పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

గ్రామ వాలంటీర్ సిస్టం ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2019లో మొదలుపెట్టారు. ప్రతి ఇళ్లకు వెళ్లి వాళ్లకి సంబంధిత వెల్ఫేర్ స్కీములు మరియు ఆదాయాలను వివరించడం కోసం వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాలంటీర్స్ తమ పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శ:  జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఈ ఆదివారం పబ్లిక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో వాలంటీర్స్ పై విమర్శలు […]

Share:

గ్రామ వాలంటీర్ సిస్టం ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2019లో మొదలుపెట్టారు. ప్రతి ఇళ్లకు వెళ్లి వాళ్లకి సంబంధిత వెల్ఫేర్ స్కీములు మరియు ఆదాయాలను వివరించడం కోసం వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాలంటీర్స్ తమ పనిని సక్రమంగా నిర్వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ విమర్శ: 

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఈ ఆదివారం పబ్లిక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంలో వాలంటీర్స్ పై విమర్శలు వెల్లడించారు. వాలంటీర్స్ తమ పని సక్రమంగా చేయట్లేదని వాళ్లు మహిళలను టార్గెట్ చేసి, ప్రతి ఇంట్లో ఉండే వంటరి మహిళల గురించి సమాచారాన్ని డేటా బేస్ కి అందిస్తున్నట్టు, ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని పవన్ వాలంటీర్లు ఉద్దేశించి మాట్లాడారు.

గత నాలుగు సంవత్సరాలుగా చూసుకుంటే 18 మహిళలు మిస్సింగ్ కంప్లైంట్స్ వచ్చాయని కానీ వాటిని ఎవరూ పట్టించుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వాలంటీర్స్ అందరూ ఒంటరిగా మహిళలు నివసించే ఇళ్లలపై టార్గెట్ చేశారని వారి సమాచారాన్ని సేకరిస్తున్నారని, కిడ్నాప్ లకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

కేసు పెట్టిన వాలంటీర్: 

ఈ విషయంపై స్పందించిన ఒక గ్రామ వాలంటీర్ దిగమంటే సురేష్ బాబు అనే వ్యక్తి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 153 సెక్షన్స్ కింద కేసు పెట్టాడు. 

వైయస్సార్సీపి టాప్ లీడర్స్ కొంతమంది ఉమెన్ ట్రాఫికర్స్గా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ మహిళల కమిషన్ ఈ సోమవారం జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ఫై కేసులో జారీ చేసింది. వెంటనే ఆయన వాలంటీర్లు పై చేసిన ఆరోపణలకి సరైన ఆధారాలను సమర్పించాలని తెలిపింది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని సాగిస్తూ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ సిస్టం ని వాళ్ళ చేస్తున్న అన్యాయాలని ఆపాలంటూ తెలిపారు. వాలంటీర్స్ ప్రతి ఇళ్లలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే సేకరించిన సమాచారానంతటిని నానక్రం గూడా అనే ప్రాంతంలో ఒక ఏజెన్సీలో స్టోర్ చేసినట్లు కూడా తెలిపారు.

విలేజ్ వాలంటరీ సిస్టం ఆగస్టు 2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. వారు ప్రతి ఇళ్లకు వెళ్లి అందే స్కీములు మరియు ఇతర వివరాలను తెలపడం కోసం నియమింపబడ్డారు. వాలంటీర్లకు నెలకు 5000 వరకు జీతం వస్తుంది. మొదట్లో రెండు లక్షలకు పైగా వాలంటీర్ లో నియమించబడ్డారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. 

పోలీసుల దర్యాప్తు: 

అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శల వల్ల వాలంటీర్లు స్పందించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్ పై గ్రామ వాలంటీర్ క్రిమినల్ కేస్ ని పెట్టాడు. అవేమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తన పోరాటాన్ని సాగించారు. ఆదివారం జరిగిన ర్యాలీలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై వాలంటీర్లు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు వాలంటీర్లను చాలా ఆందోళనకు గురిచేసింది. వాలంటీర్లు కేవలం అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కోసం మరియు కిడ్నాప్లు చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాచారం, తప్పుడు ప్రచారం అని వాలంటీర్లు తెలిపారు. విజయవాడకు చెందిన వాలంటీర్ ఈ విషయంపై స్పందించి జనసేన పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ గారిపై కృష్ణ లంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై స్పందించి వివిధ రంగాలలో సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై కొంతమంది వైసిపి కార్యకర్తలు కూడా స్పందించారు.