pune: అపార్ట్మెంట్ కొనేందుకు బారులు తీరిన జనం

ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ప్రాపర్టీ (Property) ఉన్నప్పటికీ అది కొన్ని నెలల తర్వాత పెద్ద మొత్తంలో లాభాన్ని తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా మెట్రో సిటీస్ పూనే (pune), ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో ప్రాపర్టీ (Property) ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అయితే ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నప్పటికీ, ప్రజలు మాత్రం ప్రాపర్టీ (Property) కొనేందుకు మాత్రం ఎక్కడా వెనకాడట్లేదని ఒక వైరల్ (viral) గా మారిన వీడియో (Video) చెబుతోంది.  అపార్ట్మెంట్ కోసం బారులు తీరిన జనం:  […]

Share:

ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ప్రాపర్టీ (Property) ఉన్నప్పటికీ అది కొన్ని నెలల తర్వాత పెద్ద మొత్తంలో లాభాన్ని తెచ్చిపెడుతున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా మెట్రో సిటీస్ పూనే (pune), ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో ప్రాపర్టీ (Property) ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. అయితే ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నప్పటికీ, ప్రజలు మాత్రం ప్రాపర్టీ (Property) కొనేందుకు మాత్రం ఎక్కడా వెనకాడట్లేదని ఒక వైరల్ (viral) గా మారిన వీడియో (Video) చెబుతోంది. 

అపార్ట్మెంట్ కోసం బారులు తీరిన జనం: 

పూణె (pune), ఢిల్లీ మరియు ముంబై వంటి మెగాసిటీలలో ప్రాపర్టీ (Property) రేట్లు అనేవి ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. అయితే, అధిక రేట్లు ఉన్నప్పటికీ ప్రజలు ఇల్లు కొనడానికి క్యూ (Queue)లు కడుతున్నారు.  X (ట్విట్టర్ లోని) ఇండియన్‌టెక్‌గైడ్ అనే యూజర్ ఒక పోస్ట్ (Post) చేశారు. పూణేలోని వాకాడ్‌లోని ప్రజలు హౌసింగ్ కాంప్లెక్స్‌గా కనిపించే, అపార్ట్మెంట్ (Apartment) దాని బయట క్యూ (Queue)లో నిల్చున్నట్లు పోస్టులో మనకి కనిపిస్తుంది. కొత్త అపార్ట్‌మెంట్‌ను 1.5-2 కోట్ల కొనుగోలు చేసేందుకు జనం సుమారుఎనిమిది గంటల పాటు నిలబడి ఉన్నారని X వినియోగదారు పేర్కొన్నారు. ఇప్పుడు పోస్ట్ (Post) వైరల్ (viral)గా మారడమే కాకుండా, కొన్ని లక్షల మంది ఈ వీడియో (Video)ని చూసినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో (Video)ను మొదట X వినియోగదారు Ayeits_Ekant ఆన్‌లైన్‌లో పోస్ట్ (Post) చేసారు. పూణేకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాడ్ నగరానికి సమీపంలో ఈ వీడియో (Video) తీశారని ఆయన పేర్కొన్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేయడానికి జనం నిజానికి ఎందుకు అంత ఆత్రుత పడుతున్నారో తమకి అర్థం కావట్లేదు అంటూ చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్లు (Comment) పెడుతున్నారు. ఒక X వినియోగదారు కామెంట్ పెడుతూ, ఫ్రీగా వచ్చిన వాటి గురించి క్యూ (Queue) కట్టినట్లు ఉన్నారని ఉద్దేశం పడ్డాడు. మరొకరు కామెంట్ పెడుతూ, ఎందుకు అక్కడ అంత డిమాండ్ వచ్చింది? మాట్లాడారు. మరొకరు కామెంట్ చేస్తూ.. డెవలప్మెంట్ వాళ్ళు తక్కువ ధరకు ఇస్తున్నారా? లేదంటే.. లొకేషన్ బట్టి కొంటున్నారా? అంటూ అడిగాడు.

చాలా చోట్ల కూడా తాము ఇలాంటివి చూసామని కామెంట్లు (Comment) పెడుతున్నారు కొంతమంది. ఒక X వినియోగదారు ఇలా వ్రాశాడు, బెంగుళూరులో ఇదే జరిగిందని విన్నానని.. ఆస్తి ధర 5 కోట్లకు పైగా ఉందని.. అది నిజమో కాదో తమకి తెలిలేదు కానీ క్యూ (Queue) కట్టిన వారి దగ్గర డబ్బు ఉందని మాత్రం తనకి అర్థమైందని రాసుకొచ్చాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ, ఒక వ్యక్తి కామెంట్ పెడుతూ..బెంగుళూరులో 8 కోట్ల ఆస్తి కోసం ఇలాంటిదే జరిగిందని.. భారీ క్యూ (Queue) కనిపించిందని.. కొన్ని గంటల్లో మొత్తం ఆస్తి అమ్ముడైంది అంటూ వెల్లడించాడు.

ఇటీవలి కాలంలో నిజానికి, సోషల్ మీడియా (Social media)లో మరియు పాప్ సంస్కృతిలో రియల్ ఎస్టేట్ ప్రధాన అంశంగా మారింది. అపార్ట్‌మెంట్‌లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో అద్దెలు వసూలు చేయడం వంటివి.. రియల్ ఎస్టేట్ సంబంధించిన అంశాలు ముఖ్యంగా వార్తల్లో నిలుస్తున్నాయి. 

ఈ సంవత్సరం ప్రారంభంలో జూన్‌లో, రియల్ ఎస్టేట్-సంబంధిత కంటెంట్ కూడా టీవీ షోలలో, యూట్యూబ్ వీడియో (Video)లలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఇటువంటి ట్రెండింగ్ వీడియో (Video)ల ఆధారంగా యష్‌రాజ్ ముఖాటే జింగిల్స్‌ను కంపోజ్ చేసి మంచి ఆదరణ అభిమానాలు దక్కించుకున్నాడు.