ఆకాశంలో విమానం.. కుప్పకూలిన పైలట్

271 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. బయల్దేరి అప్పటికే 3 గంటలు దాటింది.. భూమ్యాకాశాలకు మధ్యలో.. తన గమ్యం వైపు వేగంగా దూసుకుపోతోంది.. కానీ ఉన్నట్టుండి విమానంలో కలకలం రేగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన పైలట్‌.. కొద్దిసేపటి తర్వాత తన సీట్లో కనిపించలేదు.. బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. స్పృహలోలేడు.. తర్వాత ఏం జరిగింది? ఆ పైలట్‌కు ఏమైంది? విమానం క్షేమంగా కిందికి దిగిందా? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? లాథమ్ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన […]

Share:

271 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం.. బయల్దేరి అప్పటికే 3 గంటలు దాటింది.. భూమ్యాకాశాలకు మధ్యలో.. తన గమ్యం వైపు వేగంగా దూసుకుపోతోంది.. కానీ ఉన్నట్టుండి విమానంలో కలకలం రేగింది. తీవ్ర అనారోగ్యానికి గురైన పైలట్‌.. కొద్దిసేపటి తర్వాత తన సీట్లో కనిపించలేదు.. బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. స్పృహలోలేడు.. తర్వాత ఏం జరిగింది? ఆ పైలట్‌కు ఏమైంది? విమానం క్షేమంగా కిందికి దిగిందా? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

లాథమ్ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787–9 డ్రీమ్‌లైనర్ విమానం.. 271 మంది ప్రయాణికులతో ఫ్లోరిడాలోని మియామి నుంచి చిలీలోని శాంటియాగోకు బయల్దేరింది. ఆగస్టు 14న రాత్రి 10.11 గంటల సమయంలో టేకాఫ్ అయింది. పైలట్ ఇవాన్ అండౌర్ (56)తో పాటు ఓ రిలీఫ్ కెప్టెన్, ఒక ఫస్ట్ ఆఫీసర్‌ విమానంలో‌ ఉన్నారు. టేకాఫ్ అయిన దాదాపు 3 గంటల తర్వాత.. పైలట్ ఇవాన్ అండౌర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించగా.. కొద్దిగా కోలుకున్నారు. తర్వాత బాత్రూమ్‌కు వెళ్లిన ఇవాన్.. ఎంతసేపటికీ బయటికి రాలేదు. దీంతో వెళ్లి తీలుపును తెరిచారు. బాత్రూమ్‌లో పైలట్‌ కింద పడిపోయి కనిపించడంతో బయటికి తీసుకొచ్చి ఆయన్ను లేపేందుకు ప్రయత్నించారు. స్పందన లేకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ఎయిర్‌‌లైన్స్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో దగ్గర్లోని పనామా ఎయిర్‌‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు. ఎయిర్‌‌ ట్రాఫిక్‌ నుంచి పర్మిషన్ రాగానే.. విమానాన్ని కో పైలట్ ల్యాండ్‌ చేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యుల బృందం.. పైలట్ ఇవాన్‌ను పరిశీలించింది. కానీ ఇవాన్ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.  

అమూల్య సహకారాన్ని అందించారు

ఈ విషాద ఘటనపై లాథమ్ ఎయిర్‌‌లైన్స్ సంస్థ స్పందించింది. తమ పైలట్ చనిపోయిన విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘మియామి– శాంటియాగో దారిలో వెళ్తున్న లాథమ్ ఎయిర్‌‌లైన్స్ గ్రూప్ విమానం ‘ఎల్‌ఏ505’.. పనామాలోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మా ముగ్గురు క్రూ మెంబర్లలో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో మెడకల్ ఎమర్జెన్సీ కారణంగా అక్కడ దిగింది. విమనం ల్యాండ్‌ కాగానే.. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ‘లైఫ్ సపోర్ట్’ అందించారు. కానీ దురదృష్టవశాత్తు పైలట్ చనిపోయారు” అని వెల్లడించింది.  

కెప్టెన్ ఇవాన్.. తమ ఎయిర్‌‌లైన్స్‌లో చాలా కాలంగా పని చేస్తున్నారని, పైలట్‌గా ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉందని చెప్పింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తన అంకితభావంతో, వృత్తి నైపుణ్యంతో అమూల్య సహకారాన్ని అందించారని గుర్తు చేసుకుంది. మరోవైపు ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు వివరించింది. తర్వాత పనామా సిటీ నుంచి చిలీకి విమానం తిరిగి బయల్దేరి వెళ్లిందని చెప్పింది. 

మార్చిలో కూడా ఇలాంటి ఘటనే

ఇటీవల విమాన ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు లాథమ్ ఎయిర్‌‌లైన్స్ లాంటి ఘటనే.. మార్చిలోనూ జరిగింది. అది కూడా అమెరికాలోనే చోటుచేసుకుంది. సౌత్ వెస్ట్ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే.. లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టులో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. పైలట్‌ కుప్పకూలిపోవడంతో వెంటనే విమానాన్ని మళ్లించారు. అయితే అదే విమానంలో ఆఫ్ డ్యూటీ పైలట్ కూడా ఉండటం మంచిదైంది. రేడియో కమ్యూనికేషన్ల సాయంతో విమానాన్ని అతడు సురక్షింగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.