కుండని పెళ్లి చేసుకోమని బలవంతపెడుతున్న తల్లిదండ్రులు

భారతదేశంలో రోజురోజుకు టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకి చంద్రయాన్ 3 మిషన్ పంపించి సత్తా చాటుకుంది భారత్. ఆడవాళ్లు మగవారితో సమానంగా అంతరిక్షంలోకి వెళ్లి తమ శక్తిని చూపుతున్నారు. ఇటువంటి క్రమంలో ఇంకా భారతదేశంలోని కొన్ని మూఢనమ్మకాలు మాత్రం అలాగే ఉన్నాయి అని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. తన పెళ్లి సవ్యంగా జరగాలని, తన భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బ్రతకాలని, ముంబైకి చెందిన 26 ఏళ్ల అమ్మాయికి, ఒక […]

Share:

భారతదేశంలో రోజురోజుకు టెక్నాలజీ పరంగా డెవలప్ అవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకి చంద్రయాన్ 3 మిషన్ పంపించి సత్తా చాటుకుంది భారత్. ఆడవాళ్లు మగవారితో సమానంగా అంతరిక్షంలోకి వెళ్లి తమ శక్తిని చూపుతున్నారు. ఇటువంటి క్రమంలో ఇంకా భారతదేశంలోని కొన్ని మూఢనమ్మకాలు మాత్రం అలాగే ఉన్నాయి అని కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నాయి. తన పెళ్లి సవ్యంగా జరగాలని, తన భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బ్రతకాలని, ముంబైకి చెందిన 26 ఏళ్ల అమ్మాయికి, ఒక కుండని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆ అమ్మాయి ఏమంటుందో మీరే చూడండి.. 

మీరే సలహా ఇవ్వండి ఫ్రెండ్స్: 

ముంబైకి చెందిన 26 ఏళ్ల అమ్మాయి రీడిట్ లో తన తల్లిదండ్రులు చేస్తున్న తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. తన పెళ్లి సవ్యంగా జరగాలని తన భర్త నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు తనని బలవంతంగా ఒక కుండనిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు చూస్తున్నారని వాపోతోంది. తనకి ఇటువంటి మూఢనమ్మకాల మీద నమ్మకం లేదని, కానీ తమ తల్లిదండ్రులు మాత్రం తన మాటకు అసలు గౌరవమే ఇవ్వకుండా పక్కకు నెడుతున్నారని ఇంకా చాలా చేస్తున్నారని రీడిట్ అనే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తుంది. తనని కుండని పెళ్లి చేసుకోమని బలవంతంగా ఫిసికల్గా బలవంతపెడుతున్నారని, ప్రతిరోజు ఇదే ఇంట్లో జరుగుతున్న తంతు అని, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నానని, అడ్వైస్ అడుగుతుంది ఆ అమ్మాయి. 

తను తన నిర్ణయం మీద నిలబడాలి అనుకుంటున్నట్లు, అంతేకాకుండా ఈ విషయాన్ని సవ్యంగా పరిష్కరించే విధంగా, సోషల్ మీడియా రీడిట్ ద్వారా అడ్వైస్ అడుగుతోంది. ఈ వార్త విన్న చాలా మంది తమదైన శైలిలో కామెంట్ల రూపంలో తనకి అడ్వైస్ ఇస్తున్నారు. 

స్పందించిన నెటిజన్లు: 

ఒక నెటిజన్ ఈ విషయాన్ని హాస్యాస్పదంగా మార్చమని సలహా ఇచ్చాడు. ఒకవేళ తన కుండని పెళ్లి చేసుకోవాలంటే తప్పకుండా ఫోటోగ్రాఫర్లకు ఎక్కువ మొత్తంలో ముట్ట చెప్పాలని, నిజంగా వరుడుతో పెళ్లి జరిగినప్పుడు ఈ ఫోటోలని చూపిస్తే సరిపోతుందని, లేదంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించొచ్చు అని ఆ అమ్మాయికి సలహా ఇచ్చాడు ఒక నెటిజన్. మరొక నెటిజన్ ఇలా రాస్కొచ్చింది, తాను కూడా ఒక కుండని పెళ్లి చేసుకుని అదే రోజు విడాకులు తీసుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ కుండని తన చేతులతోనే పగలగొట్టినట్లు, ఆ పగిలిన శబ్దాలు కూడా తన చెవిలో మారురోగుతున్నట్లు ఇప్పటికీ ఆ సంఘటన తన కళ్ళముందే తిరుగుతున్నట్లు మాట్లాడింది. ఆ సంఘటన జరిగింది కొన్ని సెకండ్ల పాటు అయినప్పటికీ.. తనకి జరిగింది చెప్పడానికి మరో ఎపిసోడ్ కావాలంటూ తన విషయం బయట పెట్టింది నేటిజన్. 

ఇక మరొకరు మాట్లాడుతూ, ఏదైనా జరగాలంటే భారతదేశంలోనే జరుగుతుందని, ఒక కుండని పెళ్లి చేసుకోవడం అనేది ఇక్కడే జరుగుతుందని మాట్లాడారు. అంతేకాకుండా ఇతర దేశాల విషయం కూడా మాట్లాడుతూ, జపాన్ అదేవిధంగా చాలా దేశాలలో బొమ్మలను, కుక్కలను ఏకంగా దెయ్యాలను పెళ్లి చేసుకున్న సంఘటన కూడా ఉన్నాయని, అయితే ఇప్పుడు భర్తగా రాబోతున్న కుండ విషయం వింటున్నట్లు రాసుకొచ్చారు నెటిజన్. ఏదిఏమైనాప్పటికీ, నమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు ఉండొచ్చు కానీ మూఢ నమ్మకాలతో ఒకరి అభిప్రాయాలను అగౌరపరచడం మంచి విషయం కాదని చెప్పుకోవాలి. పిల్లల పెళ్లి విషయంలో ఆలోచించి అడుగువేయడంలో తప్పులేదు, కానీ మూఢనమ్మకాలతో పిల్లలకు ఇష్టంలేని పనులను చేస్తే తర్వాత బాధపడేది కుటుంబం. అందుకే మూఢనమ్మకాలను పక్కనపెట్టి మొదట మనుషులమని, ఎదుటి వారి మీద మానవత్వంతో ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకుందాం.