G20 సమ్మిట్‌ని వెనకుండి నడిపిస్తోంది వీళ్లే..

రెండు రోజుల G20 సమ్మిట్‌ సదస్సులో భాగంగా తొలిరోజే (శనివారం) న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. భారత్ ఆతిధ్యమిస్తున్న జీ20 సదస్సులో చేసే డిక్లరేషన్ కు సంబంధించి అక్కడక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విదేశాంగమంత్రి జైశంకర్ సహా దౌత్యవేత్తలు ఆయా దేశాల షేర్పాలు, మంత్రులతో చర్చలు జరిపారు. ఫైనల్ గా న్యూఢిల్లీ డిక్లరేషన్ ను మార్పులతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిక్లరేషన్ కు ఆమోదం లభించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అభినందనలు తెలిపిన […]

Share:

రెండు రోజుల G20 సమ్మిట్‌ సదస్సులో భాగంగా తొలిరోజే (శనివారం) న్యూఢిల్లీ డిక్లరేషన్ పై ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. భారత్ ఆతిధ్యమిస్తున్న జీ20 సదస్సులో చేసే డిక్లరేషన్ కు సంబంధించి అక్కడక్కడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విదేశాంగమంత్రి జైశంకర్ సహా దౌత్యవేత్తలు ఆయా దేశాల షేర్పాలు, మంత్రులతో చర్చలు జరిపారు. ఫైనల్ గా న్యూఢిల్లీ డిక్లరేషన్ ను మార్పులతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిక్లరేషన్ కు ఆమోదం లభించినట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.

అభినందనలు తెలిపిన మోదీ

జీ20 సదస్సు తొలి సెషన్‌లో ప్రధాని మోదీ శనివారం ప్రసంగిస్తూ.. న్యూఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఏర్పడిందని అన్నారు. తాను ఈ డిక్లరేషన్‌ను ఆమోదించాలని ప్రకటిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా తమ షెర్పాతో పాటు కష్టపడి పనిచేసిన మంత్రులను అభినందిస్తున్ననంటూ మోడీ వెల్లడించారు. అంతకు ముందు రష్యా యుద్దం విషయంలో డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలపై పాశ్చాత్య దేశాలు అభ్యంతరాలు తెలిపాయి.

శనివారం ఉదయం అంతర్జాతీయంగా విశ్వాస రాహిత్యాన్ని అంతం చేయాలని సభ్యులకు పిలుపునిస్తూ ప్రధాని మోడీ రెండు రోజుల సమ్మిట్‌ను ప్రారంభించారు. ఆఫ్రికన్ యూనియన్‌కు మరింత ప్రాతినిధ్యం వహించే ప్రయత్నంలో బ్లాక్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. శనివారం జీ20 అధ్యక్షుడిగా భారతదేశం ఈ ప్రపంచ విశ్వాస లోటును ఒక విశ్వాసంగా మార్చాలని మొత్తం ప్రపంచానికి పిలుపునిస్తోంది” అని ఆయన అన్నారు. “మనమందరం కలిసి కదలాల్సిన సమయం ఇది” అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆశయాలపై గ్రూపులో విభేదాల మధ్య ఇవాళ సదస్సు ప్రారంభమైంది. 2022లో ఇండోనేషియాలో జరిగిన సమ్మిట్ సందర్భంగా ఉక్రెయిన్‌లో యుద్ధంపై సమూహం తీవ్రంగా విభజించబడింది. ఎందుకంటే చాలా దేశాలు రష్యాపై దాడిని ఖండించినప్పటికీ, భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయని డిక్లరేషన్ పేర్కొంది. 

సమ్మిట్‌కి వీళ్లే లీడర్లు

జీ20 సదస్సు రెండో రోజుకి చేరుకుంది. నేడు (సెప్టెంబర్ 10) పూర్తిస్థాయిలో వాతావరణ మార్పులపై చర్చ జరగనుంది. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీ డిక్లరేషన్‌ని G20 సభ్యులందరూ ఆమోదించారు. దీనిపై భారత్ సంతోషం వ్యక్తం చేసింది. రెండో రోజు కూడా ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ధీమాగా చెబుతోంది. అయితే…ఈ సదస్సులో ఎలాంటి అవాంతరాలు రాకుండా…షెడ్యూల్‌లో ఎలాంటి తేడాలు రాకుండా చూసుకున్నారు G20 షెర్పా.

 సింపుల్‌గా చెప్పాలంటే…ఈ మొత్తం సమ్మిట్‌కి వీళ్లే లీడర్‌లు. భారత్ G20 షెర్పాగా బాధ్యతలు తీసుకున్నారు అమితాబ్ కాంత్. టీమ్‌తో కలిసి ఈ సదస్సు సక్సెస్ అయ్యేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం దాదాపు 200 గంటల పాటు చర్చలు జరిగాయని అమితాబ్ కాంత్ వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చివరకు అది సాధించింది భారత్. ఈ విషయంలో షెర్పా పాత్ర కీలకం.

300 ద్వైపాక్షిక చర్చలు జరిపి 15 డ్రాఫ్ట్‌లు ఈ సదస్సులో ప్రవేశపెట్టారు. ఆ తరవాత వీటన్నింటికీ G20 నేతలు ఆమోద ముద్ర వేశారు. ఈ ఘనత సాధించడంపై తన టీమ్‌ని అమితాబ్ కాంత్ అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ట్వీట్ కూడా చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయానికి రావడమే అతిపెద్ద సవాలు. కానీ దీన్ని సాధించగలిగాం. ఇందుకోసం 200 గంటల పాటు చర్చలు జరిగాయి. 300 ద్వైపాక్షిక చర్చలు నిర్వహించాల్సి వచ్చింది. ఇదంతా సాధ్యం కావడానికి నా టీమ్‌ మెంబర్సే కారణం. నాకు అన్ని విధాలుగా సహకరించారు. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు’ అని అమితాబ్‌ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు.