తెలంగాణలో 2023-2024 నుంచి తరగతులు ప్రారంభించడానికి ఆరు మెడికల్ కళాశాలలకు అనుమతి

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం  వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న యువతకు బంగారు భవిష్యత్తును అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పనులు ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే డాక్టర్ అవ్వాలనే ఎంతోమంది విద్యార్థుల కలను సాకారం చేయడానికి మరోసారి కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలంగాణ ఆరోగ్యశాఖ […]

Share:

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథం  వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న యువతకు బంగారు భవిష్యత్తును అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పనులు ఎంతోమందికి ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే డాక్టర్ అవ్వాలనే ఎంతోమంది విద్యార్థుల కలను సాకారం చేయడానికి మరోసారి కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు బుధవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ట్వీట్  చేశారు. 

ఈ మేరకు తెలంగాణలోని ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2023 – 2024 విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభించేందుకు జాతీయ వైద్య కమిషన్ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభించనున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడికల్ కాలేజీ లకు అనుమతి లభించింది. అంటే జనగాం, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి లో ఉన్న మెడికల్ కాలేజ్ లకు అనుమతి లభించింది. ఇప్పుడు నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియ తొలి దశకు చేరుకుంది అంటూ ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. ఇక ఇదే విషయంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దార్శనికత ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడంలో శరవేగంగా ముందుకు సాగుతున్నదని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

నేషనల్ మెడికల్ కమిషన్ తెలంగాణలోని ఆరు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి మంజూరు చేయగా ప్రతి కాలేజీలోనూ ఒక్కొక్క కాలేజీ చొప్పున 100 ఎంబిబిఎస్ సీట్లు కలిగి ఉంటాయని ఆయన వెల్లడించారు.  ప్రభుత్వ వైద్య కళాశాల ఖమ్మం కాలోజి నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, వరంగల్ ఆధ్వర్యంలో 2023 నుండి 2024 విద్యాసంవత్సరానికి ఎంబిబిఎస్ తరగతులను ప్రారంభించడానికి అనుమతి లభించింది. ఇక తరగతిలో ఏప్రిల్ రెండవ వారంలో ప్రారంభం కానున్నాయి.

ఒకవైపు ఖమ్మం లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆమోదం పొందక ముందే రాష్ట్రంలోని కామారెడ్డి, కొమరం భీమ్,  ఆసిఫాబాద్ జిల్లాలలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసి కూడా ఆమోదం తెలిపింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని మంత్రి తెలిపారు. బంగారు తెలంగాణను కాదు ఆరోగ్య తెలంగాణను చూడడమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మొత్తానికి అయితే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఆరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు సంబంధించి అన్ని వివరాలను సీట్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ఎంతోమంది వైద్యవృత్తిని చేపట్టాలి అని అందుకోసం డాక్టర్ చదవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ప్రభుత్వ కళాశాలలో సీట్లు దొరకక తమ లక్ష్యాలను ఛేదించలేకపోతున్న ఎంతోమంది సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి దేశం కూడా హర్షిస్తోంది. ఏది ఏమైనా మధ్యతరగతి, దిగువ తరగతి విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఏకంగా తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అందుబాటులోకి తీసుకురావడం నిజంగా గొప్ప కార్యమని చెప్పవచ్చు.