వైరల్ గా మారిన పెప్పర్ ఫ్రై సీఈఓ చివరి పోస్ట్

కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియనప్పటికీ, దేవుడు ఎందుకో కొన్నిసార్లు మన నోటి నుంచి కొన్ని మాటలు పలికిస్తాడు. అది విన్న కొంతమందికి అప్పుడు అర్థం అవ్వకపోయినా, జరగాల్సిన సంఘటన జరిగిన తరువాత ఆ మాటలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి ఒక సంఘటన ప్రస్తుతం పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి విషయంలో జరిగిందని అంటున్నారు చాలామంది. అసలు విషయం:  బైకర్ మరియు ట్రెక్కర్‌గా ఉండే అంబరీష్ […]

Share:

కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియనప్పటికీ, దేవుడు ఎందుకో కొన్నిసార్లు మన నోటి నుంచి కొన్ని మాటలు పలికిస్తాడు. అది విన్న కొంతమందికి అప్పుడు అర్థం అవ్వకపోయినా, జరగాల్సిన సంఘటన జరిగిన తరువాత ఆ మాటలు గుర్తుకు వస్తాయి. ఇలాంటి ఒక సంఘటన ప్రస్తుతం పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి విషయంలో జరిగిందని అంటున్నారు చాలామంది.

అసలు విషయం: 

బైకర్ మరియు ట్రెక్కర్‌గా ఉండే అంబరీష్ మూర్తి, ముంబై నుండి లేహ్ వరకు మోటార్‌సైకిల్ ట్రిప్స్ కి వెళ్లేవారు. పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు, అంతే కాకుండా CEO అయిన అంబరీష్ మూర్తి తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లడఖ్ మరియు లేహ్ రోడ్‌లను “బైకర్లకు స్వర్గం” అని చెప్పుకొచ్చారు. లేహ్ లో మోటారు సైకిల్ ట్రిప్ లో ఉన్న మూర్తి, హఠాత్తుగా గుండెపోటు రావడంతో, సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ వార్త నిజంగా ఆయన ఫాలోవర్స్ కి ఆయన కుటుంబీకులకు ఎంతగానో కదల్చివేసింది.

బైకర్ మరియు ట్రెక్కర్ అయిన మూర్తి ముంబై నుండి లేహ్ వరకు మోటార్ సైకిల్ యాత్రలకు వెళ్లేవారు. ఆయన మరణానికి ఒక ముందు రోజు అనుకోకుండా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మోటార్‌సైకిల్ డైరీస్ – నాకే ఎందుకు ఇలా అవుతుంది:)?)’ అనే రీల్‌ను పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ పోస్టులో ఈ విధంగా రాసుకుని వచ్చారు..’దేవుడు ఎప్పుడైనా బైకర్ల కోసం స్వర్గాన్ని సృష్టిస్తే, స్వర్గంలోని అన్ని రోడ్లు ఇలా ఉంటాయి అనుకుంటా – ఫ్లాట్, బ్లాక్ టార్మాక్, మధ్యలో కిలోమీటర్ల దూరం నడుస్తున్న హైవే. ఇది మనాలి-లేహ్ హైవే మధ్యలో ఉన్న మూర్ హైవే. మోర్ మధ్యలో, దేవదూతలకు పార్టీ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఏంజెలిక్ బైకర్స్ పార్టీలు అంతేకాకుండా ఆహ్లాదకరమైన పిక్నిక్స్ చేసుకుంటారు,’ అంటూ అతను చెప్పాడు.

తన మోటార్ సైకిల్‌ గేర్ సరిగా పనిచేయకపోవడంతో, మధ్యదారిలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ‘దేవుడు తనను “దేవదూత”గా అంగీకరించడానికి “నిరాకరించాడు” అని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన మరణ అనంతరం, ఆయన ఎక్కువగా ప్రస్తావించిన స్వర్గం, దేవుడు అనే పదాలు వాడుతూ పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్టులు వైరల్ గా మారాయి.

తన బైక్‌తో ఎదుర్కొన్న సమస్య గురించి మాట్లాడుతూ, “నాకు గేర్ సమస్యలు మొదలయ్యాయి. నేను నా బైక్ లో ఉండే మూడవ, నాల్గవ మరియు ఐదవ గేర్‌లను యాక్సెస్ చేయలేకపోయాను. అందుకే నేను కేవలం ఫస్ట్ రెండు గేర్ల సహాయంతో బైక్ రైడ్ చేస్తున్నాను. నేను సెట్ చేయడానికి చూశాను కానీ, ఐన్‌స్టీన్ ఏమి చేస్తాడో అదే చేసాను. నేను ఒక పెద్ద రాయిని తీసుకొని దానితో నా గేర్ పెడల్‌ను కొట్టాను.. అదేమిటో అనుకోకుండా ఆ తర్వాత అంతా బాగానే ఉంది” అంటూ తన పోస్టులో తన బైక్ ప్రేమను బయట పెట్టాడు సీఈవో.

పెప్పర్ ఫ్రై సీఈఓ ఇక లేరు: 

“నా స్నేహితుడు, గురువు, సోదరుడు, నాకు అన్నీ అయినా @అంబరీష్‌మూర్తి ఇక లేరని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. నిన్న రాత్రి లేహ్‌లో గుండెపోటుకు గురై అతనిని కోల్పోయాను. దయచేసి అతని కోసం మరియు అతని కుటుంబ సభ్యులకు మరియు సన్నిహితులకు బలం చేకూర్చాలని ప్రార్థించండి” అని పెప్పర్ ఫ్రై కో ఫౌండర్ ఆశిష్ షా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ చెప్పారు.

ఇ-కామర్స్ రంగంలో ప్రముఖ వ్యక్తి అయిన మూర్తి, క్యాడ్‌బరీ, ICICI AMCమరియు లెవీస్‌తో కలిసి పనిచేసిన తర్వాత 2011లో ఆశిష్ షాతో కలిసి పెప్పర్‌ఫ్రైని స్థాపించారు.