ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించిన పార్టీలు

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సిపి, మరియు తెలుగుదేశం పార్టీ ఒకరు మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించిన పార్టీలు:  ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి, రాష్ట్ర ఓటర్ల జాబితా నుండి బోగస్ ఎంట్రీలను తొలగించాలని, అంతేకాకుండా, ఓటర్ల జాబితాను తారుమారు చేసే […]

Share:

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సిపి, మరియు తెలుగుదేశం పార్టీ ఒకరు మీద ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎలక్షన్ కమిషన్ను ఆశ్రయించిన పార్టీలు: 

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి, రాష్ట్ర ఓటర్ల జాబితా నుండి బోగస్ ఎంట్రీలను తొలగించాలని, అంతేకాకుండా, ఓటర్ల జాబితాను తారుమారు చేసే క్రమంలో ఉన్నారంటూ ఒకరు పార్టీని మరొకరు దూషించుకున్నారు. టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు వైయస్ఆర్ కాంగ్రెస్ “ఎన్నికల పద్ధతులను తారుమారు చేస్తోందని” ఆరోపించారు. అంతే కాకుండా, ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేయడానికి పోల్ ప్యానెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనిఖీలు చేయవలసిందిగా ఆయన కోరారు.

నకిలీ ఓట్లను తొలగించండి: 

ఈ క్రమంలోనే, పోల్ ప్యానెల్‌ను కలిసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అర్హులైన ఓటర్లందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని, అయితే ఇక మరణించిన ఓటర్ల పేర్లు మీద నమోదు అవుతున్న “నకిలీ” ఓటర్లను తొలగించాలని కోరుతూ ఒక మెమోరాండం అందజేశారు. ఓటర్ల డేటా, ఆధార్ నంబర్లను ప్రైవేట్ ఏజెన్సీలకు ‘బదిలీ’ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్నికలకు సంబంధించిన పనిని నిర్వహించడానికి, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికి బదులుగా ఉపాధ్యాయులు మరియు ఇతర డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఎన్నికల పనుల కోసం వెళ్లేలా ప్రత్యేకించి చూడాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ని కోరారు. ఫోరెన్సిక్ నైపుణ్యాలు కలిగిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి అంతేకాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఫైర్ అయిన బొత్స: 

ఎన్నికల వేళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు మార్పుల కోసం పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు గురించి, ఆయన చెప్పే మాటలు గురించి మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. ఎలక్షన్స్ సందర్భంగా పలు ప్రాంతాలలో సందర్శిస్తున్న చంద్రబాబు నాయుడు, వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ఒక ముసలి నక్క అంటూ, రాష్ట్రాన్ని మళ్ళీ చేజెక్కించుకుని నాశనం చేసే క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేరుకుతున్నారని, అతని మాటలు నమ్మి ఓటు వేస్తే చివరికి మిగిలేది ఏంటో అందరికీ తెలుసు అంటూ వాక్యానించారు మంత్రి బొత్స. సేవ చేస్తున్న సచివాలయ, గ్రామ వాలంటీర్లు గురించి ఆరోపణలు చేస్తున్న నాయకులు మీద ఫైర్ అయ్యారు బొత్స. 

ఇటీవల చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన రోజా: 

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎక్కడ చూసినా గంజాయి రవాణా జరుగుతుందని రాష్ట్రం మీద ఆరోపనులు చేయడం జరిగింది. అయితే దీనికి కౌంటర్ గా రోజా మాట్లాడుతూ, అయితే అలాంటి గంజాయి కేవలం హెరిటేజ్ కార్యాలయాల్లోనే దొరుకుతాయని, బహుశా టిడిపి నేతలు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం కుప్పంలో దాచిపెట్టారేమో అని టిడిపి పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా.

అంతేకాకుండా, చంద్రబాబు నాయుడు నిజానికి రాయలసీమ ద్రోహి అని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు గానీ, ఆ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ పేరుతో సందర్శించే హక్కు గాని చంద్రబాబు నాయుడుకి లేవు అని రోజా గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుకి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవలసిన పనిలేదని, అసలు ప్రాంతాన్ని డెవలప్ చేయలేని వాళ్ళకి అలాంటి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించారు రోజా.