మీద కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన ఆగస్టు 23ని ఇప్పుడు “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా జరుపుకుందామని మోదీ ప్రకటించారు. చంద్రునిపై మన జాతీయ జెండాను ఎగురవేసినందుకు గుర్తుగా ఇది జరుపుకోవాలని తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-02 మిషన్ విఫలమైన విషయాన్ని గుర్తుచేస్తూ, చంద్రయాన్-2 మిషన్ చంద్రునిపై పాదముద్ర వేసిన ప్రదేశాన్ని త్రిరంగ (త్రివర్ణ) అని పిలుస్తామని మోదీ చెప్పారు. 

పేరు ప్రకటించగానే.. 

చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ శివశక్తి పాయింట్ అనే పేరును ప్రకటించారు. ఈ పేరును ప్రకటించగానే టీవీలు చూస్తున్న ప్రేక్షకులతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ‘శివ’ స్ఫూర్తికి మూలం అని కొనియాడుతున్నారు. అంతే కాకుండా ’శక్తి‘ అనే పేరు కూడా శక్తినిస్తుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ఏ వైఫల్యం శాశ్వతం కాదని ఇది మనకు నేర్పుతుందని తెలిపారు. దృఢమైన మనస్సుతో, ఏదైనా విజయాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. 

అవి చూడడం అద్భుతంగా ఉంది

చంద్రయాన్-3 మిషన్ ప్రతి రోజు చంద్రుడి మీద తీసిన ఫొటోలను పంపుతుంది. కాగా ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫొటోల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చంద్రుని చిత్రాలను చూడటం చాలా అద్భుతంగా ఉంది. భారతీయ శాస్త్రవేత్తల కృషి వల్ల మానవాళికి చంద్రుని చిత్రాలు కనిపించడం ఇదే మొదటిసారని కొనియాడారు. చంద్రయాన్-3 సక్సెస్ కేవలం ఇండియన్స్ కు మాత్రమే కాకుండా జాబిల్లి మీద ప్రయోగాలు చేయాలని అనుకుంటున్న అందరికీ స్ఫూర్తి దాయకమని తెలిపారు.