పవన్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీలో ఇప్పుడు వరుస పెట్టి రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అరెస్టులతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఏపీకి మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిని ఖండిస్తున్నారు. కొంత మంది ఏకంగా చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్తున్నారు. వీరందరి వల్ల శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని భావించిన […]

Share:

ఏపీలో ఇప్పుడు వరుస పెట్టి రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అరెస్టులతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఏపీకి మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిని ఖండిస్తున్నారు. కొంత మంది ఏకంగా చంద్రబాబును పరామర్శించేందుకు వెళ్తున్నారు. వీరందరి వల్ల శాంతి భద్రతలు అదుపుతప్పుతాయని భావించిన పోలీసులు వారిని వరుస బెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు. తర్వాత నెమ్మదిగా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత వారిని వదిలేస్తున్నారు. ఇలా అరెస్ట్ అయిన వారి లిస్ట్ భారీగానే ఉంది. అయినా కానీ నేతలు ఈ అరెస్టులకు భయపడడం లేదు. తాము అనుకున్నది చేస్తున్నారు. పోలీసులు కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అరెస్టులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 

రోడ్డు మీద పడుకున్న జనసేనాని

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వార్త తెలియగానే జనసేన పార్టీ అధినేత (వైసీపీ వాళ్లు ప్యాకేజ్ స్టార్ అని పిలిచే పవన్ కల్యాణ్) చంద్రబాబును పరామర్శించేందుకు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఏపీలోని విజయవాడకు బయల్దేరారు. దీంతో ఎలాగోలా విషయం తెలుసుకున్న పోలీసులు అతడు విజయవాడకు వస్తే పరిస్థితులు అదుపుతప్పుతాయని భావించారు. అందుకోసమే ఏపీ బార్డర్ ఎన్టీఆర్ జిల్లా వద్దే పవన్‌ కల్యాణ్‌, జనసేన సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనను ఎలా అదుపులోకి తీసుకుంటారు. తాను తప్పకుండా విజయవాడకు వెళ్లే తీరుతానని పవన్ కల్యాణ్ పోలీసులతో కొద్ది సేపు వాగ్వాదం పెట్టుకున్నారు. తనను అదుపులోకి తీసుకునేందుకు వీలు లేదంటూ ఆయన రోడ్డు మీదే పడుకుని నిసరస తెలిపారు. తాను పోలీసుల వెంట వచ్చేది లేదని అంటూ అక్కడే బైఠాయించారు. వీరిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు. వారి మీద ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. తాను మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబును కలిసేందుకు విజయవాడ కు తప్పకుండా వెళ్తానని పవన్ తెలిపారు. 

ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా.. 

జనసేనాని చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లాలని మొదట భావించారు. కానీ అతడి ప్రత్యేక విమానాన్ని టేకాఫ్ కాకుండా చేయడంలో పోలీసులు సఫలం అయ్యారు. ఇక వేరే గత్యంతరం లేక జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు. అయినా కానీ పోలీసులు అతడిని విజయవాడకు వెళ్లేందుకు అనుమతించలేదు. ఎన్టీఆర్ జిల్లాలో అతడు వెళ్తున్న కాన్వాయ్ ని అడ్డుకున్నారు. దీంతో సేనాని చేసేదేం లేక తన వాహనం దిగి విజయవాడలోని మంగళగిరి వైపు వెళ్లాల్సి వచ్చింది. 

విజయవాడ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో కల్యాణ్ అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి, ముందస్తు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఒత్తిడి చేశారు. కల్యాణ్, మనోహర్‌ లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు అంతే కాకుండా వారి ఇద్దరిని విజయవాడకు తీసుకెళ్తున్నట్లు నందిగామ సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారి జనార్దన్‌నాయుడు మీడియాకు తెలియజేశారు. కేవలం ప్రివెంటివ్ కస్టడీ మాత్రమే కాబట్టి వీరిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచబోమని ఆయన పేర్కొన్నారు. దీంతో జనసేనానికి కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా పోయింది కానీ అతడిని కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెడితే ఏం జరిగేదో… ఒక వేళ కోర్టు అతడిని మందలించేదో లేక పోలీసులు ఇలా చేయడం కరెక్ట్ కాదని పోలీసులనే మందలించేదో కానీ జనసేనాని మాత్రం కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవలే భవదీయుడు భగత్ సింగ్ రెండో షెడ్యూల్ ను మూవీ యూనిట్ మొదలు పెట్టి అందుకు సంబంధించి ఒక యాక్షన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. కానీ రెండు రోజులు కూడా పవన్ షూటింగ్ లో పాల్గొనకముందే చంద్రబాబు అరెస్ట్ జరిగిపోయింది. దీంతో పవన్ కల్యాణ్ హుటాహుటిన షూటింగ్ వదిలేసి విజయవాడకు బయల్దేరి వచ్చారు. దీంతో ఆ మూవీ షూటింగ్ మరోమారు వాయిదా పడింది.