ఆధార్ – పాన్ కార్డుకి లింక్ చేశారో లేదో ఇలా చెక్ చేసుకోండి.. చేయకపోతే ఏం అవుతుందో చూడండి

పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అలర్ట్.. ఇప్పుడు ఏ చిన్న ఆర్థిక లావాదేవీలు జరగాలన్న పాన్ కార్డ్ తప్పనిసరి.. గత కొన్ని రోజులుగా పాన్ కార్డు ఆధార్ కార్డు కి లింక్ చేయాలని వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఆదాయపు పన్ను శాఖ సూచనల మేరకు ఇప్పటికే చాలామంది పాన్ ఆధార్ లింక్ చేసే ఉంటారు. అయితే మార్చి 31, 2023 వరకే గడువు తేదీ ఉంది. ఇప్పటికే చాలామంది లింక్ చేశామని భరోసాగా ఉంటున్నారు. […]

Share:

పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అలర్ట్.. ఇప్పుడు ఏ చిన్న ఆర్థిక లావాదేవీలు జరగాలన్న పాన్ కార్డ్ తప్పనిసరి.. గత కొన్ని రోజులుగా పాన్ కార్డు ఆధార్ కార్డు కి లింక్ చేయాలని వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఆదాయపు పన్ను శాఖ సూచనల మేరకు ఇప్పటికే చాలామంది పాన్ ఆధార్ లింక్ చేసే ఉంటారు. అయితే మార్చి 31, 2023 వరకే గడువు తేదీ ఉంది. ఇప్పటికే చాలామంది లింక్ చేశామని భరోసాగా ఉంటున్నారు. అటువంటివారు మరోసారి వారి ఆధార్ పాన్ కి లింక్ అయిందో లేదో స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే ఏప్రిల్ 1 తరువాత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పాన్ ఆధార్ లింక్ స్టేటస్ ని ఈ విధంగా చెక్ చేసుకోండి.. 

పాన్ ఆధార్ లింక్ స్టేటస్ ప్రాసెస్.. 

పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అధికారిక #htttps://www.incometax.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.

ఈ లింక్ ఓపెన్ చేయగానే ఎడమవైపు క్విక్ లింక్స్ లో లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయాలి.

అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీ పాన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో మీకు అలర్ట్ కనిపిస్తుంది.

పాన్‌‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. ఇప్పటికే దానికి సంబంధించిన గడువు ముగిసింది. అయితే.. రూ.1000 ఫైన్ చెల్లించి మార్చి 31 లోపు అనుసంధానం చేసుకోవచ్చు. 

ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డు ఉన్న వాళ్ళందరూ తమ పాన్ కార్డు నెంబర్ కి తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ చేయాలి. లింక్ చేయని పాన్ కార్డులు 1 ఏప్రిల్  2023 నుంచి పనిచేయకుండా పోతాయి. ప్రస్తుతం ఉన్న అవకాశంలో కూడా జరిమానాతోనే లింక్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. 

2023 మార్చి 31 లోపు లింక్ చేయాలంటే ఫైన్ కట్టాల్సిందే. ఒకవేళ గడువు లోపు పూర్తి చేయకంటే మీ పాన్ కార్డు ఎలాంటి లావాదేవీలకు పనికిరాదు. మీకు ఏవైనా రిఫండ్స్ రావాల్సి ఉన్నట్లయితే అవి నిలిచిపోతాయి. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు నిబంధనలు అడ్డు వస్తాయి. డీ మ్యాట్ ఖాతా ఉన్నా.. షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు. అలాగే ఏవైనా లోపాలు ఉన్నా రిటర్న్స్ సైతం సరి చేయడం కుదరదు. దీని ఫలితంగా ఎక్కువ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చిక్కులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే.. వెంటనే మీ పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం ఉత్తమమైన పని.