ఇప్పుడు పాత పార్ల‌మెంట్ భ‌వ‌నం ప‌రిస్థితి ఏంటి?

నేటి నుంచి పార్లమెంట్ భవనం మారనున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు నరేంద్ర మోదీ సమాచారాన్ని అందిస్తూ, పాత పార్లమెంట్ భవనానికి నమస్కరించుకుని, నేటి నుంచి పార్లమెంట్ లో జరిగే ప్రతి సమావేశం కూడా కొత్త భవంతిలో జరుగుతున్నాయని వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ లో జరగబోయే ప్రత్యేకమైన సమావేశాలలో, మొదటిగా 75 ఏళ్ల ప్రయాణం గురించి ప్రస్తావించడం జరుగుతుందని వెల్లడించడం జరిగింది. నేటి నుంచి అమల్లోకి: నేటి నుంచి పార్లమెంట్‌ కార్యకలాపాలు కొత్త […]

Share:

నేటి నుంచి పార్లమెంట్ భవనం మారనున్నట్లు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు నరేంద్ర మోదీ సమాచారాన్ని అందిస్తూ, పాత పార్లమెంట్ భవనానికి నమస్కరించుకుని, నేటి నుంచి పార్లమెంట్ లో జరిగే ప్రతి సమావేశం కూడా కొత్త భవంతిలో జరుగుతున్నాయని వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ లో జరగబోయే ప్రత్యేకమైన సమావేశాలలో, మొదటిగా 75 ఏళ్ల ప్రయాణం గురించి ప్రస్తావించడం జరుగుతుందని వెల్లడించడం జరిగింది.

నేటి నుంచి అమల్లోకి:

నేటి నుంచి పార్లమెంట్‌ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది పార్లమెంట్ పాత భవనం. 1927 లో ఈ భవనాన్ని నిర్మించడం పూర్తయింది. 96 సంవత్సరాలుగా ఈ భవనం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, నేటి అవసరాలకు సరిపోవడం లేదని తేలింది. లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పాత భవనంలోని ప్రతి ఇటుకకు నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఎంపీలు తమ కొత్త ఆశలతో విశ్వాసంతో, కొత్త భవనంలోకి అడుగుపెట్టబోతున్నారని వెల్లడించారు.

పాత భవనం అలానే ఉంటుంది:

బ్రిటీష్ సర్ ఎడ్విన్ లుటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ రూపొందించిన ఐకానిక్ పార్లమెంట్ భవనం స్వాతంత్ర పోరాటానికి మాత్రమే కాకుండా, స్వాతంత్రం ఆరాధన భారత దేశంలో పలు అంశాల ఎదుగుదలకు కూడా సాక్ష్యంగా నిలిచింది. అయితే కొత్త భవనంలోకి పార్లమెంట్ మార్చబడిన అనంతరం, భవనాన్ని కూల్చివేయడం లేదని, పార్లమెంటరీ కార్యక్రమాల కోసం మరిన్ని హంగులతో, మళ్లీ కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటలతో తిరిగి వస్తుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

2021లో అప్పటి కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో ప్రస్తుత పార్లమెంట్ భవనానికి మరమ్మత్తులు చేయించాలని.. ఆ తరువాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అవసరాలకు పాత భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పడం జరిగింది. హెరిటేజ్-సెన్సిటివ్ పునరుద్ధరణ కోసం కొత్త పార్లమెంట్ భవనానికి మార్చనున్నట్లు వారు తెలిపారు. ఇది పాత పార్లమెంటు భవనానికి మరింత సహాయం చేస్తుంది అని కొన్ని వర్గాలు తెలిపాయి. పాత భవనంలో కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. 

కొత్త భవనం విశేషాలు:

కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు మరియు రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు.

త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది కొత్త పార్లమెంట్ భవనం. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ప్రత్యేక ఆకర్షణ. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్.. కర్మ ద్వార్. VIPలు, MPలకు, అదేవిధంగా పార్లమెంట్ చూసేందుకు వచ్చే సందర్శికులకు ప్రత్యేకమైన ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది. 

పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రయాణం: 

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చ జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నియంత్రించే ఒక బిల్లుతో సహా నాలుగు బిల్లులు భాగం కాబోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ 9, 1946న సమావేశమైన పార్లమెంట్ తొలి సభపై, పార్లమెంట్ కి సంబంధించి 75 ఏళ్ల ప్రయాణం చర్చతో ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.