పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కి బెయిల్..

పదో తరగతి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ 1 గా పేర్కొన్న బండి సంజయ్‌ను బుధవారం అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు గురువారం కోర్టులో ఊరట లభించింది.. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  హిందీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బండి సంజయ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు […]

Share:

పదో తరగతి పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ 1 గా పేర్కొన్న బండి సంజయ్‌ను బుధవారం అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనకు గురువారం కోర్టులో ఊరట లభించింది.. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

హిందీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి బండి సంజయ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 120 బి, 420, 447, 505 (1) బి, ఐ పి సి , 4(ఏ), 6 రెడ్ విత్ ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997 తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా వరంగల్ సిపి రంగనాథ్ గురువారం వెల్లడించారు. ప్రశాంత్ – బండి సంజయ్‌ల మధ్య తరచూ వాట్సాప్ కాల్స్ నడిచాయని వెల్లడించారు. లీక్ అంశాన్ని ప్రశాంత్ మీడియాకు చేర్చిన తర్వాత బండి సంజయ్‌కు పంపించాడని పేర్కొన్నారు. మహేష్ అనే వ్యక్తి కూడా బండి సంజయ్‌కి పేపర్ పంపించారని తెలిపారు. ఎ2 ప్రశాంత్ , ఎ3 మహేష్, ఎ4 గా మైనర్ బాలుడు, ఎ5 గా శివ గణేష్,  ఎ 6 గా పోగు సుభాష్ , ఎ 7 గా పోగు శశాంక్,  ఎ 8 గా దూలం శ్రీకాంత్, ఎ 9 గా పెరుమాండా శార్మిక్ , ఎ 10 గా వసంత్ ఉన్నారని సిపి ప్రకటించారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు గురువారం సామీర్ పేటలోని ఈటల నివాసానికి వచ్చిన పోలీస్ అధికారి 160 సిఆర్ పిసి కింద నోటీసు అందజేశారు. ఈటలతో పాటు ఆయన పిఏ రాజు, నరేంద్రలకు కూడా నోటీసులు అందజేశారు. విచారణకు వచ్చేటప్పుడు తనతో పాటు ఫోన్ కూడా తీసుకురావాలని కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా తెలిపారు. దీనిపై స్పందించిన ఈటల నోటీసులు అందినట్లు తెలిపారు..

తెలంగాణ పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావటం తెలిసిందే. ఈ కేసులో హనుమకొండ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడం జరిగింది. దాంతో ఆయనను కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ లీగల్ సెల్ టీం బండి సంజయ్ తరుపున హన్మకొండ కోర్టులో బయలు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు హామీ, 20వేల రూపాయల నష్టపరిహారంతో జడ్జి కండిషనల్ బెయిల్ మంజూరు చేశారు. 

పదోతరగతి పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు..  హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బండి సంజయ్ విడుదల నేపథ్యంలో జైలు వద్దకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అయితే కరీంనగర్ జైలు పరిధిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. కాగా జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.